తెలంగాణ

telangana

స్టైల్‌తో పాటు కంఫర్టూ ముఖ్యమే! సమ్మర్​లో ఈ ముద్దుగుమ్మల ట్రెండ్‌ ఫాలో అయిపోయిండి - Celebrity Style Summer Outfits

By ETV Bharat Telugu Team

Published : Apr 20, 2024, 5:08 PM IST

Summer Trendy Outfits : వేసవిలో చర్మం కాపాడుకోవడం, అందంగా కనిపించడం అంత ఈజీ కాదు. ఇటు కంఫర్ట్​, అటు స్టైల్‌ మెయింటైన్‌ చేయడం అమ్మాయిలకు పెద్ద టాస్కే అని చెప్పవచ్చు. మరి ఈ సమ్మర్​లో మీరు ఈ ట్రెండీ అవుట్‌ఫిట్స్​ను ఓ లుక్కేయండి.
Summer Trendy Outfits : ఈ సమ్మర్​లో సెలబ్రిటీ స్టైల్​ ట్రెండీ అవుట్​ఫిట్స్​ను ఓ లుక్కేయండి.
కృతి సనన్ ధరించిన ఈ ఫ్లోరల్ సమ్మర్‌ డ్రెస్‌ని చూడండి. అందంగా, సౌకర్యంగా ఉంది కదూ. మరి మీరూ ఓ ప్లోరల్‌ మిడి డ్రెస్‌ కొనేయండి. ఎక్కడికెళ్లినా మీరే స్పెషల్‌ అట్రాక్షన్‌ అవుతారు.
హుమా ఖురేషి ధరించిన ఈ స్టైలిష్‌ ప్యాంట్‌ సూట్‌ చూడండి. బ్లేజర్, ప్యాంట్‌పై వైబ్రెంట్‌ ప్యాటర్న్స్‌ ప్రధాన ఆకర్షణ. దీన్ని వేసుకుని మీరు ఫార్మల్, క్యాజువల్‌ ఈవెంట్స్‌ రెండింటికీ వెళ్లవచ్చు.
కలర్‌ఫుల్‌ ఫ్లోరల్‌ ప్రింటెడ్‌ డ్రెస్‌లో జాన్వీ కపూర్ అద్భుతంగా కనిపిస్తోంది. ఈ డ్రెస్‌కి బోల్డ్‌గా ఉన్న నెక్‌లైన్, తై-హై స్లిట్‌ సెక్సీ లుక్‌ తీసుకొచ్చింది. వైబ్రెంట్‌ డిజైన్‌ డ్రెస్‌లో జాన్వీ కట్టిపడేసింది.
నుష్రత్ భరుచ్చా పర్పుల్‌, బ్లూ కరల్‌ షార్ట్‌ డ్రెస్‌లో అదిరిపోయింది కదా. ఆమె తన జుట్టును ఓపెన్‌గా వదిలేసి, డ్రెస్‌కు తగిన మ్యాచింగ్ హీల్స్‌ వేసుకుంది. ఈ సమ్మర్‌ స్టైలిష్‌ కాంబినేషన్‌ ట్రై చేసెయ్యండి.
విద్యాబాలన్ వేసుకున్న ఓపెన్ మాండరిన్ కాలర్ నెక్‌లైన్‌తో మింట్ గ్రీన్ మ్యాక్సీ, అలాగే మోచేతి వరకు ఉండే స్లీవ్‌లు, కఫ్‌లు, రఫ్ఫ్‌డ్ హెమ్‌లైన్‌ ఉన్న ఈ ఈ స్టైలిష్ డ్రెస్​ను ఓ లుక్కేయండి.

ABOUT THE AUTHOR

...view details