ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే - నిరుద్యోగ భృతి ఇస్తాం : చంద్రబాబు - Chandrababu Kuppam Tour

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 26, 2024, 7:41 PM IST

Updated : Mar 26, 2024, 9:30 PM IST

Chandrababu Meeting With Kuppam Youth: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే పెడతానని,నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రకటించారు. కుప్పం పర్యటనలో రెండోరోజు యువతతో చంద్రబాబు సమావేశమయ్యారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత మార్పు చెందాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Chandrababu Meeting With Kuppam Youth
Chandrababu Meeting With Kuppam Youth

Chandrababu Meeting With Kuppam Youth :రాష్ట్రంలో ఐదేళ్లుగా పెట్టుబడులు లేవని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటా జాబ్‌ కేలండర్​పై అంటూ నిలువునా ముంచారని మండిపడ్డారు. ఐదేళ్లుగా ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా ఎన్నికల ముందు హడావుడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోగా మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కుప్పం పర్యటనలో రెండోరోజు యువతతో చంద్రబాబు సమావేశమయ్యారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత మార్పు చెందాలని పిలుపునిచ్చారు. ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రాన్ని కాపాడాలనే మూడు పార్టీలు కలిసి ప్రజల ముందుకు వచ్చాయని, జెండాలు మూడైనా అజెండా మాత్రం ఒక్కటేనని అన్నారు.

భవిష్యత్తులో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ :జగన్‌ పాలనలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత అల్లాడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఎకానమీలో తెలుగు యువత అగ్ర స్థానంలో ఉండాలనేదే తన కోరిక అని అన్నారు. రాష్ట్రంలో గ్రూప్‌-1 పోస్టులను ఇష్టారీతిన కావాల్సిన వారికి ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతలో సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత ఉండాలని రాష్ట్రంలో పాలనను మళ్లీ గాడిన పెట్టే బాధ్యత తనది అన్నారు. ఐటీని ప్రోత్సహించి యువతకు కొత్త దారి చూపించానని, టెక్నాలజీ దుర్మార్గుల చేతిలో పడితే ప్రమాదకరమని తెలిపారు.

కూటమి అధికారంలోకి రాగానే నెలకు రూ.4 వేల పింఛన్‍: చంద్రబాబు - Chandrababu Tour in Kuppam

పారదర్శకంగా జరగాల్సిన టెండర్లలోనూ అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ తీసుకొస్తామని, అన్ని మండల కేంద్రాల్లో వర్క్‌ స్టేషన్​లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మేం వచ్చాక ప్రతి నియోజకవర్గానికి విజన్‌ తయారు చేస్తామని అన్నారు. వాలంటీర్లు నెలకు రూ.30వేల నుంచి రూ.50వేలు సంపాదించుకునేలా ఏర్పాటు చేస్తామని, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా వాలంటీర్ల జీవితాలు మారుస్తామని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో అరాచక పాలనకు అంతం పలికి పరిపాలనను మళ్లీ గాడిలో పెడతానని యువతకు భరోసానిచ్చారు.

అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు :వైఎస్సార్సీపీ నేతలు సర్వే నంబర్లు మార్చి సామాన్యుల నుంచి భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. కుప్పంలోనే తననే బెదిరిస్తున్నారని తెలిపారు. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో గ్రానైట్‌ను ఐదేళ్ల పాటు వైఎస్సార్సీపీ నాయకులు దోపిడీ చేశారని ధ్వజమెత్తారు. మద్యం, గంజాయి విక్రయించి డబ్బు సంపాదిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 100 రోజుల్లోనే గంజాయి, డ్రగ్స్‌ను అరికడతామని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

కడప ఎంపీ స్థానం మనదే- 160 స్థానాల్లో కూటమి విజయం ఖాయం : చంద్రబాబు - TDP workshop

లక్ష ఓట్ల మెజార్టీతో చంద్రబాబును గెలిపిస్తాం : ఉదయం కుప్పంలో చంద్రబాబు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పట్టణవాసులు పెద్దఎత్తున చంద్రబాబుకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈసారి కచ్చితంగా కుప్పంలో లక్ష ఓట్ల మెజార్టీతో తమ అభిమాన నాయకుడ్ని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇంటింటికీ వెళ్లి వారి బాగోగులు తెలుసుకున్నారు. రెండు నెలల్లో అధికారంలోకి వచ్చిన తరువాత సొంత నియోజకవర్గంలో చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

ఏడాదిలోగా హంద్రీనీవా నీరు ఇస్తాం : గత నెల 26న సీఎం జగన్‌ నీరు విడుదల చేసిన హంద్రీనీవా కాలువ ప్రాంతాన్ని పరిశీలించారు. జగన్‌ ప్రారంభించిన గేట్లను పరిశీలించారు. హంద్రీనీవాలో ఉత్తుత్తి గేట్‌తో సినిమా సెట్టింగ్ పెట్టారని, కార్యక్రమం పూర్తి కావడంతోనే గేట్‌ను తీసేశారు ఎద్దేవా చేశారు. హంద్రీనీవా ద్వారా ఏడాదిలోగా నీరు ఇస్తామని తెలిపారు.

"రాష్ట్రాన్ని కాపాడాలనే మూడు పార్టీలు కలిసి మీ ముందుకు వచ్చాయి. జెండాలు మూడు అజెండా మాత్రం ఒక్కటే. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే పెడతాం. భవిష్యత్తులో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ తీసుకొస్తాం. అన్ని మండల కేంద్రాల్లో వర్క్‌ స్టేషన్లు నిర్మిస్తాం. మేం వచ్చాక ప్రతి నియోజకవర్గానికి విజన్‌ తయారు చేస్తాం."-చంద్రబాబు నాయుడు

హామీలపై బదులిచ్చాకే బస్సెక్కు - జగన్​కు చంద్రబాబు సవాల్ - Chandrababu fire on Jagan

ప్రభుత్వంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే పెడతాం : చంద్రబాబు
Last Updated :Mar 26, 2024, 9:30 PM IST

ABOUT THE AUTHOR

...view details