తెలంగాణ

telangana

అమీర్‌పేట్‌లో అన్ని కోచింగ్స్​ ఇచ్చినట్టే, అది కూడా నేర్పిస్తే బాగుండు - ఆసక్తిగా ప్రేమలు తెలుగు ట్రైలర్‌

By ETV Bharat Telugu Team

Published : Mar 2, 2024, 8:50 PM IST

Updated : Mar 2, 2024, 9:09 PM IST

Premalu Movie Telugu Trailer : మలయాళంలో చిన్న చిత్రంగా రిలీజై భారీ విజయాన్ని అందుకున్న చిత్రం ప్రేమలు. దాదాపు రూ.3 కోట్ల బడ్జెట్​తో రూపొందిన ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 65 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా నేడు తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు.

అమీర్‌పేట్‌లో అన్ని కోచింగ్స్​ ఇచ్చినట్టే, అది కూడా నేర్పిస్తే బాగుండు - ఆసక్తిగా ప్రేమలు తెలుగు ట్రైలర్‌
అమీర్‌పేట్‌లో అన్ని కోచింగ్స్​ ఇచ్చినట్టే, అది కూడా నేర్పిస్తే బాగుండు - ఆసక్తిగా ప్రేమలు తెలుగు ట్రైలర్‌

Malayalam MoviePremalu Telugu Trailer : మలయాళంలో చిన్న చిత్రంగా రిలీజై భారీ విజయాన్ని అందుకున్న చిత్రం ప్రేమలు. లవ్ అండ్​ కామెడీ ఎంటర్​టైనర్​గా వచ్చిన ఈ చిత్రం ఈ మధ్యే మలయాళ వెర్షన్​లో విడుదలై భారీ రెస్పాన్స్​ను దక్కించుకుంది. దాదాపు రూ.3 కోట్ల బడ్జెట్​తో రూపొందిన ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 65 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ఈ చిత్రం తెలుగు రైట్స్ కోసం డిమాండ్ ఏర్పడింది. ఫైనల్​గా రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయ తెలుగు రైట్స్‌ను ద‌క్కించుకొని ఈ నెల 8న విడుద‌ల చేస్తున్నారు. దీంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మూవీటీమ్​ నేడు తాజాగా తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఈ ప్రచార చిత్రంలో తెలుగు డైలాగ్స్‌ బాగా ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాలో ఈ మధ్య సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌ అయినా కుమారీ ఆంటీ గురించి ప్రస్తావించడం ట్రైలర్​కు హైలైట్​. హీరోయిన్​ను ప్రేమలో పడేయటం కోసం హీరో చేసే పనులను ఫన్నీగా చూపించారు. ఈ క్రమంలోనే ప్రేమ మనిషిని గుడ్డివాడిని మాత్రమే కాదు మెంటలోడిని కూడా చేస్తుంది. ఫ్రెండ్స్‌ జోన్‌ అనేది కుమారి ఆంటీ లాంటిదిరా, పబ్లిసిటీ, పైసలు ఉంటాయి కానీ, ప్రశాంత ఉండదు. అమీర్‌పేట్‌లో అన్ని కోచింగ్స్‌‌ ఇస్తారు, అమ్మాయిలను ఎలా పడేయాలో కూడా నేర్పిస్తే బాగుండు అనే డైలాగ్స్​ యూత్‌ చేత ఈళలు వేయించేలా ఉన్నాయి.

ఈ ప్రేమలు చిత్రంలో నెల్సన్ కే గఫూర్, మమితా బైజు హీరో హీరోయిన్లుగా నటించారు. ఏడీ గిరీశ్ దర్శకత్వం వహించారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో నెల్సన్, మమితా నటన ప్రేక్షకులను కట్టిపడేసిందనే చెప్పాలి. సినిమా మొత్తం దాదాపుగా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్​లోనే కొనసాగుతుంది. తెలుగు వెర్షన్​కు ఇదే ప్లస్ పాయింట్. ఇంకా సినిమాలో సంగీత్ ప్రతాప్, అఖిలా భార్గవన్, శ్యామ్ మోహన్, మీనాక్షి రవీంద్రన్ సహా పలువురు ఇతర పాత్రల్లో కనిపించారు. భావన స్టూడియోస్ బ్యానర్‌పై దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్‌లతో కలిసి పుష్ప విలన్​ ఫహద్ ఫాసిల్ చిత్రాన్ని నిర్మించారు. విష్ణు విజయ్ సంగీతం సమకూర్చారు.

కళ్లు చెదిరిపోయే రేంజ్​లో శ్రీలీల క్లాసికల్‌ డ్యాన్స్‌ - మీరు చూశారా?

సెలైంట్​గా వరలక్ష్మీ శరత్​కుమార్ ఎంగేజ్​మెంట్​​ - కాబోయే మొగుడు ఎవరంటే?

Last Updated : Mar 2, 2024, 9:09 PM IST

ABOUT THE AUTHOR

...view details