RC 16 Movie:గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' షూటింగ్లో బిజీగా ఉన్నారు. దీని తర్వాత ఆయన 'ఉప్పెన' ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనాతో ఓ సినిమా చేయనున్నారు. ఆర్సీ 16 అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రస్తుతం ఈ సినిమా రూపొందనుంది. ఇప్పటికే ఈ సినిమాలో 'దేవర' హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ సాలిడ్ అప్డేట్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుందట. దీనికి సంబంధించిన సన్నాహాల్లో మేకర్స్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి 20న పూజా కార్యక్రమంతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సిినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో త్వరలోనే సినిమా షూట్ ప్రారంభమవ్వనుంది.
ఆ టైటిల్‌తో మూవీ షురూ!
RC 16 Title : మరోవైపు ఈ మూవీకి 'పెద్ది' అనే టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఇదే టైటిల్‌ను జూనియర్ ఎన్టీఆర్ సినిమా కోసం బుచ్చిబాబు రిజిస్టర్ చేశారని, దాన్నే ఇప్పుడు రామ్ చరణ్ సినిమాకు పెడుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.