తెలంగాణ

telangana

హృతిక్ రోషన్​కు తీవ్ర గాయాలు - ఎన్టీఆర్ వార్​ 2 షూటింగ్​కు బ్రేక్​

By ETV Bharat Telugu Team

Published : Feb 15, 2024, 6:26 AM IST

బాలీవుడ్ స్టార్​ హీరో హృతిక్ రోషన్ గాయపడ్డారు. ఇది చూసిన టైగర్ ష్రాఫ్‌, వరుణ్‌ ధావన్‌, వాణీ కపూర్‌ సహా పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు ఆయన అభిమానులు హృతిక్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. అసలేం అయిందంటే?

హృతిక్ రోషన్​కు గాయాలు - ఆందోళనలో అభిమానులు
హృతిక్ రోషన్​కు గాయాలు - ఆందోళనలో అభిమానులు

Hrithik Roshan Injured : బాలీవుడ్ స్టార్​ హీరో హృతిక్ రోషన్ గాయపడ్డారు. ఆయన కాలికి గాయమైంది. ఈ విషయాన్ని ఆయనే సోషల్‌ మీడియా వేదికగా చెప్పారు. ఈ మేరకు అద్దం ముందు నిల్చున్న ఫొటోను కూడా షేర్‌ చేశారు. అందులో ఆయన నడుముకు బెల్ట్‌ పెట్టుకుని, క్రచస్‌ (ఊతకర్ర) సపోర్ట్‌తో నిల్చొని ఉన్నారు. మీలో ఎంత మందికి ఈ క్రచస్‌ , వీల్‌ఛైర్‌ అవసరం వచ్చింది. అప్పుడు మీ ఫీలింగ్‌ ఏంటి? అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. తనని తాను మోటివేట్ చేసుకుంటూ కోలుకుంటున్ననట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

ఇది చూసిన టైగర్ ష్రాఫ్‌, వరుణ్‌ ధావన్‌, వాణీ కపూర్‌ సహా పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు ఆయన అభిమానులు హృతిక్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. హృతిక్ గాయం వల్ల కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకోనున్నారని, దీంతో వార్‌ 2 సినిమా షూటింగ్​ వాయిదా పడే అవకాశాలున్నాయని బాలీవుడ్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

దర్శకుడు అయాన్‌ ముఖర్జీ ఈ వార్​ 2 సినిమాను గ్రాండ్ బడ్జెట్​తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్‌ యంగ్ టైగర్, హీరో ఎన్టీఆర్‌ (NTR War 2 Movie) కూడా నటించనున్నారు. ఈ ఇద్దరి కాంబోలో సినిమా అనౌన్స్​ వచ్చినప్పుడు నుంచి అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ కాస్త నెగెటివ్‌ షేడ్‌ ఉన్న క్యారెక్టర్‌లో నటిస్తారని ఆ మధ్య కథనాలు వచ్చాయి. వచ్చే ఏడాది రిలీజ్​కు సన్నాహాలు చేస్తున్నారు.

కాగా, ఈ ఏడాది ఫైటర్‌ (Hrithik Fighter) చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు హృతిక్‌ రోషన్​. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. రిపబ్లిక్‌ డే సందర్భంగా రిలీజైన ఈ చిత్రం దాదాపు రూ. 330 కోట్లకుపైగా వసూళ్లను అందుకుంది. భారతీయ వైమానిక దళం నేపథ్యంలో సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కించారు. దీపికా పదుకొణె హీరోయిన్​గా నటించింది.

ఇక ఎన్టీఆర్ విషయానికొస్తే ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో దేవర(NTR Devara Movie) అనే సీ కాన్సెప్ట్​ మూవీ చేస్తున్నారు. ఇది కూడా భారీ బడ్జెట్​తో తెరకెక్కుతోంది. జన్వీకపూర్ హీరోయిన్​గా సైఫ్​ అలీఖాన్ విలన్​గా నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది.

షాకింగ్ ​: సీక్రెట్​గా పెళ్లి - ఏడాదికే విడాకులు తీసుకున్న జబర్దస్త్​ నటి

వాలంటైన్స్‌ డే : టాలీవుడ్ బెస్ట్ లవ్​ డైలాగ్స్​ - ఇవి​​ చెప్పి మనసు దోచేయండి బ్రదర్స్​!

ABOUT THE AUTHOR

...view details