తెలంగాణ

telangana

'ఆ రెండింటి మధ్య నక్కకు - నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది' - కేటీఆర్​కు జీవన్​రెడ్డి కౌంటర్

By ETV Bharat Telangana Team

Published : Mar 1, 2024, 2:15 PM IST

Updated : Mar 1, 2024, 3:57 PM IST

MLC Jeevan Reddy Counter to KTR : రాష్ట్రంలో కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. రేవంత్​ రెడ్డిపై కేటీఆర్​ చేసిన వ్యాఖ్యలతో మొదలైన ఈ వార్​, ఇటీవల ముఖ్యమంత్రి రియాక్షన్​తో తారాస్థాయికి చేరింది. దీనిపై కేటీఆర్​ సీఎంకు సవాల్​ విసరగా, తాజాగా ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి మాజీ మంత్రికి కౌంటర్​ ఇచ్చారు.

MLC Jeevan Reddy
MLC Jeevan Reddy Counter to KTR

'ఆ రెండింటి మధ్య నక్కకు - నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది' - కేటీఆర్​కు జీవన్​రెడ్డి కౌంటర్

MLC Jeevan Reddy Counter to KTR : కేటీఆర్‌ ఇలాగే మాట్లాడితే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ ఒక్క సీటు కూడా గెలవదని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి జోస్యం చెప్పారు. రాజీనామా చేసి మల్కాజిగిరిలో పోటీ చేద్దామని సీఎం రేవంత్‌ రెడ్డికి మాజీ మంత్రి విసిరిన సవాల్​పై జీవన్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. జగిత్యాలలోని తన నివాసంలో మాట్లాడిన ఆయన, సీఎం పదవికి, ఎమ్మెల్యే పదవికి నక్కకు - నాకలోకానికి ఉన్నంత తేడా ఉందని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయమని కేటీఆర్ అనడం విడ్డూరంగా ఉందని జీవన్ రెడ్డి అన్నారు. భారత్ రాష్ట్ర సమితికి కేవలం మెదక్‌ ఎంపీ సీటు గెలిచే అవకాశం ఉందని, కానీ కేటీఆర్‌ మాట్లాడే తీరు చూస్తే అది కూడా గెలిచేలా లేదని జోస్యం చెప్పారు. ఈ క్రమంలోనే దమ్ముంటే నిజామాబాద్‌, కరీంనగర్‌ నుంచి పోటీ చేసి గెలవాలని కేటీఆర్​కు సవాల్​ విసిరారు.

రేవంత్​కు కేటీఆర్ ఛాలెంజ్ - మల్కాజిగిరి ఎంపీ బరిలో తేల్చుకుందామంటూ సవాల్

కేటీఆర్ ఇలాగే మాట్లాడితే ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేరు. రేవంత్​ను సీఎం పదవికి రాజీనామా చేయమనడం విడ్డూరంగా ఉంది. ముఖ్యమంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి నక్కకు - నాకలోకానికి మధ్య ఉన్నంత తేడా ఉంది. కేటీఆర్​కు దమ్ముంటే నిజామాబాద్, కరీంనగర్​ నుంచి పోటీ చేసి గెలవాలి. - ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి

వివాదానికి తెరలేసింది ఇలా : అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్​ రెడ్డిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే, కాంగ్రెస్​ పార్టీకి కనీసం 3 సీట్లు కూడా వచ్చేవి కావని ఇటీవల జరిగిన ఓ సభలో కేటీఆర్​ వ్యాఖ్యానించారు. దీనిపై చేవెళ్ల సభలో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ఘాటుగా స్పందించారు. పార్లమెంట్​ ఎన్నికల్లో ఒక్క సీటైనా గెలిచి చూపించాలంటూ బీఆర్​ఎస్​కు సవాల్​ విసిరారు.

లోక్​సభ ఎన్నికల్లో ఒక్క స్థానమైనా గెలవాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సవాల్​కు బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రతి సవాల్ విసిరారు. ఇద్దరం రాజీనామా చేసి, మల్కాజి​గిరి పార్లమెంట్ బరిలో నిలిచి తేల్చుకుందామని ఛాలెంజ్​ చేశారు. ముఖ్యమంత్రి పదవికి, శాసనసభ్యత్వానికి రేవంత్ రాజీనామా చేయాలని, తానూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వ్యాఖ్యానించారు. దీనిపైనే తాజాగా ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి కేటీఆర్​కు కౌంటర్​ ఇచ్చారు. ఎమ్మెల్యే పదవికి, సీఎం పదవికి నక్కకు - నాకలోకానికి మధ్య ఉన్నంత తేడా ఉందంటూ మాజీ మంత్రికి చురకలు అంటించారు.

మేడిగడ్డపై కాంగ్రెస్​ది రాజకీయం - రైతులకు నీళ్లివ్వకుండా కాలయాపన చేయడం దారుణం : కేటీఆర్

Last Updated : Mar 1, 2024, 3:57 PM IST

ABOUT THE AUTHOR

...view details