తెలంగాణ

telangana

'నా అవసరాన్ని, ఆకలిని తీర్చింది వారిద్దరే' - హైపర్ ఆది ఎమోషనల్​ - Jabardasth Comedian Hyper Aadi

By ETV Bharat Telugu Team

Published : Mar 25, 2024, 6:45 AM IST

Updated : Mar 25, 2024, 8:43 AM IST

Jabardasth Comedian Hyper Aadi Emotional : జబర్దస్త్​లో తాను రాణించడానికి ఎవరు అండగా నిలిచారో చెప్పి ఎమోషనల్​ అయ్యారు హైపర్ ఆది. తాను కష్టాల్లో ఉన్నప్పుడు తన ఆకలి తీర్చినవారి గురించి చెప్పి భావోద్వేగానికి గురయ్యారు. ఆ వివరాలు.

నా అవసరాన్ని, ఆకలిని తీర్చిదింది వారిద్దరే - హైపర్ ఆది ఎమోషనల్​
నా అవసరాన్ని, ఆకలిని తీర్చిదింది వారిద్దరే - హైపర్ ఆది ఎమోషనల్​

Jabardasth Comedian Hyper Aadi Emotional :బుల్లితెరపై పలు కామెడీ షోలు ప్రసారమై ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ముఖ్యంగా జబర్దస్త్, ఎక్స్​ట్రా జబర్దస్త్​ దూసుకెళ్తున్నాయి. వాటి తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ అదే తరహాలో ఆడియెన్స్​ను ఎంటర్​టైన్​ చేస్తోంది. అదే సమయంలో ఈ షోలు విమర్శలు కూడా ఎదుర్కొంటున్నాయి. డబుల్ మీనింగ్ కామెంట్స్ వంటివి కూడా ఇందులో ఎక్కువగా ఉన్నాయంటూ విమర్శలు తరచుగా వస్తూనే ఉన్నాయి. అయితే ఈ షోలతో చాలా మందే పాపులరై సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు. అలాంటి వారిలో హైపర్ ఆది ఒకరు.

అయితే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదలైంది. ఇందులో హైపర్ ఆది ఎమోషనల్ అయ్యారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడూ అన్నం పెట్టి ఆదుకున్న వ్యక్తిని తలుచుకున్నారు. ఆయనే రాము. రాముతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు హైపర్ ఆది. జబర్దస్త్​లో తాను మంచిగా రాణించడం వెనక ఉన్న వారిలో అదిరే అభితో పాటు రాము పాత్ర కూడా ఉందని అన్నారు. అవసరంలో ఉన్నప్పుడు ఆదుకున్నది అదిరే అభి అన్న అయితే కష్టాల్లో ఉన్నప్పుడు అన్నం పెట్టి ఆకలి తీర్చింది రాము అన్న అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది.

ఇకపోతే పొట్టి నరేశ్, హైపర్ ఆది కలసి చేసిన స్కిట్ బాగా నవ్వించింది. రేయ్​ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. అమ్మాయిది ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ. నాకు చాలా భయం వేస్తోంది. వాళ్ళ చేతుల్లో కత్తులు గొడ్డళ్లు ఉన్నాయంటూ నరేశ్​ - హైపర్ ఆదికి చెబుతాడు. అప్పుడు రేయ్ ఊరుకోరా నీకేముంది నరికేయడానికి అంటూ హైపర్ ఆది తిరిగి అనడం, దానికి నరేశ్​ ఇచ్చిన రియాక్షన్ కడుపుబ్బా నవ్వించింది. అనంతరం ఆ ప్యాక్షనిస్ట్​తో ఫ్యామిలీతో కలిసి హైపర్ ఆది వేసిన వరసు చకోడి పంచ్​లను కితకితలు పెట్టించింది.

అనంతరం పాండురంగడు సినిమాలోని మాతృదేవోభవ సాంగ్​కు జబర్దస్త్ రాము అదిరిపోయే ప్రదర్శన చేశాడు. తన పెర్​ఫార్మెన్స్​తో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించాడు. అందరూ అతడి ప్రదర్శన చూసి ఎమోషనల్ అయ్యారు. అతడి నటనకు మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఆ సమయంలోనే ఆది లేచి నిలబడి రాముతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని ఎమోషనల్​ అయ్యారు. ఇంకా ఈ షోలో కంటెస్టెంట్​లు చేసిన సాహసలు, కనబరిచిన తన టాలెంట్​లు బాగా ఆకట్టుకున్నాయి.

నేను సింగిల్​గా ఉండిపోవడానికి కారణం అతనే - అసలు విషయాన్ని చెప్పిన హైపర్ ఆది! - Hyper aadi Marriage

జనసైనికులకు హైపర్ ఆది భావోద్వేగ సందేశం- ఎందుకంటే?

Last Updated : Mar 25, 2024, 8:43 AM IST

ABOUT THE AUTHOR

...view details