తెలంగాణ

telangana

ఆ రాశివారికి ఈరోజు అద్భుతమైనది! ఏ పని చేపట్టినా విజయమే!! - Horoscope Today April 11th 2024

By ETV Bharat Telugu Team

Published : Apr 11, 2024, 4:58 AM IST

Horoscope Today April 11th 2024 : ఏప్రిల్​ 11న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today April 11th 2024
Horoscope Today April 11th 2024

Horoscope Today April 11th 2024 : ఏప్రిల్​ 11న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. కష్టానికి తగిన ఫలితం లభించక నిరాశకు లోనవుతారు. ప్రయాణాల పట్ల అనాసక్తితో ఉంటారు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. సన్నిహితులతో ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. ఆధ్యాత్మికత భావనలతో ప్రశాంతతను పొందుతారు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఇంట్లో శుభకార్యాలు, వేడుకలు జరుగుతాయి. ఈ రోజు వ్యాపారంలో కీలకమైన ఒప్పందం చేసుకుంటారు. వ్యాపార కోసం చేసే ప్రయాణాలు మంచి ప్రయోజనాలు ఇస్తాయి. కీలకమైన వ్యవహారంలో విజయం సాధిస్తారు. ఆర్ధిక ప్రయోజనాలు పొందుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

మిథునం (Gemini) :మిధునరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంది. మీరు ఊహించిన దానికన్నా ఎంతో ఎక్కువ ఆర్ధిక లాభాలను గడిస్తారు. స్నేహితుల సహకారాలను పొందుతారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు వల్ల రానున్న కాలంలో ప్రయోజనం ఉంటుంది. ప్రయాణ సూచన ఉంది. ప్రభుత్వ పథకాల ద్వారా కూడా లబ్ది పొందుతారు. మొత్తం మీద ఈ రోజు చాలా బాగుంది. శత్రు జయం కోసం గురు ధ్యానం చేస్తే మేలు.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంది. భావోద్వేగాలకు గురి కావద్దు. భవిష్యత్ ప్రణాళికలు వేసుకోడానికి సరైన సమయం. చేపట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ఇంటి అలంకరణ పట్ల శ్రద్ధ వహిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్ధిక ప్రయోజనాలు పొందుతారు. దుర్గాదేవి ధ్యానం శుభప్రదం.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని ఘటనలు బాధ కలిగించవచ్చు. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం ఖర్చులకు తగినట్లుగా ఉండదు. విపరీతమైన ఒత్తిడికి గురవుతారు. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మేలు. అనారోగ్య సూచనలు ఉన్నాయి. శివారాధన మేలు చేస్తుంది.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కొన్ని ప్రతికూల ఆలోచనల కారణంగా ఆందోళనకు గురవుతారు. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే వివాదాలకు ఆస్కారముంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ప్రయాణాలు చేసే అవకాశముంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. నవగ్రహ ధ్యానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు అంత ఆశాజనకంగా లేదు. ఏ పని చేసినా ఒకటికి పది సార్లు ఆలోచించి చేయాలి. లేకపోతే నష్టం వాటిల్లుతుంది. వృధా ప్రయత్నాలను నివారించడానికి ఆచి తూచి అడుగు వేయండి. వ్యాపారస్థులకు ప్రయాణ సూచన ఉంది. ఉద్యోగస్థులకు ఆశించిన ప్రయోజనాలు లేక నిరాశకు లోనవుతారు. ఆరోగ్యం ఫర్వాలేదనిపిస్తుంది. వినాయకుని పూజ చేస్తే విఘ్నాలు ఉండవు.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గత తప్పిదాల నుంచి పాఠాలను నేర్చుకుంటారు. మౌనమే శ్రేయస్కరమని భావిస్తారు. కుటుంబంలో మంచి వాతావరణం ఉంటుంది. విందువినోదాలలో పాల్గొంటారు. ఖర్చులు పెరిగే అవకాశముంది. జాగ్రత్త వహించండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంటుంది. ఔషధ సేవనం తప్పదు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టకపోతే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రానున్న కాలంలో కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. నిరాశకు లోను కావద్దు. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. సాయంత్రం వేళ దేవాలయ సందర్శన చేస్తే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఆంజనేయ స్వామి ప్రార్ధన వల్ల మనోబలం పెరుగుతుంది.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. కుటుంబంలో సున్నిత విషయాల పట్ల అతిగా స్పందించి భావోద్వేగానికి లోనవ్వకండి. ఆస్తులు, భూములకు సంబంధించిన వ్యవహారాలకు దూరంగా ఉంటే మేలు. మానసికంగా అశాంతికి లోనవుతారు. అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి. మొండితనం వీడితే మంచిది. మంచి ఫలితాల కోసం నవగ్రహ ధ్యానం చేయండి.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు ఒక అద్భుతమైన రోజు. కొత్త పనులు మొదలు పెట్టడానికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సొంతమవుతుంది. తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. కాబట్టి ముందుచూపుతో ఆలోచించి స్థిరమైన నిర్ణయం తీసుకోండి. ఆర్ధిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఆస్తి వ్యవహారాలు వాయిదా వేస్తే మంచిది. శనీశ్వర స్తోత్రం చదివితే ఆందోళన తగ్గి మనసు కుదుట పడుతుంది.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. స్వార్ధం వీడి పరోపకారం గురించి ఆలోచిస్తే మేలు జరుగుతుంది. మీ లక్ష్య సాధనలో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. మాటలు అదుపులో ఉంచుకుంటే గొడవలు ఉండవు. ఈ రోజు కొత్తగా ఏ పని మొదలు పెట్టవద్దు. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ఆదిత్య హృదయం పఠిస్తే అనుకూల ఫలితాలు ఉంటాయి.

ABOUT THE AUTHOR

...view details