తెలంగాణ

telangana

ఓల్డ్ ఈజ్ గోల్డ్- బాలీవుడ్ భామల నయా ఫ్యాషన్- 90s ట్రెండ్ ఆగయా! - 90s Fashion Trends

By ETV Bharat Telugu Team

Published : Apr 21, 2024, 9:37 PM IST

90s Fashion Trends : ట్రెండ్​కు తగ్గట్లు డ్రెస్ లు వేస్తుంటారు బాలీవుడ్ హీరోయిన్లు. అయితే బాలీవుడ్ బామలు ఇటీవల కాలంలో ట్రెండ్ మార్చారు. 90వ దశకం నాటి డ్రెస్సింగ్ ను ఫాలో అవుతున్నారు. దాదాపు 35 ఏళ్ల కిందట డ్రెస్సులు వేస్తూ ఆకట్టుకుంటున్నారు. మరి 90వ దశకం డ్రెస్సులను మీరూ ఓ సారి ట్రై చేయండి
90s Fashion Trends : 90s నాటి డ్రెస్సులను వేస్తూ యూత్​ను ఆకట్టుకుంటున్నారు బాలీవుడ్ బ్యూటీలు. మరి ఆ లుక్​ను మీరూ ఓ సారి ట్రై చేయండి.
దీపికా వేసుకున్న ఈ డెనిమ్​ లుక్​ను ఓ సారి చూడండి. 90స్​లో ఫేమస్​ అయిన జంప్​సూట్​గా కనిపిస్తోంది కదూ. ఈ లుక్ కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.
లాంగ్​ స్కర్ట్​, షర్ట్​. ఈ రెండింటి కాంబో 90స్​లో సూపర్ పాపులరైంది. సింపుల్​గా ఉండే ఈ లుక్​ ఆఫీస్​తో పాటు సింపుల్​ ఈవెంట్స్​లో అట్రాక్టివ్​గా ఉంటుంది.
అప్పటి నుంచి ఇప్పటి వరకూ టోర్న్ జీన్స్ ఎంతో ప్రాచూర్యం పొందింది. ఈ లుక్​తో మీరు అటు మోడ్రన్​గా ఉంటూనే మళ్లీ రెట్రో వైబ్స్​ను ఆస్వాదించవచ్చు.
ప్రియాంక వేసుకున్న ఈ ఎత్నిక్ ఔట్​ఫిట్ పార్టీస్​కు బాగా నప్పుతుంది. ​
ఇటీవల కరీనా కపూర్ ఖాన్ వైబ్రెంట్ ప్రింటెడ్ చీర ధరించారు. చూడటానికి సింపుల్​గా ఉన్న ఈ శారీ, వేసుకుంటే మాత్రం సూపర్​ రిచ్​గా కనిపిస్తుంది.

ABOUT THE AUTHOR

...view details