తెలంగాణ

telangana

ఆ రాశి వారికి రోజంతా అనవసరమైన ఖర్చులే- జాగ్రత్త పడితే బెటర్!

By ETV Bharat Telugu Team

Published : Mar 9, 2024, 4:59 AM IST

Horoscope Today March 9th 2024 : మార్చి 9న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today March 9th 2024
Horoscope Today March 9th 2024

Horoscope Today March 9th 2024 :మార్చి 9న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :ఈరోజు మీకు లాభదాయకంగా ఉంటుంది. మీరు సోషల్ నెట్వర్కుల్లో నిమగ్నమై ఉంటారు. మీ కొత్త పరిచయాలు రాబోయే రోజుల్లో ఉపయోగకరంగా ఉంటాయి. ఊహించని ఖర్చులకు అవకాశం ఉంది. మీరు వ్యాపారంలో విజయాన్ని ఆశించవచ్చు. మీ పెద్దలు, పైఅధికారులు మీకు సహాయకరంగా ఉండటం చూసి మీరు ఆనందిస్తారు.

వృషభం (Taurus) :ఈరోజు మీకు గొప్పగా ఉంటుంది. మీ వ్యాపారంలో విజయం సాధిస్తారు. ఒకవేళ మీరు సేవా రంగంలో ఉన్నట్లయితే పైఅధికారుల నుంచి సహాయం పొందుతారు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా ఉంటుంది.

మిథునం (Gemini) :ఈరోజు మీకు అంత అనుకూలంగా ఉండదు. శారీరకంగా, మానసికంగా కాస్త ఇబ్బంది పడతారు. మీరు మీ పనులను చేయలేకపోతారు. అనవసరమైన ఖర్చులకు అవకాశం ఉంది.

కర్కాటకం (Cancer) : ఆటంకాలు, సవాళ్లను ఈ రోజు మీరు విజయవంతంగా ఎదుర్కొంటారు. ఏ పరిస్థితి నుంచైనా విజయంతో తిరిగి రావడం మీ లక్ష్యంగా ఉంటుంది. వ్యాపారంలో ఈ రోజు మీరు తీవ్రమైన పోటీని ఎదుర్కొవాల్సి రావచ్చు. వ్యక్తిగత జీవితం ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగిపోతుంది.

సింహం (Leo) :మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య మనస్పర్థలు ఇద్దరికీ వేదన కలిగిస్తాయి. మీ జీవిత భాగస్వామి ఒక రుగ్మతతో బాధపడవచ్చు. మీ సహచరులు, వ్యాపార భాగస్వాములతో ప్రశాంతంగా వ్యవహరించండి. అనవసరమైన, ప్రయోజనంలేని చర్చల్లో పాల్గొనకుండా ఉండటానికి ప్రయత్నించండి.

కన్య (Virgo) : మీకు ఓ మిత్రుడు లక్కీగా దొరుకుతారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరు కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. ముందు మీ సామర్ధ్యం, కఠిన శ్రమ ప్రశంసలందుకుంటుంది.

తుల (Libra) :మీ బాస్ కోపాన్ని మీరు చవి చూస్తారు. మీ తోటి ఉద్యోగులు కూడా మీకు ఇష్టం లేకుండానే సహకారం అందిస్తారు. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న బిగినర్స్ కు ఇంటర్వ్యూల్లో విజయాలు కాస్త ఆలస్యమవుతాయి.

వృశ్చికం (Scorpio) :మాటల్లో జ్ఞానం, చేతల్లో నాయకత్వం- ఈ రోజు మీ తీరు ఇలానే ఉంటుంది. పని ప్రదేశంలో జీతం పెంపు లేదా ఆఫీసు పొజిషన్​కు సంబంధించిన శుభవార్త వింటారు. అకౌంటెంట్లు, ఫ్రాంచైజీలు ఈ రోజు చక్కటి లాభాలు అందుకుంటారు.

ధనుస్సు (Sagittarius) :ఈరోజు మీరు సహనంగా ఉండాలని సూచిస్తున్నాం. అలా ఉండటం ద్వారా మీరు మీ గమ్యాన్ని చేరుకోగలరు. పని ప్రదేశంలో ఎవరితోనూ గొడవ పడకండి. లేదంటే ఆ ఘర్షణల ప్రభావం చాలా తీవ్రస్థాయిలో ఉంటుంది. వ్యక్తిగతంగా చూస్తే ఈ రోజు మీరు మీ భాగస్వామితో సన్నిహితంగా ఉంటారు.

మకరం (Capricorn) :కొన్నిసార్లు ఏదో తెలుసుకోవాలనే తపన మీలో ఉంటుంది. మీరు సరైన ప్రత్యర్థి అని కూడా నిరూపించుకుంటారు. మీ ప్రత్యర్థుల ఆలోచనలను మీరు తలకిందులు చేస్తారు. అది మీకు చాలా ప్రయోజనకరంగా మారుతుంది. మీలో మేధావి కూడా ఉన్నారు. పరిస్థితులు అదుపు తప్పుతున్నప్పుడు మీ వ్యక్తిత్వ శక్తిని మీరు రుజువు చేసుకుంటారు.

కుంభం (Aquarius) : మీ తారాబలం బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు శారీరకంగా, మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు. ట్రిప్​కు ప్లాన్ చెయ్యండి. ఈ రోజు ఆధ్యాత్మికంగా గడపడం మీకెంతో హాయినిస్తుంది. మీ వైవాహిక జీవితం ఆనందంగానే గడుస్తుంది. మీ జీవిత భాగస్వామితో మీరు షాపింగ్​కు వెళ్తారు.

మీనం (Pisces) :మీరు ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు. అదే సమయంలో మీరు మీకు నచ్చిన రంగంలో ముందుకెళ్లి పేరు సంపాదించుకుంటారు. మీ ఆత్మ స్వరాన్ని మీరు వినాలనుకుంటారు. మీ నిజమైన రూపాన్ని చూపాలనుకుంటారు. నిశ్శబ్దంలోనూ మీ మాటను వినగలిగే స్నేహితులతో సరదాగా గడపండి.

ABOUT THE AUTHOR

...view details