Salman Khan Watch:బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ టాప్ హీరోల లిస్ట్‌లో అగ్రస్థానంలో ఉంటారు. ఒక్కో సినిమాకు ఆయన రెమ్యునరేషన్ రూ. కోట్లలో ఉంటుంది. ఇదే కాకుండా వ్యాపార రంగంలో, ఎండార్స్మెంట్స్, యాడ్స్ రూపంలో కూడా సంపాదించే సల్మాన్ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుంటారు. అయితే మామూలుగానే ఆయనకు రిస్ట్ వాచ్ (Wrist Watch)లు అంచే చాలా ఇష్టం. వాచ్ కలెక్షన్లో సల్మాన్ ఎప్పుడూ ముందుంటారట.
అయితే రీసెంట్గా సల్మాన్ కలెక్షన్లోని ఓ వాచ్ హాట్‌టాపిక్‌గా మారింది. ఆయన డైమండ్స్ పొదిగిన వాచ్ ధరించి రీసెంట్గా ఓ ఫొటోకు పోజిచ్చారు. అయితే ఈ ఫొటోలో సల్మాన్ ధరించిన వాచ్ అందర్నీ ఆకర్షించింది. అయితే సల్మాన్ ఖాన్ ఖరీదైన వాచ్‌లు ధరించడం కొత్తేం కాదు. కానీ, ఆయన గతంలో ధరించిన వాచ్‌ల ఖరీదు ఎక్కువలో ఎక్కువ రూ.4కోట్ల విలువైనవి!
అయితే ఇన్‌స్టాగ్రామ్‌లోని ఓ ప్రముఖ పేజ్ ప్రకారం తాజాగా సల్మాన్ ధరించిన వాచ్ ధర అక్షరాల రూ.23కోట్లు ఉంటుందని తెలుస్తోంది. అది పాటెక్ ఫిలిప్ రెయిన్ బో (Patek Philippe Rainbow Watch)అనే కంపెనీకి చెందిన వాచ్ అని సమాచారం. దాంట్లో దాదాపు 130 వజ్రాలు పొదిగి ఉన్నాయట. దీందో ఆ వాచ్ ధర తెలిసి నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. 'అంబాని లెవెల్ రిస్ట్ గేమ్' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, 'ఓన్లీ భాయ్ థింక్స్' అంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు. దీంతో సల్మాన్ ఖాన్ వాచ్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.