తెలంగాణ

telangana

మార్చి డెడ్​లైన్స్​ - గడువులోగా ఈ పనులన్నీ కంప్లీట్​ చేయాల్సిందే!

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 2:58 PM IST

Financial Deadlines In March 2024 : మరికొద్ది రోజుల్లో 2023-24 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆధార్​ అప్​డేషన్​​, ఫాస్టాగ్​ కేవైసీ సహా, పలు డెడ్​లైన్స్ గురించి తెలుసుకోవాల్సి ఉంది. గడువులోగా వాటిని పూర్తి చేయకపోతే, తరువాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Financial Deadlines In March 2024
Financial Deadlines In March 2024

Financial Deadlines In March 2024 :మరికొద్ది రోజుల్లో 2023-24 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. అంతకంటే ముందు ఈ మార్చి నెలలో పలు కీలక ఆర్థిక అంశాల గడువు ముగుస్తోంది. వాటిని సకాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకే ఆ ఫైనాన్సియల్​ డెడ్​లైన్స్​ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆధార్​ ఫ్రీ అప్​డేట్​కు​ చివరి తేదీ :చాలా ఏళ్లుగా ఎవరైతే ఆధార్​ వివరాలను అప్​డేట్ చేసుకోలేదో, వారు మార్చి 14లోపు ఉచితంగా అప్​డేట్​ చేసుకోవడానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) అవకాశం కల్పించింది. ఆధార్​ సంబంధిత మోసాలను నివారించడానికి ఇది తప్పనిసరి. ఒక వేళ ఈ గడువులోగా ఆధార్​ అప్​డేట్ చేసుకోకపోతే, తరువాత నుంచి ఆధార్​ అప్​డేట్​ కోసం అదనపు ఛార్జీలను చెల్లించాల్సి వస్తుంది.

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్​ డెడ్​లైన్
పేటీఎం పేమెంట్ బ్యాంక్ కస్టమర్లు తమ నగదును ఇతర బ్యాంకుల్లోకి ట్రాన్స్​ఫర్​ చేసుకునేందుకు ఆఖరు తేదీ మార్చి 15. ఒక వేళ గడువులోగా మీ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్​లో ఉన్న డబ్బును ట్రాన్స్​ఫర్​ చేసుకోకపోతే, ఆ తరువాత డబ్బు జమ చేసుకోవడం, క్రెడిట్​ ట్రాన్షాక్షన్స్​ చేయడానికి అవకాశం ఉండదు.

నాలుగో విడత అడ్వాన్స్​ ట్యాక్స్​ పేమెంట్​ : 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, నాలుగో విడత అడ్వాన్స్​ ట్యాక్స్​ పేమెంట్​ చేసేందుకు ఆఖరు తేదీ మార్చి 15.

ట్యాక్స్​ సేవింగ్​ ఇన్వెస్ట్​మెంట్లు :ట్యాక్స్​ సేవింగ్​ ఇన్వెస్ట్​మెంట్లు చేసేందుకు మార్చి​ 31 వరకు మాత్రమే గడువు ఉంది. ఈ తేదీలోగా ఇన్వెస్ట్​మెంట్లు చేస్తే, పన్ను ఆదా కావడానికి అవకాశం ఉంటుంది.

ఆదాయ పన్ను రిటర్నులు :2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, సవరించిన ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి గడువు 2024 మార్చి 31. కనుక సదరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్నులను దాఖలు చేయడంలో విఫలమైన పన్ను చెల్లింపుదారులు, సవరించిన ఐటీఆర్​ను లేదా ఐటీఆర్​-యూను మార్చి 31లోపు సమర్పించుకోవచ్చు.

ఆదాయపు పన్ను షరతులు పాటించినట్లయితే, సంబంధిత అసెస్​మెంట్ సంవత్సరం ముగిసినప్పటి నుంచి రెండేళ్లలోపు అప్​డేట్​ చేసిన ఆదాయపు పన్ను రిటర్నులను ఫైల్ ​చేసుకునే వెసులుబాటు ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్​ ఫైల్​ చేయనివారు ఈ మార్చి 31 లోపు దానిని దాఖలు చేయవచ్చు.

ఫాస్టాగ్​ అప్​డేట్​ :పేటీఎం ఫాస్టాగ్​ వినియోగదారులు ఎదుర్కొంటున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, నేషనల్​ హైవే ఆథారిటీ ఆఫ్ ఇండియా ఫాస్టాగ్​ అప్డేట్​ కోసం 2024 మార్చి 31 వరకు గడువు పొడిగించింది. కనుక ఫాస్టాగ్ వినియోగదారులు ఈ గడువులోగా కేవైసీ (Know Your Customer) పూర్తి చేసుకోవాలి.

మీ కార్ ఇన్సూరెన్స్ ఎక్స్​పైర్ అయ్యిందా? సింపుల్​గా రెన్యువల్ చేసుకోండిలా!

ఇన్​స్టాంట్ లోన్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ABOUT THE AUTHOR

...view details