తెలంగాణ

telangana

వైరల్​గా ఫేక్ ఫొటో - ఒక్క పోస్ట్​తో ఫుల్​స్టాప్ పెట్టిన సమంత​! - Samantha Fake photo

By ETV Bharat Telugu Team

Published : May 6, 2024, 2:11 PM IST

Updated : May 6, 2024, 3:04 PM IST

Samantha Fake Photo Viral: సమంత హాఫ్ న్యూడ్​ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై సామ్ తాజాగా ఓ కొటేషన్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్​గా మారింది. అసలు ఏం జరుగుతుందంటే?

source ANI
Samantha (source ANI)

Samantha Fake Photo Viral :ప్రస్తుతంసోషల్ మీడియాలో ఫేక్ ఫొటోస్​ ఎక్కువ అయిపోయాయి. ముఖ్యంగా స్టార్ హీరోయిన్లు దీని బారిన పడుతున్నారు. ఇప్పటికే రష్మిక, అనుష్క శర్మ సహా పలువురు ఈ ఫేక్ ఫొటో బారిన పడగా ఇప్పుడు సమంత కూడా ఇలాంటిదే ఎదుర్కొంటోంది! గత రెండు రోజుల నుంచి ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాశంశంగా మారింది.

అసలేం జరిగిందంటే? - సాధారణంగానే సామ్​ ఎప్పటికప్పుడు తన లైఫ్ అప్డేట్స్ ఫాలోవర్స్​తో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత షేర్ చేసిన ఓ ఫోటో అంటూ ఒక ఫోటో మీద రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. సామ్ తాను మయోసైటీస్ బారిన పడినట్లు కొన్నాళ్ల క్రితం చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇదే విషయమై సినిమాలకు బ్రేక్ తీసుకున్నట్లు కూడా చెప్పింది. ఇప్పుడు కూడా మయోసైటీస్​కు చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పి ఇన్స్టా స్టోరీలో ఒక ఫోటోను షేర్ చేసి " ట్రీట్మెంట్ తీసుకుంటూనే కోలుకోవడానికి మార్గాలు వెతుకుతున్నా" అని క్యాప్షన్ పెట్టింది.

అయితే ఈ ఫొటోతో పాటు మరో ఫోటో కూడా సమంత షేర్ చేసి తర్వాత డిలీట్ చేసిందని ప్రచారం జరుగుతోంది. అర్ధ నగ్నంగా ఉన్న సమంత ఫోటో ఒకటి వైరల్ చేస్తూ సమంత ఇదే ఫోటో పెట్టి డిలీట్ చేసిందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. దీనిపై సమంత ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజం కాదని చెబుతున్నారు.

అయితే ఈ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే మళ్లీ సమంత తన ఇన్​స్టా స్టోరీలో ఓ కొటేషన్ పోస్ట్ చేసింది. "మిమ్మల్ని మీరు సమర్ధించుకోవడం లేదా నిరూపించుకోవాల్సిన అవసరం లేకుండా బ్రతకడమే నిజమైన విజయం" అనే కొటేషన్ రాసుకొచ్చింది. ఈ పోస్ట్​తో సమంత హాఫ్​ న్యూడ్ ఫొటో ప్రచారానికి ఎలాంటి వివరణ ఇవ్వకుండా కొటేషన్​తో సమాధానం చెప్పిందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఇలాంటి ఫేక్ ఫొటోస్​ ట్రోలింగ్​ బారిలో చాలా మంది హీరోయిన్లు పడటం దురదృష్టకరమనే చెప్పాలి.

Samantha Upcoming Movies : కాగా, 2023లో వచ్చిన ఖుషీ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత మళ్లీ తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్​పై మా ఇంటి బంగారం అనే మూవీని ప్రకటించింది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్​ను కూడా ఈమధ్యే సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈ మూవీ గురించి మిగిలిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ వారం OTTలోకి 15 సినిమాలు - ఆ భారీ బ్లాక్ బస్టర్ మూవీ​ కూడా! - This Week OTT Releases

చెత్తలో 10 గంటలు మాస్క్ లేకుండా - కుబేర కోసం ధనుశ్ భారీ రిస్క్​! - Kubera Dhanush

Last Updated : May 6, 2024, 3:04 PM IST

ABOUT THE AUTHOR

...view details