తెలంగాణ

telangana

"రామ్‌ హల్వా"ను ఎప్పుడైనా తిన్నారా? - ఆ రుచికి మైమరచిపోవాల్సిందే!

By ETV Bharat Telugu Team

Published : Jan 27, 2024, 10:21 AM IST

How To Make Ram Halwa : దేవుడికి సమర్పించే నైవేద్యాల్లో హల్వా ఒకటి. తొందరంగా రెడీ అవడంతోపాటు, ఎంతో రుచికరంగా ఉండటంతో ఎక్కువగా దీనిని తయారు చేస్తుంటారు. అయితే.. క్యారెట్‌తోనో లేదా బ్రెడ్‌తోనో హల్వా చేసి ఉంటారు. మరి.. "రామ్‌ హల్వా" ఎప్పుడైనా టేస్ట్ చేశారా?

How To Make Ram Halwa
How To Make Ram Halwa

How To Make Ram Halwa : హల్వా అంటే ఇష్టంలేని వారు దాదాపుగా ఎవరూ ఉండరు. తొందరగా ఏదైనా స్వీట్‌ రెసిపీ చేయాలంటే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది ఇదే. అయితే.. చాలా మంది హల్వా అనగానే, క్యారెట్, బ్రేడ్‌తోనే చేయాలని అనుకుంటారు. కానీ.. అందరి ఇళ్లలో ఉండే పెసర పప్పుతో కూడా హల్వాను తయారు చేయవచ్చని మీకు తెలుసా ?

అవునండీ.. పెసర పప్పుతో కూడా హల్వా తయారు చేయవచ్చు. మనం ప్రతిసారీ పెసర పప్పుతో చారు, కర్రీ చేసుకుంటాం. కానీ.. ఒక్కసారి హల్వాను ఇలా ట్రై చేయండి. అది తిన్నవారంతా మీకు ఫ్యాన్‌ అయిపోవడం ఖాయమంటే నమ్మండి! ఇది కేవలం రుచికరంగా ఉండడమే కాదు.. ఆరోగ్యానికీ చాలా మంచిది. పెసరపప్పు తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. పలు విధాలుగా ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇవాళే మీ ఇంట్లో పెసర పప్పుతో రామ్ హల్వా చేయండి. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

రామ్‌ హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..

  • 1 కప్పు పెసర పప్పు
  • 1 కప్పు నెయ్యి
  • 1 కప్పు చక్కెర
  • 3 కప్పుల పాలు
  • 1/2 టీస్పూన్ యాలకుల పొడి
  • చిటికెడు కుంకుమపువ్వు
  • గార్నిష్ కోసం కట్‌ చేసిన డ్రై ఫ్రూట్స్‌ (బాదం, జీడిపప్పు, పిస్తా)

పెసర పప్పు హల్వాను తయారు చేసే విధానం..

  • ముందుగా తీసుకున్న ఒక కప్పు పెసర పప్పును గిన్నెలో 4 నుంచి 5 గంటలు నీటిలో నానబెట్టాలి.
  • ఇప్పుడు పప్పును నీటి నుంచి వేరు చేయాలి.
  • ఆ తరవాత పప్పును మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా నీళ్లు యాడ్‌ చేసుకోవచ్చు.
  • ఇప్పుడు ఒక పాన్‌లో 3 కప్పుల పాలను వేసుకుని వేడి చేయండి.
  • అందులోకి కుంకుమ పువ్వు యాడ్‌ చేయండి. ఆ తరవాత కప్పు షుగర్‌ వేసి సిరప్‌లా సిద్ధం చేసుకోండి.
  • ఇప్పుడు మరొక స్టవ్‌ మీద పాన్‌ను పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేయండి. అందులో బాదం, పిస్తా, కిస్మిస్‌ వంటివి వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి.
  • తరవాత అదే పాన్‌లో ఇంకాస్త నెయ్యిని వేసి మెత్తగా పట్టుకున్న పెసర పప్పు మిశ్రమాన్ని వేసి బాగా కలపండి.
  • మిశ్రమం ముద్దగా కాకుండా ఉండేంత వరకు కలపాలని గుర్తుంచుకోండి.
  • ఇప్పుడు ఈ మిశ్రమంపై 1/2 టీస్పూన్ యాలకుల పొడిని చల్లి, బాగా కలుపుకోండి.
  • పప్పు పొడిగా మారిన తరవాత ముందుగా తయారు చేసుకున్న పాల సిరప్‌ను వేసుకుని బాగా కలపండి.
  • ఆ తరవాత గార్నిష్‌ కోసం డ్రై ఫ్రూట్స్‌ను చల్లుకుని సర్వ్‌ చేసుకోండి.
  • అంతే ఎంతో టెస్టీగా ఉండే రామ్ హల్వా రెడీ.
  • ఈ సారి మీరు కూడా ట్రై చేయండీ.. ఇంటిల్లిపాదీ హల్వా టేస్ట్​ను ఎంజాయ్ చేయండి.

బ్రెడ్​తో స్పైసీ స్పైసీ వంటలు- తిన్నారంటే మళ్లీ మళ్లీ చేసుకోవడం పక్కా!

ఈ పోషకాలను తాగేయండీ.. రోజంతా ఉత్సాహంగా ఉండండి..!

Corn recipes : కార్న్​తో వెరైటీ వంటకాలు.. తింటే వాహ్వా అంటారు...

ABOUT THE AUTHOR

...view details