తెలంగాణ

telangana

గసగసాలు ఆరోగ్యానికి మంచివేనా? నిపుణులు ఏం చెబుతున్నారు? - Poppy Seeds Health Benefits

By ETV Bharat Telugu Team

Published : Apr 28, 2024, 12:52 PM IST

Benefits Of Poppy Seeds In Telugu : సుగంధ ద్రవాల్లో ఒకటైన గసగసాలు ఆహారానికి మంచి రుచిని అందించి ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి. రోజూవారీ ఆహారంలో వీటిని చేర్చడం వల్ల ఆరోగ్యానికి మంచిదేనా?

Benefits Of Poppy Seeds In Telugu
Benefits Of Poppy Seeds In Telugu

Benefits Of Poppy Seeds In Telugu :ఇండియన్ కిచెన్​లో మసాలా దినుసులకు ప్రాధాన్యం ఎక్కువ. ఇవి వంటలకు రుచిని అందించడమే కాకుండా మంచి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. సంప్రదాయ ఔషధాలుగా ఉపయోగించే మసాలా దినుసుల్లో గసగసాలు మంచి పోషక విలువలు కలిగి ఉంటాయి. రోజూవారీ ఆహారంలో గసగసాలను చేర్చుకోవడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది. కణాల వాపు తగ్గడానికి, గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ పనితీరు మెరుగవడానికి గసగసాలు చక్కగా పనిచేస్తాయి. ఇవి ఆరోగ్యానికి మంచివేనా? వీటివల్ల కలిగే మరిన్న ప్రయోజనాలేంటి వివరంగా తెలుసుకుందాం.

గసగసాలు మంచివేనా?
గసగసాల వినియోగం విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదట. ఇవి కచ్చితంగా ఆరోగ్యానికి మేలు చేసేవేనని చెబుతున్నారు నిపుణులు. ఇందులో కాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. గసగసాల్లోని లిగ్నాన్స్ క్యాన్సర్ నిరోధక లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణితుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

1. గుండె ఆరోగ్యం
గసగసాలు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే అసంతృప్త కొవ్వులు కలిగి ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అదనంగా గసగసాల్లో అధిక పొటాషియం రక్తపోటును నియంత్రించడానికి, ధమనుల గోడలను బలోపేతం చేసి గుండె పనితీరును ప్రోత్సహించడానికి సహాయపడతాయి.

2.జీర్ణ ఆరోగ్యం
డైటరీ ఫైబర్​కు మంచి మూలమైన గసగసాలు ప్రేగుల కదలికలను మెరుగుపరుస్తాయి. మలబద్ధకాన్ని నిరోధిస్తాయి. ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియాను అభివృద్ధి చేస్తాయి. యాంటీడైరియాల్ ప్రభావాన్ని కలిగిన ఈ దినుసులు కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలిగించడంలోనూ సహాయపడతాయి.

3. శోధ నిరోధక లక్షణాలు
గసగసాల్లో టోకోఫెరోల్​లను కలిగి ఉంటాయి. ఇవి శరీరంపై శోధ నిరోధక ప్రభావాలను చూపుతాయి. గుండె జబ్బులు, క్యాన్సర్, ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలు రాకుండా కాపాడుతుంది.

4. ప్రోటీన్లకు మూలం!
గసగసాల్లో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలతో పాటు మొక్కల ఆధారిత ప్రొటీన్లను కలిగి ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రతను, కండరాల ద్రవ్యరాశిని, నడక సామర్థ్యాన్ని పెంపొందించే గుణాలను కలిగి ఉంటాయి.

5. మెరుగైన నిద్రకు!
గసగసాలు మంచి నిద్రకు ఉపకరిస్తాయి. మెదడుకు ఉపశమనం కలిగించి నిద్రను మెరుగుపరిచేందుకు గసగసాలు చక్కగా సహాయపడుతుంది. నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు. డుకునే ముందు టీస్పూన్ గసగసాల పొడిని తేనె లేదా పాలతో కలిపి తీసుకోవడం వల్ల మంచి నిద్ర మీ సొంతం అవుతుంది.

ABOUT THE AUTHOR

...view details