తెలంగాణ

telangana

ఓటుకు నోటు కేసు పాత చింతకాయ పచ్చడి - ఫోన్​ ట్యాపింగ్​పై చర్చకు రండి : పొన్నం సవాల్​ - Congress Election Campaign

By ETV Bharat Telangana Team

Published : Apr 19, 2024, 1:12 PM IST

Congress Ponnam Prabhakar Election Campaign : ఓటుకు నోటు కేసు గురించి పదేళ్ల నుంచి పాలనలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు ఎందుకు ఏమీ చేయలేకపోయాయని మంత్రి పొన్నం ప్రభాకర్‌ నిలదీశారు. ఓటుకు నోటు కాదు, ఫోన్‌ ట్యాపింగ్‌పై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ అంబేడ్కర్‌ స్టేడియంలో ఆ నియోజకవర్గం టికెట్ ఆశిస్తున్న వెలిచాల రాజేందర్‌తో కలిసి ఉదయపు నడకలో ప్రచారం నిర్వహించారు.

Congress MP Candidates Election Campaign
Congress Ponnam Prabhakar Election Campaign

Congress Ponnam Prabhakar Election Campaign :ఓటుకు నోటు కేసును గత పదేళ్లు పాలించిన బీఆర్ఎస్, ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ఎందుకు ఏమీ చేయలేకపోయాయని మంత్రి పొన్నం ప్రభాకర్ నిలదీశారు. ఫోన్​ ట్యాపింగ్​, ఓటుకు నోటు కేసుపై చర్చకు రావాలని రెండు పార్టీలకు డిమాండ్ చేశారు. కరీంనగర్​ అంబేడ్కర్​ స్టేడియంలో ఆ నియోజకవర్గం టికెట్ ఆశిస్తున్న వెలిచార రాజేందర్​తో కలిసి ఉదయపు నడకలోప్రచారం నిర్వహించారు. కరీంనగర్​ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్​ ఎన్నికల ప్రచారంలో తన తల్లి ప్రస్తావన తీసుకువచ్చి, సెంటిమెంట్​తో ఓట్లు పొందేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజకీయాలకు సంబంధం లేని తల్లి గురించి ప్రచారంలో ప్రస్తావించడం సరికాదన్నారు. ప్రతిసారి ఎన్నికల ముందు ఏదో ఒక విషయాన్ని తీసుకువచ్చి, ఓట్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కరీంనగర్​లో వినోద్​రావును ఓడించడానికి బండి సంజయ్​, గంగుల కమలాకర్​కు మధ్య చీకటి ఒప్పందాలు అయ్యాయని ఆరోపించారు. గ్రానైట్ ఇండస్ట్రీ, స్మార్ట్​ సిటీ వాటిపై స్పందించాల్సిన పార్లమెంట్​ సభ్యుడు, ఎందుకు మౌనం పాటించారని ప్రశ్నించారు.

కేసీఆర్‌ దుర్మార్గ పాలనకు బీజేపీ కూడా సహకరించింది : మంత్రి పొన్నం ప్రభాకర్‌ - Ponnam comments on BRS

"ఈరోజు బండి సంజయ్​కు, గంగుల కమలాకర్​కు​ ఉన్న స్నేహం గురించి అందరికీ తెలుసు. వినోద్​రావును కరీంనగర్​లో ఓడించడానికి గంగుల బండి కుమ్మక్కయ్యారని అందరికీ తెలుసు. అగ్గి-ఉప్పులాగా ఉండే మీరు, ఇప్పడు పాలు-నీళ్లలా ఎందుకు కలిశారో ప్రజలు అర్థం చేసుకోవాలి. గత పది సంవత్సరాలు బీఆర్ఎస్, బీజేపీ అధికారంలో ఉంటే, మరి ఓటుకు నోటు కేసును ఎందుకు పరిష్కరించలేదు. ప్రజాస్వామ్యంలో అధికార మార్పిడి ఓటు వల్ల జరుగుతుంది. ఓడిపోయిన వారిని నేను బలహీనులు అనను, కించపరచను. ప్రజలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పాలన ఉంటే వారిని చైతన్యపరచండి. ప్రభుత్వం కూలిపోతుంది. బీజేపీ ఊరుకోదు. ఇలాంటివి మాట్లాడటం మానుకోండి." - పొన్నం ప్రభాకర్​, మంత్రి

ప్రజాస్వామ్యంలో అధికార మార్పిడి కేవలం ఓటు వల్ల జరుగుతుంది పొన్నం ప్రభాకర్

సాగు నీరు, విద్యుత్​పై లేనిపోని అబద్ధాలు - ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకే వచ్చా : భట్టి విక్రమార్క - bhatti vikramarka meet the press

Congress MP Candidates Election Campaign : గత పదేళ్ల కాలంలో కరీంనగర్​లో ఎలాంటి అరాచక పాలన ఉండేదో, ఉప్పు-నిప్పులాంటి బండి సంజయ్​, గంగుల కమలాకర్​ అరాచకాలపై ఎందుకు నోరు విప్పలేదో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని పొన్నం ప్రభాకర్ అన్నారు. నియంతృత్వ పాలనను అంతమొందించి ప్రజా పాలనను తీసుకొస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్​ హయాంలో ఆ ప్రభుత్వం అండతో అక్రమాలకు పాల్పడిన వారిని ఎంతమందిని జైలుకు పంపించామో కళ్లారా చూసిన ప్రజలు, కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేయాలని కోరారు.

నలుగురికి ఉపయోగపడే చేనేత కండువాలతో అతిథులను సత్కరిద్దాం : పొన్నం - minister ponnam on bjp manifesto

ABOUT THE AUTHOR

...view details