తెలంగాణ

telangana

ఈ వారం అందరి ఫోకస్​ ఆ 5 చిత్రాలపైనే! - This week Movie Releases

By ETV Bharat Telugu Team

Published : Apr 29, 2024, 3:15 PM IST

This week Movie Releases : ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు చిత్రాలు అటు ఓటీటీలో ఇటు థియేటర్లలో రిలీజ్​కు రెడీ అయ్యాయి. మొత్తం 15 వరకు సినిమాలు వస్తున్నాయి. వీటిలో అందరి దృష్టి ఆ 5 చిత్రాలపైనే ఉన్నాయి. అవేంటంటే?

ఈ వారం అందరి ఫోకస్​ ఆ 5 చిత్రాలపైనే!
ఈ వారం అందరి ఫోకస్​ ఆ 5 చిత్రాలపైనే!

This week Movie Releases :ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు చిత్రాలు అటు ఓటీటీలో ఇటు థియేటర్లలో రిలీజ్​కు రెడీ అయ్యాయి. మొత్తం 15 వరకు సినిమాలు వస్తున్నాయి. కానీ ఈ సారి కూడా బడా సినిమాలేమీ లేవు. అయితే పలు వైవిధ్య చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వీటిలో అందరి దృష్టి ఒక్కటీ అడక్కు, హీరామండీ, షైతాన్, ప్రసన్నవదనం, అరణ్‌మనై 4 మీదే ఉన్నాయి.

ఈ చిత్రాల్లో లాంగ్​ గ్యాప్ తర్వాత కామెడీతో రానున్న అల్లరి నరేశ్(Aa okkati adakku allari naresh) సినిమా ఉంది. ఇందులో పెళ్లెప్పుడు అంటూ వెంటపడేవాళ్లకు ఓ కొత్త సెక్షన్‌ పెట్టి మరీ లోపల వేయించాలని డిమాండ్ చేస్తున్నారు నరేశ్​. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్​. మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రాజీవ్‌ చిలక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మే 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

వరుస హిట్లతో కాస్త జోరు మీదున్న సుహాస్ ఈ సారి ఫేస్‌ బ్లైండ్‌నెస్‌(suhas Prasannavadhanam) కాన్సెప్ట్​తో థ్రిల్‌ పంచేందుకు వస్తున్నారు. అర్జున్‌ వై.కె దర్శకుడు. పాయల్‌ రాధాకృష్ణ, రాశీ సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఫేస్‌ బ్లైండ్‌నెస్‌తో బాధపడే సూర్య మూడు మ‌ర్డ‌ర్ కేసుల్లో ఇరుక్కుని చివరకు ఎలా బయటపడ్డాడనేదే ఈ కథ. మే 3నే ఇది రాబోతుంది.

వరలక్ష్మీ శరత్‌కుమార్‌ మదర్ అండ్ డాటర్ సెంటిమెంట్​తో రూపొందిన శబరి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్‌ కాట్జ్‌ దర్శకత్వం వహించారు. ఇది కూడా మే 3నే రానుంది. సైకిలాజికల్ థ్రిల్లర్‌గా అనూహ్యమైన మలుపులతో కథ సాగుతుందని మూవీటీమ్ చెబుతోంది.

సుందర్‌. సి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన బాక్‌ కూడా మే 3నే వచ్చేందుకు సిద్ధమైంది. ఖుష్బు సుందర్‌, ఏసీఎస్‌ అరుణ్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మించారు. తమన్నా, రాశీ ఖన్నా గ్లామర్ రోల్స్ పోషించారు. వెన్నెల కిశోర్‌, కోవై సరళ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సక్సెస్​ఫుల్ హారర్‌ కామెడీ ఫ్రాంచైజీ అరణ్‌మనై నుంచి వస్తున్న 4వ చిత్రమిది.

ఇంకా ఉయ్యాల జంపాల ఫేమ్ ద‌ర్శ‌కుడు విరించి వ‌ర్మ రూపొందిన పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీ జితేందర్‌రెడ్డి కూడా మే 3నే ప్రేక్షకుల్ని పలకరించనుంది. . బాహుబలితో గుర్తింపు తెచ్చుకున్న రాకేశ్‌వర్రే హీరోగా నటించారు.

ఇకపోతే ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/సిరీస్‌లు ఇవే!

  • నెట్‌ఫ్లిక్స్‌లో

డియర్‌ (తమిళ/తెలుగు) ఏప్రిల్‌ 28

బాయిలింగ్‌ పాయింట్‌-1 (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 29

హీరామండి (హిందీ సిరీస్‌) మే 1

షైతాన్‌ (హిందీ) మే 3

ది ఎ టిపికల్‌ ఫ్యామిలీ (కొరియన్‌) మే 4

  • డిస్నీ+హాట్‌స్టార్‌లో

ది వీల్‌ (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 30

  • అమెజాన్‌ ప్రైమ్‌లో

ది ఐడియా ఆఫ్‌ యూ (హాలీవుడ్‌) మే 2

  • జియో సినిమాలో

వోంకా (హాలీవుడ్‌) మే 3

హాక్స్‌3 (వెబ్‌సిరీస్‌) మే 3

ది టాటూయిస్ట్‌ ఆఫ్‌ ఆష్‌విజ్‌ (వెబ్‌సిరీస్‌) మే 3

IMDB టాప్ రేటెడ్ సినిమాలు - ఎక్కడ స్ట్రీమ్ అవుతున్నాయంటే ? - IMDB Top movies In OTT

జక్కన్న కాకుండా రాజమౌళికి ఉన్న మరో నిక్​నేమ్​ ఏంటంటే ? - Rajamouli Nickname Reveal

ABOUT THE AUTHOR

...view details