తెలంగాణ

telangana

ఈ రాశివారు సానుకూల దృక్పథంతో పని చేయాలి- లేకుంటే కష్టమే!

By ETV Bharat Telugu Team

Published : Feb 10, 2024, 4:59 AM IST

Horoscope Today February 10th 2024 : ఫిబ్రవరి 10న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today 10 February 2024 In Telugu
Horoscope Today February 10th 2024 In Telugu

Horoscope Today February 10th 2024 : ఫిబ్రవరి 10న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :ఈ రోజు మీరు దూకుడుగా ఉంటారు. ఇతరులతో వాదనలకు దిగే అవకాశం ఉంది. స్నేహితులతో వ్యాపారపరమైన చర్చలతో మధ్యాహ్నాన్ని గడుపుతారు. మీ ఆత్మబంధువు నుంచి ప్రత్యేక ఆతిథ్యము పొందే అవకాశం ఉంది.

వృషభం (Taurus) :ఈ రోజు సమస్యలు పరిష్కరించడం చాలా కఠినంగా ఉంటుంది. కానీ మీరు వాటిని పూర్తి చేస్తారు. దానికి కొంత సమయం పడుతుంది. నిరాశ చెందకండి. కఠోర శ్రమ, సహనం మంచి ఫలితాన్ని ఇస్తాయి. మీ ప్రియురాలిని ఈ రోజు షాపింగ్​కు తీసుకెళ్తారు.

మిథునం (Gemini) :మీరు ఈ రోజు చాలా ప్రశాంతంగా ఉంటే మంచిది. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవడం అవసరం. ఒత్తిడి దూరం చేసుకోవడానికి ప్రయత్నించండి. సాహితీ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటారు. సానుకూల దృక్పథంతో పనిచేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.

కర్కాటకం (Cancer) :ఈ రోజు మీరు మీ సిద్ధాంతాలతో రాజీపడాలని అనుకోరు. అలా ఉన్నందుకు మీరు చాలా సంతృప్తి చెందుతారు. కానీ రాజీధోరణిని అవలంభించడమే మంచిది. అది మీ వృత్తిపరమైన వ్యవహారాల్లో సాయపడుతుంది.

సింహం (Leo) :ఈ రోజు మీకుకొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. ఇది మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతుంది. మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచేందుకు ప్రయత్నం చేస్తారు. మీరు సన్నిహితులతో ఆనందంగా చర్చల్లో పాల్గొంటారు.

కన్య (Virgo) : పాత జ్ఞాపకాలను మీరు నెమరువేసుకుంటారు. అందులోని మధురమైన వాటిని గుర్తుకు తెచ్చుకుంటారు. శ్రేయోభిలాషులతో కలిసి మీ ఆలోచనలను పంచుకుంటారు. వేదాంతం గురించి చర్చిస్తారు. గతాన్ని గురించి తలుచుకోవడం కన్నా ప్రస్తుతంపై దృష్టి సారించి ఆనందంగా ఉండాల్సిన సమయమిది.

తుల (Libra) :ఈ రోజు ఎన్నో ఆశ్చర్యకరమైన వార్తలు వింటారు. మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం కనుక్కునేందుకు ప్రయత్నిస్తారు. వృత్తిపరమైన, వ్యాపారపరమైన చర్చల్లో నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంటుంది. ఈ రోజు మీరు చాలా ఆనందంగా ఉంటారు. మీ చుట్టుపక్కల ఉన్నవారందరినీ ఆకట్టుకుంటారు.

వృశ్చికం (Scorpio) :మీ ప్రియురాలితో రోజంతా ఆనందంగా గడుపుతారు. మీరు గాల్లో మేడలు కడతారు. మీ స్నేహితులతో కలిసి ఇవాళ విపరీతంగా షాపింగ్ చేస్తారు. ఈ రోజును సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించండి.

ధనుస్సు (Sagittarius) :గతంలో చేసిన పొరపాట్ల గురించి ఈ రోజు మీరు ఆలోచిస్తుంటారు. ఈ రోజు మీరు చాలా కష్టపడి పనిచేస్తారు. కానీ సకాలంలో పనులు పూర్తి కావు. ఇది మీకు నిరాశ కలిగిస్తుంది. కాని మీ విలువేంటో మీకు తెలుసు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి.

మకరం (Capricorn) : ఈ రోజు మీకు ఉదయం పూట కొంచెం చికాకుగా ఉండే అవకాశం ఉంది. అహ్లాదకరమైన సాయంత్రాన్ని మీ స్నేహితులతో పాటు సంతోషంగా గడుపుతారు. వారితో కలిసి వేదాంతం, విలువలు, రాజకీయాల గురించి మాట్లాడుతారు. మీ జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా గడుపుతారు.

కుంభం (Aquarius) :మీరు భౌతిక సుఖాల నుంచి ఆధ్యాత్మిక వైపు ప్రయాణం చేస్తారు. మతపరమైన కార్యక్రమాలలో ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. తీర్థయాత్రలకు వెళ్తారు. లీగల్ వ్యవహారాలను సెటిల్ చేసుకుంటారు. మధ్యాహ్నం నుంచి మీకు అన్ని విషయాల్లోనూ విజయం వరిస్తుంది. మీ ఆరోగ్యం ఈ రోజు బాగుంటుంది. ఇంటివాళ్లతో ఈ సాయంత్రం గడపండి.

మీనం (Pisces) :మీరు కొన్ని విషయాల్లో వేగంగా నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. కనుక మానసికంగా బలంగా ఉండాలి. మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయాల ప్రభావం దీర్ఘకాలం పాటు ఉంటుందని గుర్తుంచుకోండి. అందులో ఆర్థికపరమైన విషయాలు కూడా ఉంటాయి. కనుక సరైన నిర్ణయాలు తీసుకుంటే మంచిది.

ABOUT THE AUTHOR

...view details