తెలంగాణ

telangana

అమెరికాలో మంచు తుపాను బీభత్సం- ప్రధాన రహదారులు బంద్​- 72 కి.మీల వేగంతో చలిగాలులు

By ETV Bharat Telugu Team

Published : Mar 4, 2024, 4:02 PM IST

US California Snow Fall : అమెరికాలోని కాలిఫోర్నియాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ప్రధాన రోడ్లపై మంచు కుప్పులకుప్పలుగా పేరుకుపోవడం వల్ల రవాణా వ్యవస్థ స్తంభించింది. చలి గాలులు, మంచు తీవ్రతతో ఆ ప్రాంతమంతా పూర్తిగా గడ్డ కట్టుకుపోయే పరిస్థితులు నెలకొన్నాయి. భారీ మంచు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాబోయే రోజుల్లో మంచు తుపాను మరింత తీవ్రమవనుందని అమెరికా వాతావరణ శాఖ హెచ్చరించింది.
తీవ్రమైన మంచు తుపాను కారణంగా అమెరికాలోని కాలిఫోర్నియా అతలాకుతలమవుతోంది. పలు ప్రాంతాలను మంచు దుప్పటి కప్పేసింది.
చలి గాలులు, మంచు తీవ్రతతో ఆ ప్రాంతమంతా పూర్తిగా గడ్డ కట్టుకుపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి.
కొన్ని పర్వత ప్రాంతాలు, ప్రధాన రహదారులు మంచుతో నిండిపోవడం వల్ల రవాణా వ్యవస్థ స్తంభించింది.
విద్యుత్తు సేవలకు అంతరాయం ఏర్పడింది. మంచుతో ఇళ్లు, షాపులకు కరెంటు సరఫరా నిలిచి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పలు ప్రధాన రోడ్లపై మంచు కుప్పులకుప్పలుగా పేరుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి.
మంచు తుపాను ధాటికి పలు ప్రాంతాల్లో స్కై రిసార్టులను మూసివేశారు.
ప్రధానంగా ఉత్తర కాలిఫోర్నియాలో భారీగా మంచు కురుస్తోంది.
రాబోయే రోజుల్లో మంచు తుపాను మరింత తీవ్రమవనుందని అమెరికా వాతావరణ శాఖ హెచ్చరించింది.
సియెర్రా నెవాడా పర్వతాల్లో ఆదివారం దాదాపు 30 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా మంచు కురిసినట్లు అమెరికా వాతావారణ శాఖ విభాగం అంచనా వేసింది.
మంచు తుపాను కారణంగా నెవాడాలోని ప్రధాన రహదారిని గతవారమే మూసివేశారు.
పర్వతప్రాంతాల్లో హిమపాతం సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
అధిక గాలులు, మంచు ప్రభావంతో కోల్‌ఫాక్స్‌, నెవాడా స్టేట్‌ లైన్‌ మధ్యనున్న అంతరాష్ట్ర రహదారిని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.
పర్వత ప్రాంతాల్లో గంటకు 72 కిలోమీటర్ల వేగంతో చలిగాలులు వీస్తున్నట్లు జాతీయ వాతావరణ సర్వీసు వెల్లడించింది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.
సోడా స్ప్రింగ్స్‌, షుగర్‌ బౌల్‌, ఇతర పర్వత పట్టణాల్లో రెండు మీటర్ల కంటే ఎక్కువ మంచు కురిసినట్లు అంచనా వేసింది.
మంచు తుపానుతో ప్రమాదకర పరిస్థితుల నెలకొన్న నేపథ్యంలో యోస్‌మైట్‌ నేషనల్‌ పార్క్‌ను మూసేశారు.
కొన్ని ప్రాంతాల్లో మంచు తుపాను తగ్గుముఖం పట్టినప్పటికీ మళ్లీ ఇవి సంభవించే అవకాశం ఉందని యూఎస్​ వాతావరణ విభాగం హెచ్చరించింది.
కారుపై పేరుకున్న మంచును తొలగిస్తున్న సహాయక సిబ్బంది.
భారీ వాహనంతో మంచు తొలగింపు.
రహదారి బంద్​
మంచు తుపానులో స్థానికుల కష్టాలు.
ఇంటి ముందు పార్క్​ చేసిన కార్లను పూర్తిగా కప్పేసిన మంచు.
మంచును తొలగిస్తున్న సహాయక సిబ్బంది.
సహాయక చర్యల్లో రెస్క్యూ టీం.

ABOUT THE AUTHOR

...view details