తెలంగాణ

telangana

సమ్మర్​లో ఈ పదార్థాలు అస్సలు తినకండి - తీవ్ర అనారోగ్య సమస్యలు గ్యారెంటీ! - SUMMER AVOID FOODS

By ETV Bharat Telangana Team

Published : Apr 13, 2024, 12:34 PM IST

Summer Avoid Foods : రోజురోజుకూ ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో నీడలో ఉండడమే కాకుండా.. తిండి విషయంలోనూ తగిన మార్పులు చేసుకోవడం చాలా అవసరమంటున్నారు నిపుణులు. సమ్మర్​లో ముఖ్యంగా ఈ ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

Summer Avoid Foods
Summer Avoid Foods

Avoid These Foods in Summer : సమ్మర్​లో మీరు ఆరోగ్యంగా ఉండాలంటే స్పైసీ ఫుడ్స్​కు దూరంగా ఉండడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. అసలే ఎండాకాలం బయట ఉష్ణోగ్రతలకు శరీరంలో వేడిమి క్రమక్రమంగా పెరిగిపోతూ ఉంటుంది. ఈ క్రమంలో బాగా మసాలా ఉన్న ఫుడ్స్ తీసుకుంటే అవి బాడీలో మరింత వేడిని పెంచి నీటి శాతాన్ని తగ్గించే ఛాన్స్ ఉంటుందంటున్నారు నిపుణులు. ఫలితంగా జీర్ణ సమస్యలకు దారితీయవచ్చంటున్నారు. కాబట్టి వేసవిలో స్పైసీ ఫుడ్స్​కు దూరంగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు.

2017లో 'జర్నల్ ఆఫ్ గాస్ట్రోఎంటరాలజీ అండ్ హెపాటాలజీ'లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. వేసవిలో స్పైసీ ఫుడ్స్‌ తినే వ్యక్తులలో కడుపులో మంట, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో పాల్గొన్న దిల్లీకి చెందిన ప్రముఖ పోషకాహార నిపుణుడు డాక్టర్ రాజేష్ కుమార్.. ఎండాకాలం మసాలా ఫుడ్స్ అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ అని పేర్కొన్నారు.

ప్రాసెస్ చేసిన ఆహారాలు : వేసవిలో మీరు దూరంగా ఉండాల్సిన మరో ఫుడ్ ఐటమ్.. ప్రాసెస్ చేసిన ఆహారాలు. వీటిలో తక్కువ పోషకాలు ఉండడమే కాకుండా శరీరానికి అవసరమైన శక్తిని అందించలేవు. ముఖ్యంగా వీటిలో అధిక సోడియం ఉంటుంది. ఫలితంగా ఎక్కువ దాహాన్ని కలిగించడమే కాకుండా కడుపు ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్ వంటి జీర్ణ సమస్యలకు దారితీయవచ్చంటున్నారు నిపుణులు.

వేయించిన ఆహారాలు : ఆరోగ్యంగా ఉండాలంటే వీటికి అన్ని సీజన్లలో వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ముఖ్యంగా వేసవిలో ఈ ఆహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటున్నారు నిపుణులు. సాధారణంగా వీటిలో లవణాలు, ఇతర మసాలాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కడుపు లైనింగ్‌ను దెబ్బ తీయడమే కాకుండా అజీర్ణానికి కారణమవుతాయంటున్నారు నిపుణులు. అలాగే.. మొటిమలు వంటి చర్మ సమస్యలను కలిగిస్తాయని చెబుతున్నారు.

షుగర్​ లెవెల్​ మేనేజ్​ చేసే సమ్మర్​ డ్రింక్స్- ఇంట్లోనే చేసుకోండిలా - SUMMER DRINKS at home

కాఫీ :సమ్మర్​లో కాఫీని ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది అంటున్నారు నిపుణులు. దీనిలో ఉండే కెఫెన్ కంటెంట్ బాడీ ఉష్ణోగ్రతను పెంచుతుంది. దీంతో మీరు ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లేలా ప్రేరేపించవచ్చంటున్నారు నిపుణులు. ఫలితంగా బాడీలో వాటర్ లెవల్స్ తగ్గి డీహైడ్రేషన్​కు దారితీయవచ్చంటున్నారు.

షుగర్ ఫుడ్స్ :హై షుగర్ కంటెంట్ ఫుడ్స్ తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత, జీవక్రియ రేటు పెరుగుతుంది. తద్వారా.. జీర్ణక్రియ ప్రక్రియలో ఆటంకాలు ఏర్పడతాయని చెబుతున్నారు నిపుణులు. అంతేకాకుండా రక్తంలో చక్కెర పెరుగుదలకు, బాడీలో కొవ్వు పేరుకుపోవడానికీ దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి సమ్మర్​లో వీటికి దూరంగా ఉండడం ఉత్తమం అంటున్నారు. వీటికి బదులుగా చలువ చేసే పుచ్చకాయలు, నిమ్మకాయలతో చేసిన షర్బత్, పండ్లు ఎక్కువగా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

సమ్మర్​లో మూత్రం మంటగా వస్తోందా? - ఈ టిప్స్ పాటిస్తే ప్రాబ్లమ్స్ ఆల్ క్లియర్! - Summer Urinary Problems

ABOUT THE AUTHOR

...view details