తెలంగాణ

telangana

మోత మోగిస్తున్న టిల్లు స్క్వేర్​ - ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే? - Tillu Square OTT

By ETV Bharat Telugu Team

Published : Mar 31, 2024, 10:31 AM IST

DJ Tillu Square OTT Streaming : బాక్సాఫీస్ ముందు హిట్ టాక్​తో దూసుకెళ్తున్న టిల్లు స్క్వేర్ ఓటీటీ డీటెయిల్స్​ బయటకు వచ్చాయి. ఈ సినిమా ఎప్పటి నుంచి ఓటీటీలోల స్ట్రీమింగ్ కానుందంటే?

మోత మోగిస్తున్న టిల్లు స్క్వేర్​ - ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
మోత మోగిస్తున్న టిల్లు స్క్వేర్​ - ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

DJ Tillu Square OTT Streaming : సిద్ధు జొన్నలగడ్డ మరోసారి తన డిఫరెంట్ యాటిట్యూడ్ స్టైల్ యాక్టింగ్​తో అదరగొట్టాడు. ఎన్నో అంచనాలతో టిల్లు స్క్వేర్​గా వచ్చి ర్యాంపేజ్ ఆడించాడు. డీజే టిల్లు సినిమాకు మించి ఫన్ ఎంటర్​టైన్మెంట్​ను పంచాడు. తన టైమింగ్ డైలాగ్ డెలివరీతో నవ్వులు పూయించాడు. లిల్లీ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కూడా హాట్ ఎక్స్​ప్రెషన్స్​ అండ్ సీన్స్​తో ఆకట్టుకుంది. దీంతో సినిమాకు పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి.

ఫస్టాఫ్​లో ఫుల్ రొమాన్స్‌, సెకండాఫ్‌లో ట్విస్టులతో బాగా నవ్వులు పూయించిందని ఆడియెన్స్ చెబుతున్నారు. ఇక ఈ పాజిటివ్ రెస్పాన్స్​తో టిల్లు గాడు మరోసారి హిట్ కొట్టేశాడు. నిర్మాత నాగవంశీ కూడా ఈ చిత్రం రూ. 100 కోట్ల మార్క్ చేరుకుంటుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఏ సినిమా థియేటర్లలోకి వచ్చినా ఆ వెంటనే వినిపించే మాట ఓటీటీ. ఓటీటీలో ఆ సినిమా ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలో టిల్లు స్క్వేర్​ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు బయటకు వస్తున్నాయి. దీనిని నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు ఇదివరకే వార్తలు వచ్చాయి. రూ. 13 నుంచి 15 కోట్లు వరకు పెట్టి దక్కించుకుందట.

ఈ థియేట్రికల్ విడుదల పూర్తైన నెల రోజులకు ఓటీటీలో టిల్లు గాడు రానున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ చివరి వారంలో లేదా ఆగస్ట్ మొదటి వారంలో ఓటీటీ స్ట్రీమింగ్​కు వచ్చే అవకాశం ఉందని తెలిసింది. అయితే ఇది పక్కా అని చెప్పలేం. ఎందుకంటే సినిమా లాంగ్​ రన్​ టైమ్ రెస్పాన్స్ ఆధారంగా ఇది ఉంటుంది. కాబట్టి దీనిపై క్లారిటీ రావాలంటే అఫీషియల్ అనౌన్స్​మెంట్ వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. ఇక ఈ టిల్లు స్క్వేర్ శాటిలైట్ రైట్స్​ ప్రముఖ ఛానెల్ స్టార్ మా కొనుగోలు చేసిందట.

కాగా, ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 23.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు మూవీటీమ్​ అధికారికంగా ప్రకటించింది. రెండో రోజుల్లో రూ.45.3 కోట్లు వచ్చినట్లు తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 20 కోట్ల వరకు షేర్ వసూళ్లు వచ్చినట్లు తెలిసింది. ఇక నేడు(మార్చి 31) ఆదివారం కాబట్టి మరింత భారీగా వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉంది.

టిల్లన్న మాస్ జాతర - డే 2 కూడా సాలిడ్ కలెక్షన్స్​! - Tillu Square Collections

'తనే నా ఆరాధ్య దేవత' - సీక్రెట్ ఓపెన్ అయిన విజయ్ దేవరకొండ! - Family Star Vijay Devarkonda

ABOUT THE AUTHOR

...view details