తెలంగాణ

telangana

టీలో ఉప్పు వేసుకుంటున్నారా లేదా? అలా చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా? - Salt In Tea Benefits

By ETV Bharat Telugu Team

Published : Apr 17, 2024, 10:01 AM IST

Salt In Tea Benefits
Salt In Tea Benefits

Salt In Tea Benefits : మీకు ఛాయ్ అంటే చాలా ఇష్టమా? రోజూ క్రమం తప్పకుండా టీ తాగుతున్నారా? కానీ మీ టీలో ఉప్పు వేసుకుంటున్నారా లేదా? ఛాయ్​లో ఉప్పు వేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసుకుందామా?

Salt In Tea Benefits :ఉదయం లేవగానే కప్పు టీ తాగితే తప్ప ఏ పనీ మొదలు పెట్టనివారు కొందరైతే, రోజులో కనీసం రెండు సార్లయినా ఛాయ్ తాగనిదే బుర్ర అసలు పనిచేయదు అని ఫీల్ అయ్యేవారు ఇంకొందరు. ఎలా చూసినా భారతీయులకు ఛాయ్ తాగనిదే రోజు గడవదంటే అతిశయోక్తి కాదు. అయితే రోజూ మనం తాగే ఛాయ్​లో చక్కెర, టీ పౌడర్ వేసుకుంటాం. కొందరు గ్రీన్ టీ, లెమన్ టీ, బ్లాక్ టీ అని రకరకాలుగా ఛాయ్ తాగుతుంటారు.

అయితే మీరు తాగే ఈ ఛాయ్ లలో ఎప్పుడైనా ఉప్పు వేసుకున్నారా? "ఛాయ్ లో ఉప్పా చీ! "అనుకోకండి అవును! ఉప్పే మీరు రోజూ క్రమం తప్పకుండా తాగే ఛాయ్ లో చిటికెడు అంటే చిటికెడు ఉప్పు వేసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలను పొందచ్చట. ఆలస్యం చేయకుండా అవేంటో చూసేద్దాం పదండి!

రోగనిరోధక శక్తి
పూర్తి శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగవడంలో ఉప్పు కీలక పాత్ర పోషిస్తుంది. వాతావరణ మార్పుల కారణంగా వచ్చే సీజనల్ ఇన్ఫెక్షన్స్ ను కాపాడే శక్తి ఉప్పులో ఉంటుంది.

అరుగుదల
ఉప్పు జీర్ణ రస ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది మనిషి శరీరంలో ముఖ్యమైన జీర్ణ ప్రకియ మెరుగ్గా జరిగేందుకు బాగా సహాయపడుతుంది.

హైడ్రేషన్
ఉప్పు సహజమైన ఎలక్ట్రోలైట్. ఇది వేసవిలో చెమట కారణంగా కోల్పోయిన శరీర ఉప్పును తిరిగి అందిస్తుంది.

పోషకాలు
ఉప్పు మెగ్నీషియం, సోడియం, కాల్షియం, పోటాషియంలతో నిండి ఉంటుంది. ఇవన్నీ మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషకాలు.

చర్మం కోసం!
టీలో ఉప్పు వేసుకుని తాగడం వల్ల దెబ్బతిన్న చర్మం బాగుపడుతుంది. అలాగే మొటిమలు, మచ్చలతో నిండి ఉన్న చర్మం మెరుస్తూ మృదువుగా తయారవుతుంది.

మైగ్రేన్
మైగ్రేన్ సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు తాము తాగే ఛాయ్ లో చిటికెడు ఉప్పు వేసుకుని తాగడం వల్ల త్వరిత ఉపశమనం పొందుతారు. ఇది మెదడును ప్రశాంతంగా మార్చి, శరీర పనితీరును కూడా ప్రోత్సహిస్తుంది.

చేదును తగ్గిస్తుంది!
టీలో ఛాయ్ పత్తి కారణంగా వచ్చే చేదు తనం తగ్గించడానికి ఉప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది. చేదు రుచిని అడ్డుకునే శక్తి ఉప్పుకు ఉంటుంది.

రుచి విషయంలో!
ఉప్పు ఛాయ్​లో తీపిదనాన్ని పెంచేందుకు బాగా సహాయపడతుంది. ముఖ్యంగా మీరు తాగే గ్రీన్ టీ, వైట్ టీలకు చక్కర లేకుండానే చక్కటి రుచిని అందిస్తుంది.

ABOUT THE AUTHOR

...view details