తెలంగాణ

telangana

చికెన్ మహారాజ రెసిపీ - ఒక్కసారి తిన్నారంటే

By ETV Bharat Telugu Team

Published : Feb 3, 2024, 3:50 PM IST

How to Make Maharaja Curry: చికెన్​లో ఎన్ని వెరైటీలు ఉన్నాయో చాలా మందికి తెలియదు. అందుకే రకరకాల రెసిపీలను మీకు పరిచయం చేస్తున్నాం. ఈసారి వెరీ స్పెషల్.. "మహారాజ చికెన్ కర్రీ"ని తీసుకొచ్చాం. తిన్నారంటే అద్భుతంగా ఫీలవుతారు!

How to Make Maharaja Curry
How to Make Maharaja Curry

How to Make Maharaja Curry: చికెన్​.. ఈ పేరు వింటేనే నోట్లో లాలాజలం ఊరుతుంది. కనీసం వారంలో రెండు లేదా మూడు సార్లు అయినా చికెన్​ లాగిస్తుంటారు చాలా మంది. అయితే.. చాలా ఇళ్లలో చికెన్​ కూర, పులుసు, ఫ్రై.. ఇలానే చేసుకుంటారు. వెరైటీగా ట్రై చేయాలంటో అదో పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. అందుకే.. వెరైటీస్ అన్నీ బయట రెస్టారెంట్లకు వెళ్లి తింటుంటారు. ఒకటీ రెండు సార్లు అయితే బయట ఒకే.. కానీ పిల్లలు తరచూ తినాలని కోరుకుంటే మాత్రం ఇంట్లో చేసుకోవడమే బెటర్​. ఇవాళ మీ కోసం మహారాజ చికెన్ కర్రీ తీసుకొచ్చాం. మరి.. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..

మహారాజ​ కర్రీ: ఈ కూరలను రాజుల కాలంలో వడ్డించేవారంట. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ఇక ఈ వంటకంలో అసలైన రుచిని ఇచ్చేది గ్రేవీ. టమాట, ఉల్లిపాయ, జింజర్ ఫ్లేవర్‌తో కూడిన రుచికరమైన గ్రేవీ సూపర్​ టేస్టీగా.. ఘుమఘుమలాడుతూ ఉంటుంది. మరి దీనిని ఎలా చేయాలంటే..

మహారాజ చికెన్​ కర్రీకి కావాల్సిన పదార్థాలు:

  • చికెన్​ బ్రెస్ట్​- 500 గ్రాములు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​- రెండు టీ స్పూన్లు
  • గరం మసాలా- ఒకటిన్నర స్పూన్లు
  • పసుపు- కొద్దిగా
  • జీలకర్ర- 1 టీస్పూన్​
  • టమాట-6
  • కారం-రుచికి సరిపడా
  • ఉల్లిపాయలు-3
  • నూనె-తగినంత
  • ఉప్పు- రుచికి సరిపడా

తందూరి చికెన్ రోల్స్ ట్రై చేస్తారా? - ఇంట్లోనే యమ్మీ యమ్మీగా లాంగిచేస్తారు!

తయారీ విధానం:

  • ముందుగా చికెన్​ బ్రెస్ట్​ను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్​ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • అలాగే టమాట, ఉల్లిపాయలను సన్నగా కట్​ చేసుకుని వాటిని కూడా పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ మీద మందం గిన్నె పెట్టి.. తగినంత నూనె పోసి మీడియం ఫ్లేమ్​లో పెట్టుకోవాలి.
  • నూనె వేడెక్కాక.. జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత కట్​ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుని గోల్డెన్​ కలర్​ వచ్చేవరకు వేయించుకోవాలి.
  • తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా వేసుకుని ఓ మూడు నిమిషాలు వేయించుకుని స్టవ్​ ఆఫ్​ చేసి చల్లారనివ్వాలి.
  • ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్​లోకి తీసుకుని అందులో టమాట ముక్కులు వేసుకుని మెత్తని ప్యూరీలాగా పట్టుకోవాలి.
  • ఇప్పుడు ఈ ప్యూరీని అంతకుముందు స్టవ్​ మీద పెట్టిన గిన్నెలోకి వేసుకుని అందులోనే చికెన్​ ముక్కలు వేసుకోవాలి. ఒకవేళ నూనె సరిపోకపోతే కొద్దిగా యాడ్​ చేసుకోవచ్చు.
  • ఇప్పుడు స్టవ్​ను సిమ్​లో పెట్టి 20 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మహరాజ కర్రీ రెడీ.
  • దీన్ని చపాతీ, పరాటా, అన్నం.. ఎందులోకి తిన్నా వేళ్లతో సహా నాకేస్తారు.

క్రిస్పీ పొటాటో లాలీపాప్స్​- ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తినడం పక్కా!

బీట్​రూట్​ పరాటా - టేస్ట్​ మాత్రమే కాదు, బెనిఫిట్స్​ కూడా సూపర్​! మీరు ట్రై చేయండి!

ABOUT THE AUTHOR

...view details