తెలంగాణ

telangana

"నిధుల వరద పారిన కాళేశ్వరం - ప్రజలకు అక్కరకు రాకుండా పోయింది"

By ETV Bharat Telangana Team

Published : Feb 17, 2024, 6:53 PM IST

Payal Shankar on Chanaka-Korata Project : నిధుల వరద పారిన కాళేశ్వరంతో ప్రజలకు మేలు జరగలేదని, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం చేసింది ముమ్మాటికే తప్పేనని బీజేపీ శాసనసభా పక్ష నేత పాయల్‌ శంకర్‌ పేర్కొన్నారు. గత ప్రభుత్వం తప్పులు చేసిందనే ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారని, ఇప్పుడు సభలో ఒకరినొకరు తిట్టుకుంటూ కాలం వెళ్లదీయొద్దని సూచించారు.

White Paper on Irrigation Projects
Payal Shankar on Chanaka-Korata Project

నిధుల వరద పారిన కాళేశ్వరం- ప్రజలకు అక్కరకు రాకుండా పోయింది

Payal Shankar on Chanaka-Korata Project : ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞంలో చేపట్టిన ప్రాజెక్టులను బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం విస్మరించిందని, కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను రేవంత్‌ సర్కార్‌ విస్మరించవద్దని బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ పేర్కొన్నారు. నిధుల వరద పారిన కాళేశ్వరంతో ప్రజలకు మేలు జరగలేదని, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం చేసింది ముమ్మాటికే తప్పేనని దుయ్యబట్టారు.

కేసీఆర్ పదేళ్ల పాలనలో ఆదిలాబాద్‌ జిల్లాకు కూడా అన్యాయం చేశారని పాయల్‌శంకర్‌ మండిపడ్డారు. ఆదిలాబాద్‌ జిల్లాకు నీరు ఇస్తామని చనాఖా - కొరాటా ప్రాజెక్టు(Chanaka-Korata Project) చేపట్టారన్నారు. 1300 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చనాఖా - కొరాటా ప్రాజెక్టు వ్యయాన్ని క్రమంగా రూ.2600 కోట్లకు పెంచిపనప్పటికీ పూర్తి చేయలేదన్నారు. గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులకు బిల్లులు ఇవ్వలేదని, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన బిల్లులు మాత్రమే వెంటనే ఇచ్చారని ఇంజినీర్లు చెప్పారన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కలంకం - పదేళ్లలో రాష్ట్రాన్ని దివాలా తీయించారు : సీఎం రేవంత్‌రెడ్డి

White Paper on Irrigation Projects :నిధుల వరద పారిన కాళేశ్వరంతో ప్రజలకు మాత్రం ఎటువంటి మేలు జరగలేదని పాయల్‌ శంకర్‌ ఎద్దేవా చేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తప్పులు చేసిందనే ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారని, ఒకరినొకరు తిట్టుకుంటూ కాలం వెళ్లదీయొద్దని ఆయన సూచించారు. ప్రస్తుతం రాజకీయ పార్టీలు ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇస్తున్నాయని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి వాస్తవాలు ప్రజలకు తెలియాలని పేర్కొన్నారు. మద్యం అమ్మితేనే ప్రభుత్వం నడిచే పరిస్థితులు వచ్చాయని దుయ్యబట్టారు.

సీఎంవో అధికారులు హెలికాప్టర్లు వేసుకుని ప్రాజెక్టుల చుట్టూ తిరిగారని, ప్రాజెక్టులు మాత్రం సగం కూడా పూర్తి కాలేదన్నారు. బీఆర్ఎస్‌ హయాంలో లక్షల కోట్లు ఖర్చు చేసి రూపాయికి అక్కరకు రాని ప్రాజెక్టు నిర్మించారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చోటుచేసుకున్న అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.

"నిధుల వరద పారిన కాళేశ్వరంతో ప్రజలకు మేలు జరగలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం ముమ్మాటికి తప్పే చేసింది. సీఎంవో అధికారులు హెలికాప్టర్లు వేసుకుని ప్రాజెక్టుల చుట్టూ తిరిగారు. ప్రాజెక్టులు మాత్రం సగం కూడా పూర్తి కాలేదు. బీఆర్ఎస్‌ హయాంలో లక్షల కోట్లు ఖర్చు చేసి రూపాయికి అక్కరరాని ప్రాజెక్టు నిర్మించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలి". - పాయల్‌ శంకర్, బీజేపీ ఎమ్మెల్యే

మేడిగడ్డ దేవాలయం అప్పుడే బొందలగడ్డ ఎందుకు అయిందో కేసీఆర్ చెప్పాలి : పొంగులేటి

అన్నారం, సుందిళ్లకూ ముప్పు పొంచి ఉంది : మంత్రి ఉత్తమ్ ​కుమార్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details