తెలంగాణ

telangana

పేటీఎం యూజర్లకు అలర్ట్- ఆ రోజు నుంచి డిపాజిట్స్ బంద్​!

By ETV Bharat Telugu Team

Published : Jan 31, 2024, 6:02 PM IST

Updated : Feb 5, 2024, 2:50 PM IST

RBI On Paytm Payment Bank : పేటీఎం యూజర్లకు అలర్ట్​. పేటీఎం పేమెంట్ బ్యాంక్​ ఫిబ్రవరి 29 నుంచి ఖాతాదారుల నుంచి డిపాజిట్లు సేకరించవద్దని ఆర్​బీఐ ఆదేశించింది. అలాగే వాలెట్స్, ఫాస్టాగ్​ డిపాజిట్లు, టాప్​-అప్​లు కూడా ఆమోదించకూడదని స్పష్టం చేసింది.

RBI On Paytm Payment Bank
RBI On Paytm Payment Bank

RBI On Paytm Payment Bank :పేటీఎంకు చెందిన పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షాకిచ్చింది. ఫిబ్రవరి 29 తర్వాత ఏ కస్టమర్‌, ప్రీపెయిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌, వ్యాలెట్‌, ఫాస్టాగ్‌లలో డిపాజిట్లు, టాప్‌-అప్‌లు చేపట్టకూడదని ఆదేశించింది. సమగ్ర సిస్టమ్‌ ఆడిట్‌, బయటి ఆడిటర్ల నివేదికలను అనుసరించి పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ పై ఆర్‌బీఐ చర్యలు తీసుకుంది. బ్యాంక్‌లో నిబంధనల ఉల్లంఘనను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ తన ప్రకటనలో తెలిపింది.

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకులోని సేవింగ్స్‌ అకౌంట్‌, కరెంట్‌ అకౌంట్‌, ప్రీపెయిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌, ఫాస్టాగ్స్, నేషనల్‌ కామన్‌ మొబిలిటీ కార్డ్స్‌లో నిల్వ ఉన్న మొత్తాల విత్‌డ్రా, వినియోగం విషయంలో కస్టమర్లపై ఎలాంటి ఆంక్షలూ ఉండవని ఆర్‌బీఐ స్పష్టంచేసింది. వడ్డీ, క్యాష్‌బ్యాక్‌, రిఫండ్లను ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది. 2022 మార్చిలో సైతం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్‌బీఐ కఠిన చర్యలు తీసుకుంది. కొత్త కస్టమర్లను చేర్చుకోవడాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.

కొద్దిరోజుల క్రితం, పేటీఎం అయోధ్య యాత్రికుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. పేటీఎం ద్వారా బస్సు, ఫ్లైట్​ టికెట్స్ బుక్​ చేస్తే గరిష్ఠంగా 100 శాతం వరకు క్యాష్ బ్యాక్ అందిస్తామని స్పష్టం చేసింది. తక్కువ బడ్జెట్లో అయోధ్యకు వెళ్లిరావాలని ఆశించేవారికి ఇది బాగా ఉపయోగపడుతుందని పేటీఎం మాతృసంస్థ వన్​97 కమ్యునికేషన్ లిమిటెడ్ పేర్కొంది.

ప్రోమో కోడ్​ ఇదే!
అయోధ్యలో కొలువైన బాలరాముడిని దర్శించుకోవాలని ఆశించే భక్తులు పేటీఎం ద్వారా సులువుగా బస్సు, విమాన టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అయితే బస్సు టికెట్లు బుక్ చేసేవారు BUSAYODHYA అనే ప్రోమోకోడ్​ ఉపయోగించాలి. విమానం టికెట్లు బుక్ చేసుకునేవారు FLYAYODHYA అనే ప్రోమోకోడ్ ఎంటర్ చేయాలి. బస్సు టికెట్స్ బుక్ చేసుకునేవారికి గరిష్టంగా రూ.1000 వరకు క్యాష్​బ్యాక్ వస్తుంది. ఫ్లైట్​ టికెట్స్ బుక్ చేసుకునేవారికి గరిష్ఠంగా రూ.5000 వరకు క్యాష్​బ్యాక్​ లభిస్తుంది.పేటీఎం ద్వారా బుక్ చేసుకున్న టికెట్లను ఉచితంగా క్యాన్సిల్​ కూడా చేసుకోవచ్చు. వారికి ఎలాంటి కోతలు లేకుండా 100 శాతం రిఫండ్ లభిస్తుందని పేటీఎం స్పష్టం చేసింది.

Last Updated :Feb 5, 2024, 2:50 PM IST

ABOUT THE AUTHOR

...view details