తెలంగాణ

telangana

పది, ఐటీఐ అర్హతతో - మర్చెంట్ నేవీలో 4000 ఉద్యోగాలు - దరఖాస్తు చేసుకోండిలా! - Merchant Navy Recruitment 2024

By ETV Bharat Telugu Team

Published : Apr 8, 2024, 11:08 AM IST

Merchant Navy Recruitment 2024 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్​. ఇండియన్ మర్చెంట్ నేవీ 4,000 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.
Merchant Navy Jobs 2024
Merchant Navy Recruitment 2024

Merchant Navy Recruitment 2024 :ఇండియన్​ మర్చెంట్ నేవీ 4,000 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగాల వివరాలు
Merchant Navy Jobs :

  • కుక్​ - 203
  • మెస్​ బాయ్స్​ - 922
  • వెల్డర్​/ హెల్పర్ - 78
  • ఎలక్ట్రీషియన్​ - 408
  • సీమెన్​ - 1432
  • ఇంజిన్​ రేటింగ్​ - 236
  • డెక్ రేటింగ్ - 721
  • మొత్తం పోస్టులు - 4000

విద్యార్హతలు
Merchant Navy Job Qualifications :

  • కుక్​, మెస్​ బాయ్స్​, సీమెన్​, ఇంజిన్​ రేటింగ్​ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.
  • డెక్ రేటింగ్ పోస్టులకు 10+2 (ఇంటర్​) క్వాలిఫై అయ్యుండాలి.
  • వెల్డర్​/ హెల్పర్​, ఎలక్ట్రీషియన్ పోస్టులకు సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమతి
Merchant Navy Job Age Limit :

  • కుక్​, మెస్ బాయ్స్​, వెల్డర్/ హెల్పర్​, ఎలక్ట్రీషియన్ పోస్టులకు అభ్యర్థుల వయస్సు 17.5 ఏళ్ల నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి.
  • సీమెన్, ఇంజిన్ రేటింగ్, డెక్ రేటింగ్ పోస్టులకు అభ్యర్థుల వయస్సు 17.5 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి.

దరఖాస్తు రుసుము
Merchant Navy Job Application Fee :అప్లికేషన్ ఫీజు పోస్టులను బట్టి మారుతుంది. కనుక పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.

పరీక్ష
Merchant Navy Exam Pattern :

  • అభ్యర్థులకు 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
  • జనరల్ అవేర్​నెస్​ - 25 మార్కులు
  • సైన్స్ నాలెడ్జ్​ - 25 మార్కులు
  • ఇంగ్లీష్ నాలెడ్జ్​ - 25 మార్కులు
  • ఆప్టిట్యూడ్​ & రీజనింగ్ - 25 మార్కులు

జీతభత్యాలు
Merchant Navy Jobs Salary :

  • కుక్, మెస్​ బాయ్స్​, ఇంజిన్ రేటింగ్ పోస్టులకు నెలకు రూ.40,000 నుంచి రూ.60,000 జీతం ఉంటుంది.
  • డెక్ రేటింగ్​, వెల్డర్​/ హెల్పర్​లకు నెలకు రూ.50,000 నుంచి రూ.85,000 వరకు సాలరీ ఇస్తారు.
  • సీమెన్​ పోస్టులకు రూ.38,000 నుంచి రూ.55,000 జీతం ఉంటుంది.
  • ఎలక్ట్రీషియన్​కు రూ.60,000 నుంచి రూ.90,000 వరకు జీతం ఇస్తారు.

దరఖాస్తు విధానం
Merchant Navy Job Application Process :

  • అభ్యర్థులు ముందుగా https://sealanemaritime.in/ వెబ్​సైట్ ఓపెన్ చేయాలి.
  • మర్చెంట్ నేవీ రిక్రూట్​మెంట్​ 2024 లింక్​పై క్లిక్ చేయాలి.
  • అప్లికేషన్​లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
  • అవసరమైన అన్ని పత్రాలు అప్లోడ్ చేయాలి.
  • దరఖాస్తు రుసుము కూడా ఆన్​లైన్​లోనే చెల్లించాలి.
  • అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకుని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

ముఖ్యమైన తేదీలు
Merchant Navy Recruitment 2024 Apply Last Date :

  • అప్లికేషన్ స్వీకరణ ప్రారంభం : 2024 మార్చి 11
  • అప్లికేషన్​కు చివరి తేదీ : 2024 ఏప్రిల్​ 30
  • పరీక్ష తేదీ : 2024 మే చివరి వారంలో (Tentative)

సౌత్​ ఈస్ట్ సెంట్రల్​ రైల్వేలో 1113 ఉద్యోగాలు - దరఖాస్తు చేసుకోండిలా! - Railway Jobs 2024

మహిళలకు భారీ వేతనాలు ఇచ్చే టాప్​-10 ఉద్యోగ అవకాశాలివే! - Highest Paying Jobs For Women

ABOUT THE AUTHOR

...view details