తెలంగాణ

telangana

అలర్ట్ : చిన్న వయసులోనే కంటి సమస్యలా? - ఈ ఆయుర్వేద టిప్స్ పాటించాల్సిందే! - Ayurveda for Eye Care

By ETV Bharat Telugu Team

Published : Apr 5, 2024, 12:03 PM IST

Ayurveda for Eye Care : మన శరీరంలోని అత్యంత ప్రధానమైన అవయవాల్లో ముఖ్యమైనవి కళ్లు. అవి లేకపోతే జీవితమే అంధకారమైపోతుంది. అయితే.. ఈ రోజుల్లో చిన్న వయసులోనే కంటి సమస్యలు వస్తున్నాయి. ఈ పరిస్థితి రాకుండా ఆయుర్వేద టిప్స్ పాటించాలని సూచిస్తున్నారు నిపుణులు.

Eye
Eye Care Tips

Ayurvedic Tips for Eye Health :కళ్లు ఆరోగ్యవంతంగా ఉండాలంటే మీరు చేయాల్సిన మొదటి పని.. మీ బాడీని ఎప్పుడూ హైడ్రేట్​గా ఉంచడం. ఇందుకోసం డైలీ పుష్కలంగా నీరు తాగడం చాలా అవసరంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అలాగే జ్యూసీ పండ్లు, కూరగాయలు, హెర్బల్ టీలు వంటి హైడ్రేటింగ్ ఆహారాలను మీ డైట్​లో చేర్చుకోవాలంటున్నారు.

బ్యాలెన్స్ ఫుడ్స్ :కంటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఆయుర్వేదం ప్రకారం.. పిత్త దోషాన్ని బ్యాలెన్స్ చేసే ఫుడ్స్ తీసుకోవడం చాలా బాగా సహాయపడుతుందట. దోసకాయలు, కొబ్బరి నీరు, ఆకు కూరలు, ద్రాక్ష, పుచ్చకాయలు వంటి పోషకమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చంటున్నారు.

నెయ్యి :రోజూ కొద్ది మొత్తంలో నెయ్యి తీసుకోవడం వల్ల కళ్లకు మంచి లూబ్రికేషన్ లభించడమే కాకుండా దృష్టి మెరుగుపడుతుందని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇందుకోసం మీరు డైలీ నెయ్యిని వంటకాలలో ఉపయోగించడం లేదా వెచ్చని పానీయాలలో కలిపి తీసుకోవచ్చంటున్నారు. ఆవు నెయ్యి చాలా ప్రయోజనకరంగా ఉంటుందట.

కంటి వ్యాయామాలు : ఇతర శరీర భాగాల మాదిరిగానే కళ్లు ఆరోగ్యంగా ఉండటానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని చెబుతున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. ముఖ్యంగా కంటి కండరాలను సడలించడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, కంటి ఒత్తిడిని తగ్గించడానికి.. రెప్పపాటు, కనుగుడ్లు తిప్పడం వంటి సాధారణ కంటి వ్యాయామాలను ప్రాక్టీస్ చేయాలంటున్నారు.

మంచి నిద్ర : కంటి ఆరోగ్యానికి తగినంత నిద్ర కూడా చాలా ముఖ్యమంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అందుకోసం డైలీ 7-8 గంటల నాణ్యమైన నిద్రను లక్ష్యంగా పెట్టుకోవాలని సూచిస్తున్నారు. అలాగే నిద్రించడానికి కనీసం ఒక గంట ముందు డిజిటల్ పరికరాలను దూరంగా పెట్టాలని, పడుకునే గదిలో అనుకూలమైన నిద్ర వాతావరణం ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.

డైలీ ఈ పొరపాట్లు చేస్తున్నారా? - అయితే మీ కళ్లు దెబ్బతినడం ఖాయం!

కాలుష్యం నుంచి రక్షణ : దుమ్ము, పొగ, కాలుష్య కారకాల వంటి కఠినమైన పర్యావరణ కారకాల నుంచి మీ కళ్లను రక్షించుకోవాలని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. అలాగే UV కిరణాల నుంచి కళ్లను రక్షించడానికి బయటకు వెళ్లినప్పుడు సన్ గ్లాసెస్ ధరించాలని సూచిస్తున్నారు.

ఒత్తిడి : మానసిక ఒత్తిడి కంటి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. కాబట్టి, మీ డైలీ లైఫ్​లో యోగా, ధ్యానం, డీప్ బ్రీతింగ్ ఎక్సర్​సైజ్​లు వంటి వాటిని ప్రాక్టీస్ చేయడం ద్వారా ఒత్తిడి తగ్గించుకోవడమే కాకుండా కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చంటున్నారు. 2017లో 'JMIR Complementary and Medicine' అనే జర్నల్​లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. యోగా, ధ్యానం వంటివి కంటి అలసటను తగ్గించి కళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరడంలో చాలా బాగా సహాయపడతాయని వెల్లడైంది.

కంటి పరిశుభ్రత :మంచి కంటి పరిశుభ్రత అంటువ్యాధులను నివారించడమే కాకుండా.. కళ్లను ఆరోగ్యవంతంగా ఉంచుతుందని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. ముఖ్యంగా మీ చేతులను తరచుగా కడుక్కోవాలి. అలాగే అనవసరంగా మీ కళ్లను తాకడం లేదా రుద్దడం చేయకూడదంటున్నారు. ఇవన్నీ పాటించినా కంటి సమస్యలు నిరంతరంగా వేధిస్తుంటే సంబంధిత వైద్యుడిని సంప్రదించడం మంచిది అంటున్నారు నిపుణులు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య, ఆయుర్వేద నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

అలర్ట్‌ : మీ కళ్లలో ఈ లక్షణాలు ఉన్నాయా? - షుగర్ సంకేతం కావొచ్చు!

ABOUT THE AUTHOR

...view details