తెలంగాణ

telangana

ఒక్క సినిమాలో ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లు - ఇప్పుడిదే ట్రెండ్! - Actresses Sharing Same Screen

By ETV Bharat Telugu Team

Published : Apr 24, 2024, 12:47 PM IST

2024 Tollywood Movies : ఏ సినిమా అయినా హిట్ అవాలంటే, కథ ఎంత ముఖ్యమో అందులో నటించే నటీనటులు కూడా అంతే ముఖ్యం. అయితే హీరోయిన్ల విషయంలో ప్రేక్షకులు ఇంకాస్త ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటిది ఒకే సినిమాలో ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లు కనిపిస్తున్నారంటే సినీ ప్రేమికులకు ఇక పండగే పండగే. ఈ నేపథ్యంలో ఒకే సినిమాలో కలిసి పని చేస్తున్న ఆ హీరోయిన్లు ఎవరో ఓ లుక్కేద్దామా
2024 Tollywood Movies : ఒక్క సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న స్టార్ హీరోయిన్లు ఎవరంటే ?
హారర్ కమ్ కామెడీ నేపథ్యంలో రానున్న 'బాక్' సినిమాలో రాశీ ఖన్నా, మిల్క్ బ్యూటీ తమన్నా కలిసి నటించనున్నారు. మే 3న ఈ చిత్రం విడుదల కానుంది.
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'కల్కి 2898 ఏడీ'లో బాలీవుడ్ భామలైన దిశా పటానీ, దీపికా పదుకొణె కలిసి తెర పంచుకుంటున్నారు. తెలుగులో దీపికా పదుకొణె నటిస్తున్న తొలి చిత్రం ఇదే.
నిఖిల్ హీరోగా, భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న పీరియాడికల్ యాక్షన్ చిత్రం 'స్వయంభూ'. ఇందులో సంయుక్త మీనన్, నభా నటేశ్ కలిసి కనిపించనున్నారు.
మెగా హీరో వరుణ్ తేజ్ కథానాయకుడిగా రూపొందుతున్న 'మట్కా'లో మీనాక్షి చౌదరితో పాటు బాలీవుడ్ నటి నోరా ఫతేహి కనిపించనున్నారు.
కమల్ హాసన్ హీరోగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న 'భారతీయుడు-2'లో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్​ కలిసి నటిస్తున్నారు.
ప్రభాస్, మారుతి కాంబినేషన్​లో వస్తున్న 'ది రాజా సాబ్' సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్లుగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ కలిసి కనిపించనున్నారట. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.
మెగాస్టార్ చిరంజీవి, వశిష్ఠ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న చిత్రం 'విశ్వంభర'. ఈ సినిమాలో త్రిషతో పాటు ఇషా చావ్లా, సురభిలు కూడా కనిపించనున్నారట.

ABOUT THE AUTHOR

...view details