తెలంగాణ

telangana

కాంగ్రెస్ Vs బీఆర్ఎస్ రాజీనామా రాజకీయం - గన్​పార్క్​ను హరీశ్ రావు మలినం చేశాడని క్లీన్ చేసిన హస్తం నేతలు - HARISHRAO Vs CM REVANTH REDDY

By ETV Bharat Telangana Team

Published : Apr 26, 2024, 2:25 PM IST

Updated : Apr 26, 2024, 2:40 PM IST

Congress Leaders Counter to Harish Rao Challenge : వేసవి తాపానికి తోడు సార్వత్రిక ఎన్నికల వేడి రాష్ట్రంలో భగ్గుమంటోంది. ఈ క్రమంలో కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. సవాళ్లకు ప్రతిసవాళ్లు చేసుకుంటూ రాష్ట్రాన్ని రణక్షేత్రంగా మార్చేశారు. మాజీ మంత్రి హరీశ్​రావు, సీఎం రేవంత్​ రెడ్డి మధ్య రుణమాఫీకి సంబంధించిన మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది.

Harishrao Challenge to cm revanth
Congress Leaders Counter to Harishrao Challenge

Congress Leaders Counter to Harish Rao Challenge :లోక్​సభ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయం మండు వేసవిని మించి భగ్గుమంటోంది. రైతు రుణమాఫీపై కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ మధ్య సవాళ్లు-ప్రతిసవాళ్లు మంటలు రేపుతున్నాయి. పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్​ రెడ్డి ప్రకటనపై బీఆర్​ఎస్​ సీనియర్​ నేత, మాజీ మంత్రి హరీశ్​రావు చేసిన సవాల్​ మాటల యుద్ధానికి దారి తీసింది. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తే తాను రాజీనామాకు సిద్ధమని, చేయకపోతే రేవంత్​ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేస్తారా అంటూ ఇవాళ హరీశ్ రావు గన్​పార్క్ అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లి మరోసారి ఛాలెంజ్ చేశారు.

హరీశ్​రావు అమరవీరుల స్తూపం వద్దకు వచ్చి మలినం చేశారని, పసుపు నీళ్లతో ఆ మలినాన్ని శుద్ధి చేసినట్లు ఎమ్మెల్సీ, ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్​ తెలిపారు. ఆగస్టు 15లోగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి మాటిచ్చారని గుర్తు చేశారు. ఆ మాటలను అమలు చేస్తే బీఆర్​ఎస్​ పార్టీని రద్దు చేస్తారా అని ప్రశ్నించారు.హరీశ్​రావు తన రాజీనామాతో కొత్త డ్రామాకు తెర తీశారని మండిపడ్డారు. రూ.2 లక్షల రుణమాఫీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. హరీశ్​రావు రాజీనామా విషయంలో తాను బాధ్యత తీసుకొని రాజీనామా ఆమోదించేలా చేస్తానని వెంకట్​ స్పష్టం చేశారు.

ఛాలెంజ్ యాక్సెప్టెడ్ - ఆ హామీలన్నీ అమలు చేస్తే నేను రాజీనామా చేస్తా - మళ్లీ పోటీ చేయను : హరీశ్ రావు

"అమరవీరుల స్తూపాన్ని మాజీ మంత్రి హరీశ్​రావు అపవిత్రం చేశారని పసుపు నీళ్లతో శుద్ధి చేశాం. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని సీఎం మాటిచ్చారు. హరీశ్​రావు తన రాజీనామాతో కొత్త డ్రామాకు తెర తీశారు. ఆగస్టు 15లోగా ఇచ్చిన మాట ప్రకారం హామీ నెరవేరుస్తాం. నేను బాధ్యత తీసుకుని హరీశ్​రావు రాజీనామా ఆమోదించేలా చూస్తాను."- బల్మూరి వెంకట్​, ఎమ్మెల్సీ

మరోవైపు హరీశ్ రావు ఛాలెంజ్ స్వీకరించిన సీఎం రేవంత్​ రెడ్డి రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. అందుకు తగ్గట్లుగానే మాజీ మంత్రి హరీశ్​రావు రాజీనామా లేఖతో గన్​పార్కులోని అమరవీరుల స్తూపం వద్దకు వచ్చారు. తాను మాటకు కట్టుబడి ఉన్నానని పదవికి రాజీనామా చేస్తానని ప్రమాణం చేసేందుకు సీఎం గన్​పార్కు వద్దకు రావాలని కోరారు. ఇదిలా ఉండగా హరీశ్​రావు రాజీనామా సవాల్​పై మంత్రులు కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి, పొన్నం ప్రభాకర్​ భగ్గుమన్నారు. బీఆర్​ఎస్​ నేత రాజీనామా డ్రామాతో ప్రజలను మాయ చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఇలా మాటల తూటాలతో రాష్ట్ర రాజకీయం వేసవిలో కూడా మండుటెండలా భగ్గుమంటుంది.

హామీల అమలుపై రేవంత్‌ రెడ్డి అమరవీరుల స్థూపం వద్దకు రావాలి : హరీశ్‌రావు - Harish Rao Fires On Cm Revanth

హరీశ్​రావు రాజీనామా పత్రం జేబులో పెట్టుకో - కేసీఆర్​లాగా మాట తప్పొద్దు : రేవంత్​ రెడ్డి - Revanth Reddy Speech in Warangal

Last Updated :Apr 26, 2024, 2:40 PM IST

ABOUT THE AUTHOR

...view details