తెలంగాణ

telangana

ఈరోజు ఆ రాశి వారికి శత్రుభయం- వివాదాలకు దూరంగా ఉంటే మంచిది! - Horoscope Today April 9th 2024

By ETV Bharat Telugu Team

Published : Apr 9, 2024, 5:00 AM IST

Horoscope Today April 9th 2024 : ఏప్రిల్​ 9న (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Etv Bharat
Etv Bharat

Horoscope Today April 9th 2024 : ఏప్రిల్​ 9న (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. విందు వినోదాలతో, వేడుకలతో రోజంతా సరదాగా గడిచిపోతుంది. అనుకోని విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. దేవాలయ సందర్శన చేస్తారు. శ్రీ సుబ్రహ్మణ్యుని ధ్యానం మేలు చేస్తుంది.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఒక శుభవార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారులకు అనుకూలమైన సమయం. పెట్టుబడులు లాభాలను తెచ్చి పెడతాయి. చట్టపరమైన, కోర్టు సంబంధిత వ్యవహారాల పట్ల జాగ్రత్త వహించండి. దుర్గాదేవి ఆలయ సందర్శన శుభ ఫలితాలను ఇస్తుంది.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ పని పట్ల యజమానులు సంతృప్తి చెందుతారు. వ్యాపారులకు రావలసిన బకాయిలు చేతికి అందుతాయి. వ్యాపారంలో విపరీతమైన లాభాలను పొందుతారు. చేపట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ఈ విజయాన్ని పూర్తిగా ఆస్వాదించండి. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఇతరులకు సాయం చేయాలన్న మీ ఆలోచన కార్యరూపం దాల్చదు. కొన్ని రోజులుగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న అనుమానాలు తొలగిపోతాయి. ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. ఉద్యోగులు కోరుకున్న ప్రయోజనాలు పొందాలంటే మరింతగా శ్రమించాలి. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోకుంటే కుటుంబంలో కలహాలు రావచ్చు. ఇంట్లో అశాంతి కారణంగా ఆందోళనతో ఉంటారు. మాటలు జాగ్రత్తగా మాటాడండి. శత్రుభయం పొంచి ఉంది. సంయమనం పాటించండి. వివాదాలకు దూరంగా ఉంటే శ్రేయస్కరం. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంది. ఎటు చూసినా విజయమే కనిపిస్తోంది. మీ విజయ రహస్యాలను బందు మిత్రులతో పంచుకుంటారు. విందువినోదాలలో పాల్గొంటారు. గొప్ప వారితో పరిచయాలు పెరుగుతాయి. ఈ పరిచయాలు మున్ముందు మీకు మేలు చేస్తాయి. కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. ఆర్థికంగా లాభపడతారు. శివారాధన మేలు చేస్తుంది.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంది. పని పట్ల అంకితభావంతో ఉంటారు. మీ నైపుణ్యాన్ని చూసి అందరు ప్రశంసిస్తారు. మీ లక్ష్య సిద్ధి కోసం కొంత ధనం అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. జీవిత భాగస్వామితో మీ అనుబంధం బలపడుతుంది. మరిన్ని శుభఫలితాలు కోసం కుజగ్రహ పూజలు జరిపించుకోండి.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. వ్యాపారులు వ్యాపార సంబంధిత ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈ ప్రయాణాలు లాభిస్తాయి. రాజకీయనాయకులకు కలసివచ్చే కాలం. మీరు ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. సానుకూల ఫలితాలకోసం శ్రీ దుర్గాస్తుతి పఠిస్తే మేలు జరుగుతుంది.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామితో చిరు కలహాలు ఉంటాయి. పని పట్ల ఏకాగ్రతతో ఉంటారు. మీరు చేపట్టిన వృత్తిలో మీ పోటీదారులను గెలిచి విజయం సాధిస్తారు. ఈ విజయాన్ని ఆనందంగా జరుపుకోండి. పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. విందువినోదాలలో పాల్గొంటారు. ఆంజనేయస్వామి ధ్యానం శుభప్రదం.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. సమాజంలో కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. మీ మాటకు తిరుగుండదు. ఉద్యోగంలో ప్రమోషన్లు ఉంటాయి . ఆర్థికంగా లాభపడతారు. రాజకీయనాయకులు ప్రజలతో మమేకమవుతారు. ఆరోగ్యం బాగుంటుంది. మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం వినాయకుని ప్రార్థించండి.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు గ్రహాలు అనుకూలించవు. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఇంట్లో వారితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. ప్రతికూల ఆలోచనలు వీడండి. సహోద్యోగులతో మాట్లాడేటప్పడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. లేకుంటే వ్యతిరేకత ఉంటుంది. పరిస్థితి అదుపు తప్పకుండా చూసుకోండి. ఓర్పు, శాంతమే ఆయుధంగా పని చేస్తే విజయం మీదే! శివారాధన మేలు చేస్తుంది.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. ముఖ్య వ్యవహారంలో స్థిరమైన నిర్ణయాలు తీసుకొని పలువురి ప్రశంసలు పొందుతారు. పొదుపు పట్ల దృష్టి సారిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అదుపులోనే ఉంటాయి. నవగ్రహ ధ్యానంతో మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

ABOUT THE AUTHOR

...view details