తెలంగాణ

telangana

ట్రైన్‌ టికెట్‌ పోయిందా/ చిరిగిపోయిందా? సింపుల్​గా డూప్లికేట్ టికెట్ పొందండిలా!

By ETV Bharat Telugu Team

Published : Mar 3, 2024, 6:06 PM IST

How To Get A Duplicate Train Ticket In India : మీరు అర్జెంట్​గా ట్రైన్​కు వెళ్లాలా? కానీ టికెట్ పోయిందా? లేక చిరిగిపోయిందా? అయినా మీరేమీ చింతించాల్సిన పనిలేదు. సింపుల్​గా డూప్లికేట్ టికెట్​ తీసుకోవచ్చు. అది ఎలాగో, దీనికి ఎంత ఛార్జీ వసూలు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

duplicate train ticket charges
How To Get A Duplicate Train Ticket

How To Get A Duplicate Train Ticket In India : రైలు ప్రయాణం చేసేందుకు చాలా రోజుల ముందే రిజర్వేషన్‌ చేసుకుంటాం. టికెట్‌ను చాలా భద్రంగా దాచిపెట్టుకుంటాం. కానీ ఒకవేళ పొరపాటున టికెట్‌ పోతే లేదా చిరిగిపోతే ప్రయాణానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. రిజర్వేషన్‌ చేసుకున్నా, టికెట్‌ లేకపోతే టీటీఈ సదరు ప్రయాణికుడిని రైలులోకి అనుమతించడు. మీరు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైందా? అయితే, ఇకపై చింతించాల్సిన అవసరం లేదు. టికెట్‌ పోయినా, ఒకవేళ చిరిగిపోయినా ఇండియన్​ రైల్వే అందుకు ప్రత్యామ్నాయ సదుపాయాన్ని అందిస్తోంది.

డూప్లికేట్ టికెట్
టికెట్‌ పోయిన సందర్భంలో ప్రయాణానికి ఇబ్బంది రాకుండా భారతీయ రైల్వే డూప్లికేట్‌ టికెట్‌ను (Duplicate ticket) పొందే వీలును కల్పిస్తోంది. అయితే ఇందుకోసం కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా రైల్వే ప్యాసింజర్‌ రిజర్వేషన్‌ సిస్టమ్‌ (PRS) కౌంటర్‌ వద్దకు వెళ్లి విషయాన్ని తెలియజేయాలి. అయితే, అక్కడ ఛార్ట్‌ ప్రిపేర్‌ అవ్వక ముందు ఒక రకమైన ఛార్జీ, ఛార్ట్‌ ప్రిపేర్‌ అయిన తర్వాత వేరొక ఛార్జీ విధిస్తారు.

  • ఒకవేళ మీ టికెట్‌ కన్ఫర్మ్‌ అయి ఛార్ట్‌ ప్రిపేపర్‌ అవ్వకముందే రైల్వే అధికారులను సంప్రదిస్తే మీకు డూప్లికేట్ టికెట్‌ను జారీ చేస్తారు. కానీ ప్రయాణికుడి నుంచి క్లరికేజ్‌ ఛార్జీలు వసూలు చేస్తారు. ఆర్‌ఏసీ టికెట్లు ఉన్న వారు కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.
  • ఒకవేళ ఛార్ట్‌ ప్రిపేపర్‌ అయ్యాక పోయిన టికెట్‌ స్థానంలో డూప్లికేట్‌ టికెట్‌కు దరఖాస్తు చేస్తే మొత్తం ఫేర్‌లో 50 శాతం ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఆర్‌ఏసీ టికెట్‌ కలిగిన వారికి ఈ సదుపాయం లేదు.
  • ఛార్ట్‌ ప్రిపేర్‌ అయ్యాక టికెట్‌ చిరిగిన టికెట్‌ స్థానంలో డూప్లికేట్‌ టికెట్‌ కోసం ఆర్‌ఏసీ టికెట్‌ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం మొత్తం ఫేర్‌లో 25 శాతం ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
  • ఒకవేళ డూప్లికేట్‌ టికెట్‌ తీసుకున్న తర్వాత ఒరిజినల్‌ టికెట్‌ దొరికితే ప్రయాణం కంటే ముందే రైల్వే అధికారులకు సమర్పిస్తే 5శాతం ఛార్జీ మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని రీఫండ్‌ చేస్తారు. ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేసుకుంటే ఐఆర్‌సీటీసీ అకౌంట్‌లోకి వెళ్లి టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు ఉంది.

ABOUT THE AUTHOR

...view details