తెలంగాణ

telangana

స్కిప్పింగ్​తో ఈజీ వర్కౌట్​- రన్నింగ్​ కన్నా ఎంతో మేలు! - SKIPPING BENEFITS TELUGU

By ETV Bharat Telugu Team

Published : Apr 14, 2024, 5:57 PM IST

Skipping Benefits Telugu : శరీరాన్ని, మనసును దృఢంగా చేసుకునేందుకు చాలామంది అనేక రకాల వ్యాయామాలు చేస్తుంటారు. ఇలాంటి వారితో పాటు ఇప్పుడే వ్యాయామాన్ని ప్రారంభించే వారికి స్కిప్పింగ్​ అనేది మంచి ఎంపిక. దీని వల్ల ఈజీగా కేలరీలు కరిగిస్తూ ఆరోగ్యంగా ఉండొచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం స్కిప్పింగ్ అనేది ఓ అద్భుతమైన మార్గం. మరి దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఈ ఆర్టికల్​లో తెలుసుకోండి.
బరువు తగ్గాలని అనుకునే వారికి ఉత్తమైన మార్గం స్కిప్పింగ్. మనం ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండేందుకు కూడా స్కిప్పింగ్​ ఎంతో దోహదం చేస్తుంది. మరి స్కిప్పింగ్ చేయడం వల్ల కలిగే లాభాలేంటో ఓసారి చూద్దాం.
స్కిప్పింగ్​ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో పాటు గుండె పోటు, ఇతర సంబంధిత రోగాలు రాకుండా సాయపడుతుంది.
స్కిప్పింగ్​ వల్ల 30 నిమిషాల్లోనే సుమారు 200-300 కేలరీలు కరుగుతాయి. మొదట్లో స్కిప్పింగ్​ కొంత కష్టమనిపించినా, రెగ్యులర్​గా ప్రాక్టీస్​ చేస్తే శక్తి పెరుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారు స్కిప్పింగ్​తో పాటు పోషకాహారం తీసుకోవాలి.
ఫుల్​ బాడీ వర్క్​అవుట్​ స్కిప్పింగ్​ వల్ల శరీరంలోని ప్రతి కండరం కదిలి పూర్తి శరీరానికి వ్యాయమాన్ని అందిస్తుంది. ఇది మీ కాళ్లను మాత్రమే కాకుండా చేతులు, భుజాలు, కండరాలకు బలాన్ని చేకూర్చుతుంది.
మీ ఏకాగ్రతను పెంచేందుకు స్కిప్పింగ్​ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకేసారి మీ శరీరంలోని అనేక భాగాలను స్కిప్పింగ్​లో భాగం చేయడం వల్ల సమన్వయం, శక్తి, ఏకాగ్రత మెరుగవుతుందని ఫిట్​నెస్​ నిపుణులు చెబుతున్నారు.
రన్నింగ్​ లాంటి వ్యాయామాలతో పోలిస్తే స్కిప్పింగ్ కొంచెం ఈజీగా ఉంటుంది. దీంతో కీళ్లపై తక్కువ ఒత్తిడి పడుతుంది. స్కిప్పింగ్​తో పోలిస్తే రన్నింగ్ చేయడం వల్ల మోకాళ్లపై రెండు రెట్లు ఎక్కువ ప్రభావం పడుతుంది.

ABOUT THE AUTHOR

...view details