తెలంగాణ

telangana

మేమంటే భయం అందుకే పదేపదే విమర్శలు - టెంపోల్లో డబ్బు తరలిస్తుంటే మీరేం చేస్తున్నారు? : ఖర్గే - KHARGE SLAMS BJP COMMENTS

By ETV Bharat Telangana Team

Published : May 10, 2024, 2:40 PM IST

AICC Chief Kharge Comments on BJP : కాంగ్రెస్​కు భయపడుతున్నారు కాబట్టే బీజేపీ నేతలు పదేపదే తమ​పై ఆరోపణలు చేస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. కాంగ్రెస్​ నేతలు టెంపోల్లో డబ్బులు తీసుకెళ్తున్నారని ప్రధాని స్థాయి వ్యక్తి అనడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. హైదరాబాద్​లోని తాజ్​ కృష్ణ హోటల్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

AICC Chief Kharge Comments on BJP
AICC Chief Kharge Comments on BJP

మేమంటే భయం అందుకే పదేపదే విమర్శలు - టెంపోల్లో డబ్బు తరలిస్తుంటే మీరేం చేస్తున్నారు? : ఖర్గే

AICC President Mallikarjun Kharge Slams BJP : ఏదైతే చెబుతామో అది కచ్చితంగా చేసి చూపిస్తామని, అందుకే ఇచ్చిన హామీల మేరకు పథకాలు అమలు చేశామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించామని వెల్లడించారు. హైదరాబాద్​లోని తాజ్​ కృష్ణ హోటల్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎక్కువ విడతల్లో ఎన్నికల నిర్వహణ ఎవరికీ ఉపయోగం లేదని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్​ విధానాల మేరకు అందరూ నడుచుకోవాలని సూచించారు. చేసిన అభివృద్ధి గురించి చెప్పుకుని బీజేపీ ఓట్లు అడగదని, కాంగ్రెస్​పై నిందలు మోపడం ద్వారానే ఓట్లు అడుగుతారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్​ తమకు పోటీయే కాదంటూనే పదేపదే విమర్శిస్తోందని దుయ్యబట్టారు. తమ​కు భయపడుతున్నందునే పదేపదే బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

నల్లధనం వెలికి తీస్తామని ప్రధాని మోదీ ఎన్నో ప్రగల్భాలు పలికారు. నల్లధనం ప్రయోజనాలు వారి మిత్రులకే అందజేశారు. ఎన్నికల ప్రకటన తర్వాత అదానీ, అంబానీ గురించి మాట్లాడట్లేదంటున్నారు. టెంపోల్లో కాంగ్రెస్​ నేతలకు డబ్బులు ముడుతున్నాయని ఆరోపణ చేస్తున్నారు ఎక్కడి నుంచి డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయో మీరు చూశారా? టెంపోల్లో డబ్బు తరలిస్తుంటే ఐటీ, కేంద్ర సంస్థలు ఏ చేస్తున్నాయి? అదానీ, అంబానీ నుంచి డబ్బులు వెళ్తుంటే వారి ఇళ్లలో సోదాలు చేయండి. అదానీ, అంబానీ ఇళ్లలో ఈడీ, ఐటీ సిబ్బందితో తనిఖీలు చేయించండి. ఇలాంటి చిల్ల మాటలు మాట్లాడటం ప్రధాని స్థాయిలి తగదు. ధనవంతుల ఆస్తులు లాక్కుని పంచుతామనడం సిగ్గుచేటు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందని గుర్తించాలి. - మల్లికార్డున ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడు

బీజేపీ దేశ అభివృద్ధిని గాలికొదిలేసి విపక్షంపై ఆరోపణలే లక్ష్యంగా పెట్టుకుందని ఖర్గే ఫైర్ అయ్యారు. తెలంగాణకు పెద్ద ప్రాజెక్టులు ఏం తీసుకువచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్​ హయాం నాటి ప్రాజెక్టులు ఏం ఇచ్చారో చెప్పాలని అడిగారు. కాంగ్రెస్​ చెప్పిన విధంగా హామీలు అమలు చేస్తుందన్న ఖర్గే, ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. పేద మహిళలకు ఏటా రూ. లక్ష ఆర్థిక సాయం అందజేస్తామని, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు.

రిజర్వేషన్లు రద్దు చేసేందుకే ప్రభుత్వరంగ సంస్థల విక్రయం : రాహుల్‌ గాంధీ - lok sabha elections 2024

రాబోయే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు గల్లంతు : సీఎం రేవంత్​రెడ్డి - CM Revanth Election Campaign

ABOUT THE AUTHOR

...view details