తెలంగాణ

telangana

ఆ రాశివారు అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి- కొత్త కార్యక్రమాలు వద్దు!

By ETV Bharat Telugu Team

Published : Feb 7, 2024, 4:45 AM IST

Horoscope Today February 7th 2024 In Telugu :ఫిబ్రవరి 7న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

horoscope telugu today
Horoscope Today February 7th 2024 In Telugu

Horoscope Today February 7th 2024 : ఫిబ్రవరి 7న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :ఈరోజు మేష రాశి వారికి సాదాగా ఉంటుంది. ఈ రాశి వారు అలసటగా, బద్దకంగా, అశాంతిగా ఉండే అవకాశం ఉంది. మీరు చాలా నిరుత్సాహంగా చిరాకుగా ఉండటం వల్ల, ముఖ్యమైన పనులు చేయడానికి ఆసక్తి చూపించరు. మీరు దూకుడును తగ్గించుకుని జాగ్రత్తగా ఉంటే మంచిది. చిన్న సమస్యలకే కోపం తెచ్చుకోకుండా ఉండటానికి ప్రయత్నించండి.

వృషభం (Taurus) :మీరు ఈ రోజంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త కార్యక్రమాల జోలికి పోవద్దు. నూటికి నూరుపాళ్లు ఆరోగ్యంగా, ఫిట్​గా ఉంటారు. ఆరోగ్యం చక్కగా ఉండేందుకు మంచి పోషకాహారం తీసుకోండి. ఆందోళన, శారీరక అలసట చికాకు కలిగిస్తాయి. ఆఫీసులో అధిక పని మూలంగా మీరు అలసిపోతారు. ప్రయాణాలు ఫలవంతమవుతాయి. ఆధ్యాత్మికంగా గడపడానికి ప్రయత్నించండి.

మిథునం (Gemini) :ఈ రోజు మీరు ఆనందంగా ఉంటారు. మీ స్నేహితులను కలిసే సూచనలు కనిపిస్తున్నాయి. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో సంతోషంగా విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు. శారీరకంగా మంచి ఫిట్​నెస్, సామాజికంగా మీకు కీర్తి ప్రతిష్ఠలు వచ్చే సూచనలు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామితో మీ సంబంధం స్ఫూర్తినిచ్చేదిగా ఉంటుంది.

కర్కాటకం (Cancer) :ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగులకు ఈ రోజు శుభప్రదం. సహోద్యోగులు సహకరిస్తారు. మీ స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. ఈ రోజు మీకు అన్నివిధాలా అనుకూలిస్తుంది.

సింహం (Leo) :ఈ రోజు మీరు సంతోషంగా గడుపుతారు. మీ కల్పనా శక్తి వెయ్యింతలవుతుంది. ప్రకృతి పరంగా కవితలు రాసేందుకు తగిన ప్రేరణ ఉంటుంది. ప్రియమైనవారిని కలుసుకుంటారు. మీరు మీ పిల్లల గురించి శుభవార్త వింటారు. విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు. స్నేహితులను కలుసుకుంటారు. స్నేహితుల నుంచి లబ్ధి ఉండవచ్చు. మీరు దాన సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కన్య (Virgo) : ఈ రోజు మీకు అంతగా అనుకూలంగా లేదు. మానసికంగా, శారీరకంగా అధిక ఒత్తిడికి గురవుతారు. మీ ప్రియమైన వారితో వాదనకు దిగే అవకాశం ఉంది. ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ జాగ్రత్తగా భద్రపరచండి. జల ప్రమాదం జరిగే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి. స్త్రీలతో జాగ్రత్తగా వ్యవహరించండి. అధిక ఖర్చులు ఉండే అవకాశం ఉంది.

తుల (Libra) :ఈ రోజు మీకు అనుకూలిస్తుంది. మీ సోదరులతోనూ, సంబంధీకులతోనూ స్నేహపూర్వకంగా ఉంటారు. తీర్థయాత్రలకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాల నుంచి శుభవార్త అందుకుంటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త ప్రదేశాలు పర్యటనకు వెళ్తారు. కొత్త పనులు మొదలుపెట్టడానికి ఈ రోజు సరైన సమయం. శారీరకంగానూ, మానసికంగానూ కూడా దృఢంగా ఉంటారు. పెట్టుబడి పెట్టేవారికి ఈ రోజు చాలా శుభప్రదమైనది.

వృశ్చికం (Scorpio) :ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. మీ కుటుంబ సభ్యులతో వాదన పెట్టుకోవద్దు. కుటుంబ సభ్యులతో ఉన్న మనస్పర్థలు తొలగించుకోండి. మీ శారీరక ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త వహించండి. నెగెటివ్ ఆలోచనలు మానేసి, అనైతికమైన కార్యకలాపాల నుంచి దూరంగా ఉండండి. విద్యార్థులు మరింత ఎక్కువ శ్రద్ధ పెట్టి చదవాలి.

ధనుస్సు (Sagittarius) :మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. మీరు చేపట్టే పనులన్నీ సమయానికి పూర్తి చేస్తారు. ఫలితాల్లో ఆర్థిక లబ్ధి ఉంటుంది. తీర్థయాత్రలకు వెళ్లవచ్చు. మీరు బంధువుల ఇంట జరిగే శుభకార్యానికి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. మీ బంధువులను కలుసుకుని వారితో ఆనందంగా గడుపుతారు. మీ వైవాహిక జీవితం సౌకర్యంగా, ఆనందదాయకంగా గడుస్తుంది. ఈ మీరు మంచి రుచికరమైన భోజనం చేస్తారు. మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.

మకరం (Capricorn) : ఏదైనా పని చేసేటప్పుడు ఆలోచించి చేయడం మంచిది. మీరు సంపాదించిన దాని కన్నా ఎక్కువ ఖర్చు చేస్తారు. ధార్మిక , సామాజిక కార్యకలాపాలలో ఎక్కువ పాల్గొనడం వల్ల ఖర్చులు అధికమవుతాయి. ఆరోగ్య సంబంధమైన ఆందోళన ఉండవచ్చు. మీ బంధువులతోనూ, పుత్రులతోనూ మీకు భిన్నాభిప్రాయాలు ఉంటాయి. మీరు చాలా చికాకుగా గడుపుతారు. ఏదైనా పని చేసేముందు జాగ్రత్తగా వ్యవహరించడం మంచింది.

కుంభం (Aquarius) :ఈరోజు మీకు అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు లాభాలు గడిస్తారు. దీంతో మీరు మరింత సంతోషంగా ఉంటారు. ఇది కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. వాణిజ్యంలో ఉన్నవారు ప్రత్యేకంగా ఒక ఫలవంతమైన రోజు కోసం ఎదురుచూడవచ్చు. మీ పేరు ప్రతిష్ఠలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

మీనం (Pisces) :ఈరోజు మీకు ఆహ్లాదకరంగా, అనుకూలంగా ఉంటుంది. అధికారులు మీపై చాలా కృతజ్ఞతా భావంతో ఉంటారు. మీరు వ్యాపార, సేవా రంగంలో ఉన్నా సానుకూలమైన ఫలితాలను ఆశించవచ్చు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆస్తి యోగం ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details