తెలంగాణ

telangana

ఆ రాశివారి పెండింగ్ పనులన్నీ ఈరోజు క్లియర్- గొడవలకు దూరంగా ఉంటే మంచిది!

By ETV Bharat Telugu Team

Published : Mar 14, 2024, 5:03 AM IST

Horoscope Today March 14th 2024 : మార్చి 14న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today March 14th 2024
Horoscope Today March 14th 2024

Horoscope Today March 14th 2024 : మార్చి 14న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :ఈ రోజంతా శాంతిమయంగా గడుస్తుంది. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. మీకు అప్పజెప్పే పనులన్నింటినీ అత్యుత్సాహంతో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఈరోజు మీరు లబ్ధి పొందుతారు. మీ స్నేహితులతో, బంధువులతో ఉండే వాతావరణాన్ని ఆనందమయంగా మారుస్తారు.

వృషభం (Taurus) :ఈరోజు మీకు అంత ఆశాజనకంగా ఉండదు. కొన్ని రకాల సమస్యలు ఈ రోజు మీమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. ఆరోగ్యం కూడా ఇబ్బంది పెడుతుంది. మీకు మీ ప్రియమైన వారికి మధ్య విభేదాలు ఏర్పడవచ్చు. తద్వారా మీ కుటుంబ వాతావరణం అనిశ్చితిగా మారుతుంది. మీకు అప్పజెప్పిన పనులను ఈరోజు సకాలంలో పూర్తి చేయకపోవచ్చు.

మిథునం (Gemini) :ఆలోచనల విషయంలో ఈ రోజు మీరు చాలా ఊగిసలాటలో ఉంటారు. ఆచరణ సాధ్యం కాని పనుల జోలికి వెళ్లకుండా ఉండటం ఉత్తమం. భావోద్వేగంతో కూడుకున్న విషయాలపై అతిగా స్పందించకండి. లేదంటే చిక్కుల్లో పడతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. మంచి ఆహారపు అలవాట్లను క్రమంగా అలవాటు చేసుకోండి.

కర్కాటకం (Cancer) :కుటుంబంలోని చిన్నవారిపై ఈ రోజు మీకు అధిక శ్రద్ధ చూపిస్తారు. రోజువారీ పనులను మెరుగుపరుచుకునే విషయంలో వారికి తగిన సూచనలిస్తారు. పోటీలు లేదా ఏదైనా కార్యక్రమంలో పాల్గొనాలనే కోరిక ఈ రోజు మీకు కలుగుతుంది.

సింహం (Leo) :ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. మీరు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి కావాలంటే కాస్త కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ముందుకు సాగండి. అంతా మంచే జరుగుతుంది.

కన్య (Virgo) :బయటకు అందంగా కనిపించాలనే ఆలోచనలో ఈ రోజు మీరు ఉంటారు. ఇందుకోసం మీరు అధికంగా ఖర్చు చేస్తారు. షాపింగ్​కు వెళ్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి.

తుల (Libra) :ఈ రోజు మీరు చాలా హుషారుగా కనిపిస్తారు. మీ దూకుడుకు అదృష్ట దేవత కూడా కాస్త సహకరిస్తుంది. వివాదాలకు, ఘర్షణలకు దూరంగా ఉండండి. సాయంత్రం వేళ ప్రశాంతంగా గడుపుతారు.

వృశ్చికం (Scorpio) :ఈరోజు మీకు అద్భుతంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో ఆనందకరమైన సమయాన్నిగడుపుతారు. మీకు కావాల్సిన వ్యక్తుల నుంచి శుభవార్త వింటారు. తద్వారా మీ సంతోషం రెట్టింపు అవుతుంది. మీ తోటివారి నుంచి అవసరమైన సహాయసహకారాలు అందుతాయి. దీంతో మీ పనులను సమయానికి పూర్తి చేస్తారు. పెండింగ్​లో ఉన్న పనులను ఈ రోజు పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఆర్థికంగా లబ్ధి పొందుతారు.

ధనుస్సు (Sagittarius) :మీకు ఎదురయ్యే అపజయాలకు కుంగిపోవద్దు. కలహాలు రాకుండా జాగ్రత్త పడండి. వీలైతే ప్రయణాలను వాయిదా వేసుకోండి.

మకరం (Capricorn) :ఈ రోజు మీరు శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడతారు. ఇప్పటికే గొడవలు జరుగుతున్న కుటుంబంలో పరిస్థితులు మరింత దారుణంగా తయారవుతాయి. మీ ప్రియమైన వారితో మీరు గొడవ పడే అవకాశం ఉంది. మీ చుట్టూ ఉండే వాతావరణం అంత అనుకూలంగా ఉండదు. అవమానకర పరిస్థితులు ఏర్పడవచ్చు. ఆడవారితో మాట్లాడే సమయంలో ఎక్కువ జాగ్రత్త వహించండి. నీటిగండం ఉంది. జలాశయాలకు దూరంగా ఉండండి. మీ మొండితనం, నిర్లక్ష్య వైఖరి ఈ రోజు మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తాయి.

కుంభం (Aquarius) : ఈ రోజు మీరు వేసే అడుగులు చలాకీగా ఉంటాయి. మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది. మీ చుట్టూ ఏర్పడిన ప్రతికూల పరిస్థితులు తొలగిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఓర్పుతో వ్యవహరించండి. అదృష్టం మీ వెంటే ఉంది.

మీనం (Pisces) :ఈ రోజు మీరు అధిక ఖర్చులు చేయకుండా జాగ్రత్త పడండి. మీ మాటలను, కోపాన్ని అదుపులో పెట్టుకోండి. లేదంటే అవి మీ రిలేషన్స్​పై ప్రభావం చూపిస్తాయి. శారీరకంగా, మానసికంగా ఈ రోజు మొత్తం సాధారణంగా గడుస్తుంది. ప్రతికూలమైన ఆలోచనలు మిమ్మల్ని నిరాశకు గురిచేసే అవకాశం ఉంది. వాటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి.

ABOUT THE AUTHOR

...view details