తెలంగాణ

telangana

చికెన్ ఇలా చుట్టేసి ఇవ్వండి - పిల్లలు "మమ్మీ యమ్మీ" అంటూ లాగిస్తారు! - Restaurant Style Chicken Tikka Roll

By ETV Bharat Telangana Team

Published : Apr 14, 2024, 7:33 AM IST

Chicken Tikka Roll Recipe in Restaurant Style : పిల్లల నుంచి పెద్దల వరకూ.. మెజారిటీ జనాలు ఇష్టపడే నాన్​ వెజ్​ ఐటమ్ చికెన్. దీంతో ఎన్నో వైరైటీలు ప్లాన్ చేయొచ్చు. మరి.. ఈ సండే రెస్టారెంట్ స్టైల్​లో చికెన్ టిక్కా రోల్ ప్రిపేర్ చేద్దామా?

How to Make  Restaurant Style Chicken Tikka Roll Recipe at Home in Telugu
How to Make Restaurant Style Chicken Tikka Roll Recipe at Home in Telugu

Chicken Tikka Roll Recipe in Restaurant Style : పిల్లలు ఎదగాలంటే తగిన ప్రొటీన్ కంపల్సరీగా ఉండాలి. లేదంటే.. వయసుకు తగ్గ బరువు లేక ఇబ్బంది పడుతుంటారు. మీ పిల్లలు ఈ పరిస్థితిలో ఉంటే.. వెంటనే వారికి ప్రొటీన్ రిచ్ ఫుడ్ అందించాలి. శరీరానికి ప్రొటీన్​తోపాటు నాలుకపైనున్న టేస్టీ బడ్స్​ కోరిక కూడా తీరాలంటే.. ఈ సండే మెనూలో తప్పకుండా చికెన్ ఉండాల్సిందే.

అయితే.. చాలా మంది పిల్లలు నాన్​ వెజ్​ తినే అలవాటు ఉన్నప్పటికీ.. కొద్దిగా మాత్రమే తీసుకుంటారు. మరికాస్త తినమంటే.. సరిపోయిందంటారు. ఇలాంటి వారికి మీరు ఈ చికెన్​ రెసిపీతో ఫుల్లుగా బొజ్జ నింపేయొచ్చు. అదే.. చికెన్ టిక్కా రోల్. రెస్టారెంట్​ స్ట్లైల్లో ఇలా చేసి ఇచ్చారంటే.. "మమ్మీ.. యమ్మీ" అంటూ లాగిస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం? అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

చికెన్ టిక్కా తయారీకి కావాల్సిన పదార్థాలు :

బోన్​ లెస్ చికెన్ - అరకేజీ

కారం - టీస్పూన్

మిరియాల పొడి - టీస్పూన్

జీలకర్ర పొడి - టీస్పూన్

ధనియా పొడి - టీస్పూన్

మసాలా పొడి - స్పూన్

టమాటా కెచప్ - రెండు టేబుల్ స్పూన్లు

కొత్తిమీర తురుము - గుప్పెడు

పుదీనా - 10 -12 ఆకులు

నిమ్మకాయ - ఒక ముక్క

రెడ్ చిల్లీ ఫ్లేక్స్ - రెండు టేబుల్ స్పూన్లు

ఉప్పు - రుచికి సరిపడా

పెరుగు - నాలుగు టేబుల్ స్పూన్లు

ఆయిల్ - నాలుగు టేబుల్ స్పూన్లు

అల్లం పేస్ట్ - రెండు టీస్పూన్లు

ఆల్ మిక్స్డ్​ ఫ్లోర్ - రెండు కప్పులు

గోధుమ పిండి - రెండు కప్పులు

చక్కెర - 1/2 స్పూన్

మిల్క్ - అర కప్పు

గ్రీన్ చిల్లీ - 4

యౌగర్ట్ - ఒక కప్పు

చాట్ మసాలా - ఒక స్పూన్

ఉల్లిపాయ - ఒకటి

క్యాప్సికమ్ - ఒకటి

మయోన్నైస్ - రెండు టేబుల్ స్పూన్లు

తయారు చేసే విధానం :

ఫస్ట్ బోన్ లెస్ చికెన్​ను బౌల్​లోకి తీసుకోవాలి. అందులో కారం, జీరా పొడి, మిరియాల పొడి, ధనియా పొడి, మసాలా, టమాటా కెచప్, పుదీనా, కొత్తిమీర, 4 టేబుల్ స్పూన్ల పెరుగు, నిమ్మ రసం, 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఉప్పు, కారం వేయాలి. ఈ మిశ్రమం చికెన్ ముక్కలకు పట్టేలా బాగా మిక్స్ చేసి, పక్కన పెట్టాలి. ఛాన్స్ ఉంటే గంటకు పైగా మారినేట్ చేస్తే ఇంకా మంచిది. ఆ తర్వాత వీటిని ఎయిర్ ఫ్రయర్​లో.. ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు.. మరో బౌల్ తీసుకోవాలి. అందులో గోధుమపిండి, ఆల్​ మిక్స్డ్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల నూనె, అర టీస్పూన్ పంచదార, ఉప్పు, పాలు వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. మెత్తగా కలిపి పక్కన పెట్టాలి.

తర్వాత.. మిక్సీజార్​ తీసుకొని అందులో అరకప్పు పుదీనా, పచ్చిమిర్చి, పంచదార, పెరుగు వేసి చక్కగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఒక గిన్నెలో యోగర్ట్ వేసి అందులో.. మిక్సీ పట్టుకున్న మిశ్రమం, చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా కలపాలి.

ఇప్పుడు.. కలిపి పక్కన పెట్టిన పిండి ఉంది కదా.. దాన్ని చపాతీలుగా ఒత్తుకోవాలి. లేయర్స్ లేయర్స్ వచ్చేలా మడిచి రెడీ చేసిన చపాతీలను.. పెనం మీద వేసి రోస్ట్ చేయాలి. రెండు వైపులా రోస్ట్ పూర్తయిన తర్వాత.. పుదీనా, యోగర్ట్ మిశ్రమాన్ని ఈ చపాతీలపై అప్లై చేయాలి. ఆ తర్వాత.. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్​ను ఈ చపాతీపై పెట్టి.. క్యాప్సికమ్, మయోన్నైస్, ఉల్లిపాయలతో గార్నిష్ చేసి రోల్స్​లా చుట్టుకోవాలి అంతే. వీటిని సిల్వర్ ఫాయిల్​తో చుట్టుకొని పిల్లల చేతికి అందించడమే. అద్దిరిపోయే రెస్టారెంట్​ స్టైల్​లో ఉన్న ఈ టేస్టీ చికెన్ టిక్కా రోల్​ను.. "మమ్మీ.. యమ్మీ" అనకపోతే చూడండి!

ABOUT THE AUTHOR

...view details