తెలంగాణ

telangana

బర్త్​డే బాయ్​ బన్నీ ఇంటి దగ్గర ఫ్యాన్స్ హంగామ - చిరు, ఎన్టీఆర్​ స్పెషల్ విషెస్ - Happy Birthday Allu Arjun

By ETV Bharat Telugu Team

Published : Apr 8, 2024, 2:03 PM IST

Pushpa 2 Allu arjun : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 42వ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ బన్నీ ఇంటి దగ్గరకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. బన్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ సందడి చేశారు. ఇంకా మెగా స్టార్ చిరంజీవి, ఎన్టీఆర్ సహా పలువురు సెలబ్రిటీలు కూడా అల్లు అర్జున్​కు విషెస్ తెలిపారు.

బర్త్​డే బాయ్​ బన్నీ ఇంటి దగ్గర ఫ్యాన్స్ హంగామ - సెలబ్రిటీలు ఏమన్నారంటే?
బర్త్​డే బాయ్​ బన్నీ ఇంటి దగ్గర ఫ్యాన్స్ హంగామ - సెలబ్రిటీలు ఏమన్నారంటే?

Pushpa 2 Allu arjun : అల్లు అర్జున్ 42వ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ బన్నీ ఇంటి దగ్గర హంగామా చేశారు. గట్టిగా అరుస్తూ చేతిలో కెమెరాలతో బన్నీకి విషెస్ చెప్పారు. బన్నీ కూడా సడెన్​గా ఎంట్రీ ఇచ్చి తన ఇంటి బయట ఉన్న ఫెన్సింగ్ లోపల నుండి అభిమానులందరికి చేయి ఊపుతూ సంతోషంగా వారి అభిమానాన్ని స్వీకరించారు.

ఇకపోతే పుట్టినరోజు సందర్భంగా కుటుంబం సమక్షంలో కేక్ కట్ చేశారు బన్నీ. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి కూడా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో బన్నీతో ఉన్న ఫోటోను హ్యాపీ బర్త్డే ఏమోజీతో పాటు కేక్ ఫోటోను కూడా పోస్ట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా తన సోషల్ మీడియాలో "పుట్టినరోజు శుభాకాంక్షలు బావ" అంటూ రాసుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి "పుట్టినరోజు శుభాకాంక్షలు బన్నీ, నీకు ఈ సంవత్సరం అంతా బాగుండాలి" అంటూ విష్ చేశారు. ఇక నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు పుష్ప 2 టీజర్ గురించి కూడా ప్రస్తావించారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ అల్లు అర్జున్ ఫైర్ బ్రాండ్ అంటూ విషెస్ తెలిపారు. వరుణ్ తేజ్ లాట్స్ ఆఫ్ లవ్ అంటూ పుష్పలో అందరికి నచ్చిన తగ్గేదేలే డైలాగ్​ను క్యాప్షన్​గా రాసి పోస్ట్ చేసారు. ఇంకా చాలామంది అభిమానులు కూడా తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా బన్నీకి విషెస్ తెలిపారు.

కాగా, బన్నీ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పుష్ప 2 టీజర్​ను మేకర్స్​ విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రంలో బన్నీ అమ్మోరు గెటప్​లో తన విశ్వరూపం చూపించారు. గంగమ్మ జాతరలో అమ్మవారి వేషధారణలో కనిపించిన బన్నీ తన యాక్షన్​తో అదరగొట్టేశారు. ఇకపోతే సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్​గా నటిస్తోంది. దర్శకుడు సుకుమార్ భారీ స్కేల్​తో తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్​తో నిర్మిస్తున్నారు. 2024 ఆగస్ట్ 15న ఈ సినిమా ప్రేక్షకులకు ముందుకు రానుంది.

ABOUT THE AUTHOR

...view details