తెలంగాణ

telangana

రూ.10 లక్షల్లో క్రూయిజ్ కంట్రోల్ కార్లు కొనాలా? టాప్​ -5 మోడల్స్ ఇవే! - Best Cruise Control Cars In India

By ETV Bharat Telugu Team

Published : Apr 25, 2024, 10:44 AM IST

Best Cruise Control Cars In India : సాధ్యమైనన్ని ఎక్కువ ఫీచర్లు ఉండి అతి తక్కువ ధరలో కారు కొనుగోలు చేయాలని చాలా మంది అనుకుంటారు. అయితే కారులో క్రూయిజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా ముఖ్యమే. మ‌రి అలాంటి క్రూయిజ్ కంట్రోల్ అంటే ఏంటి? ఈ ఫీచర్​తో తక్కువ బ‌డ్జెట్​లో ఉన్న టాప్-5 కార్లు ఏంటో చూద్దాం.

Best Cruise Control Cars In India
Best Cruise Control Cars In India

Best Cruise Control Cars In India : పెరుగుతున్న ఎండ‌ల‌కు అనుగుణంగా ప్ర‌తి ఒక్కరికీ ఒక కార్ ఉంటే బాగుండేద‌ని అనిపిస్తోంది. కానీ చాలా మందికి ఇదొక క‌లే. కారును కొనుగోలు చేయాలంటే బ‌డ్జెట్​తో పాటు చాలా అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సి ఉంటుంది. అన్ని ఫీచ‌ర్లు గ‌మ‌నించి తీసుకోవాలి. అందులో క్రూయిజ్ కంట్రోల్ కూడా ఒక‌టి. అస‌లీ క్రూయిజ్ కంట్రోల్ అంటే ఏంటి? అదెలా ప‌నిచేస్తుంది? రూ. 10 ల‌క్ష‌ల లోపు ఉన్న మంచి క్రూయిజ్ కంట్రోల్ కార్ల గురించి తెలుసుకుందాం.

క్రూయిజ్ కంట్రోల్ అనేది ప్ర‌స్తుతం వ‌స్తున్న కార్ల‌లో ఒక అద్భుతమైన ఫీచ‌ర్. సింగిల్ బ‌ట‌న్​తో మ‌న కారును ఒక నిర్దిష్ట వేగంతో న‌డిపే ఒక వ్య‌వ‌స్థ‌. వాహ‌నాన్ని ప‌రుగులెత్తించాలంటే యాక్స‌ల‌రేట‌ర్ తొక్కాలి. కానీ దాని మీద అదే ప‌నిగా కాలు పెట్టాలంటే ఇబ్బందిగానే ఉంటుంది. ఇలాంటి బాధ‌ను త‌గ్గించ‌డానికే ఈ ఫీచ‌ర్ తీసుకొచ్చారు. స్టీరింగ్ ప‌క్క‌నే ఉండే ఈ కంట్రోల్ బ‌ట‌న్​ను నొక్కితే ఒక నిర్దిష్ట‌మైన వేగంతో కారు వెళుతుంది. ఇదో ఎలక్ట్రిక్ సిస్టమ్. దీన్ని ఉప‌యోగిస్తే డ్రైవింగ్​లో ఉండే అల‌స‌ట‌ను, ఒత్తిడిని త‌గ్గిస్తుంది. లాంగ్ ట్రిప్​ల‌కు వెళ్లే వారికి ఈ ఫీచ‌ర్ బాగా ఉపయోగ‌ప‌డుతుంది. ఈ ఫీచర్ అందిస్తున్న ఇండియాలోని బ‌డ్జెట్ ఫ్రెండ్లీ టాప్- 5 కార్స్ గురించి చూద్దాం.

Hyundai Grand i10 Nios: హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కారు ఇండియాలో క్రూయిజ్ కంట్రోల్‌తో న‌డిచే కార్ల‌లో బెస్ట్ ఆప్షన్. మార్కెట్ ధర రూ.7.28 లక్షలు. ఈ ఫీచర్​లో పెట్రోల్-మాన్యువల్ ఇంజిన్‌తో ఉన్న మిడ్-స్పెక్ స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్ ఎడిషన్‌లో అందుబాటులో ఉంది.

Maruti Suzuki Nexa Baleno Alpha :అతిపెద్ద వినియోగ‌దారుల్ని క‌లిగిన ఆటోమొబైల్ కంపెనీ అయిన మారుతి సుజుకి.. త‌న బ‌లెనో మోడ‌ల్ ఆల్ఫా వేరియంట్​లో క్రూయిజ్ కంట్రోల్ అందిస్తుంది. ఈ ఫీచ‌ర్ ఉంటే మంచి డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ తో పాటు హాయిగా ఉంటుంది.ఇందులో మాన్యువ‌ల్, ఆటోమేటిక్ రెండు ర‌కాల ఆప్ష‌న్స్ ఉన్నాయి. మాన్యువల్ అయితే రూ. 9.33 లక్షలు, ఆటోమేటిక్ అయితే రూ. 9.88 లక్షలు ఉంది.

Maruti Suzuki Swift :మారుతి సుజుకి కంపెనీ టాప్ వేరియంట్ అయిన స్విఫ్ట్ ZXIలో క్రూయిజ్ కంట్రోల్‌ని కలిగి ఉంది. పెట్రోల్ మాన్యువ‌ల్ ధర రూ. 8.34 లక్షలు. అదే ఆటోమేటిక్ అయితే దీని రూ. 8.89 లక్షలు ఉంది. ఈ కారు 1.2L పెట్రోల్ ఇంజిన్ సామ‌ర్థ్యం, 90PS పవర్, 113Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Nissan Magnite :నిస్సాన్ మాగ్నైట్ దాని XV ప్రీమియం వేరియంట్‌లో క్రూయిజ్ కంట్రోల్ అందిస్తుంది. ఇందులోనూ రెండు ఆప్ష‌న్లు ఉన్నాయి. సాధారణ పెట్రోల్, టర్బో పెట్రోల్ ఇంజిన్ల‌లో ఈ ఫీచ‌ర్ ఉంది. వాటి ధ‌ర‌లు వ‌రుస‌గా రూ. 8.59 లక్షలు, రూ. 10.66 లక్షలు. ఈ కార్ లో విభిన్న డ్రైవింగ్ ప్రాధాన్యాల‌ను అందిస్తోంది.

Tata Altroz XT :టాటా ఆల్ట్రోజ్ XT కూడా క్రూయిజ్ కంట్రోల్ ఫీచ‌ర్ అందిస్తోంది. ధర పెట్రోల్-మాన్యువల్ వెర్షన్ అయితే రూ. 8.08 లక్షలు. అదే డీజిల్ అయిదు రూ. 9.35 లక్షలు. Altroz XT 88PS పవర్, 115Nm టార్క్‌తో 1.2L పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది.

చైల్డ్ సేఫ్టీలో కియా శభాష్​- మహీంద్రా కారుకు సింగిల్ స్టార్ రేటింగ్- కంపెనీ ఏమందంటే? - Cars NCAP Rating

కోటక్​ బ్యాంక్​కు RBI షాక్​ - కొత్త అకౌంట్లు, క్రెడిట్​ కార్డ్​లపై బ్యాన్​! - RBI Bars Kotak Mahindra Bank

ABOUT THE AUTHOR

...view details