తెలంగాణ

telangana

నోరు పారేసుకున్న ట్రంప్! 9వేల డాలర్లు ఫైన్- రిపీట్​ చేస్తే జైలుశిక్ష విధిస్తామని కోర్టు వార్నింగ్ - Trump Hush Money Case

By ETV Bharat Telugu Team

Published : Apr 30, 2024, 10:15 PM IST

Updated : Apr 30, 2024, 10:40 PM IST

Trump Hush Money Case : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు న్యూయార్క్ కోర్టు షాక్ ఇచ్చింది. కోర్టు ధిక్కారానికి పాల్పడుతూ సోషల్ మీడియా పోస్టులు చేసినందుకు ఏడున్నర లక్షల రూపాయల (9000 యూఎస్ డాలర్లు) జరిమానా విధించింది. ఇదే పోకడను ట్రంప్ కొనసాగిస్తే జైలుశిక్ష కూడా విధిస్తామని వార్నింగ్​ ఇచ్చింది.

Trump Hush Money Case
Trump Hush Money Case

Trump Hush Money Case : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరోసారి అమెరికాలోని న్యూయార్క్ కోర్టు మొట్టికాయలు పడ్డాయి. తనపై ట్రంప్ అత్యాచారం చేశారని మహిళా జర్నలిస్ట్ ఇ. జీన్ కెరోల్‌ గతంలో కోర్టులో కేసు వేశారు. ఈ కేసులో చాలామంది సాక్షుల నోటిని మూయించేందుకు ట్రంప్ డబ్బులు ఇచ్చారనే అభియోగాలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి నోరు మెదపొద్దని, మీడియా ఎదుట వ్యాఖ్యలు చేయొద్దని గతంలో న్యూయార్క్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే వాటిని పట్టించుకోకుండా ట్రంప్ తన సొంత సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్'లో ఈ అంశంపై పలుమార్లు పోస్టులు పెట్టారు. ఈ కేసులో సాక్షులుగా ఉన్న వారిపై వివిధ కామెంట్లు పెట్టారు. ఈ వివరాలన్నింటితో నమోదైన కేసుల చిట్టా తాజా న్యూయార్క్ కోర్టుకు చేరింది. మొత్తం 10 అభియోగాలు ట్రంప్‌పై నమోదు చేయగా, వాటిలో 9 కోర్టు విచారణలో నిజమేనని రుజువయ్యాయి. దీంతో ట్రంప్‌పై రూ.7.50 లక్షల (9000 యూఎస్ డాలర్లు) జరిమానా విధిస్తూ న్యూయార్క్ కోర్టు తీర్పు ఇచ్చింది. ట్రంప్ తన వ్యవహార శైలిని మార్చుకోకుంటే, ఇదే విధంగా కోర్టు ధిక్కారాన్ని కొనసాగిస్తే జైలుశిక్ష కూడా విధిస్తామని న్యూయార్క్ కోర్టు ధర్మాసనం వార్నింగ్ ఇచ్చింది.

అప్పటిలోగా చెల్లించాలి!
జరిమానాను శుక్రవారం రోజు కచ్చితంగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అందేకాకుండా తన ట్రూత్​ శోషల్​లో ట్రంప్​ పోస్ట్ చేసిన పోస్టులను, తన క్యాంపేన్ వెబ్​సైట్​లో పోస్ట్​ చేసిన రెండు పోస్టులను తొలగించాలని ఆదేశించింది.

తన మాజీ న్యాయవాదిని టార్గెట్ చేసిన ట్రంప్
ఇక ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 17 మధ్య కాలంలో ట్రంప్ తన సొంత సోషల్ మీడియా వేదికలో వివాదాస్పద పోస్టులు చేశారు. అందులో తన మాజీ న్యాయవాది మైఖేల్ కోహెన్‌‌పై ట్రంప్ కీలక కామెంట్స్ చేశారు. కోహెన్ సీరియల్ అబద్ధాలకోరు అని ట్రంప్ పేర్కొన్నారు. మహిళా జర్నలిస్ట్ ఇ. జీన్ కెరోల్‌‌పై ట్రంప్ అత్యాచారం చేశారనే అభియోగాలతో కూడిన కేసులో మైఖేల్ కోహెన్‌‌ అప్రూవర్‌గా మారాడు. మొదట్లో ట్రంప్‌కు అనుకూలంగా సాక్ష్యాలు చెప్పిన కోహెన్ ఆ తర్వాత అకస్మాత్తుగా స్వరం మార్చి జర్నలిస్ట్ కెరోల్‌కు అనుకూలంగా సాక్ష్యాలు చెప్పారు. ఈ కేసులో చాలామంది సాక్షులను ప్రభావితం చేసేందుకు ట్రంప్ బాగా డబ్బును ఖర్చు పెట్టారని కోర్టుకు తెలియజేశారు. అందుకే తాజాగా తన సోషల్ మీడియా పోస్టుల్లో కోహెన్‌పై ట్రంప్ ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు.

Last Updated : Apr 30, 2024, 10:40 PM IST

ABOUT THE AUTHOR

...view details