తెలంగాణ

telangana

'JEE చదవలేను, అమ్మా, నాన్న క్షమించండి'- కోటాలో మరో విద్యార్థి సూసైడ్​

By ETV Bharat Telugu Team

Published : Jan 29, 2024, 7:33 PM IST

Updated : Jan 29, 2024, 8:53 PM IST

Girl Commits Suicide In Kota : జేఈఈ మెయిన్స్‌కు సన్నద్ధమవుతున్న 18 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోటీ పరీక్షలకు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్‌లోని కోటాలో ఈ ఘటన జరిగింది. రానున్న పోటీ పరీక్షలో తాను ఉత్తీర్ణత సాధించలేనంటూ తల్లిదండ్రులకు సూసైడ్‌ నోట్‌ రాసింది.

JEE Student Commits Suicide Today In Kota
కోటాలో ఆగని విద్యార్థుల సూసైడ్స్​- చదువు ఒత్తిడితో మరో విద్యార్థి ఆత్మహత్య​!

Girl Commits Suicide In Kota : పోటీ పరీక్షలకు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్‌ కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడంలేదు. జేఈఈ మెయిన్స్‌కు సన్నద్ధమవుతున్న మరో విద్యార్థిని తాజాగా బలవన్మరణానికి పాల్పడింది. తాను చదవలేకపోతున్నానని, క్షమించాలంటూ తల్లిదండ్రులకు ఆత్మహత్య లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది.

ఎల్లుండే పరీక్ష- అంతలోనే
18 ఏళ్ల విద్యార్థిని కోటాలో 12వ తరగతి చదువుతోంది. JEE పోటీ పరీక్షల కోసం స్థానిక కోచింగ్‌ సెంటర్‌లో చేరిన ఆమె, సోమవారం తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన బాలిక తల్లిదండ్రులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గదిలో విద్యార్థిని రాసిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు గుర్తించారు. అందులో తాను JEE చదవలేకపోతున్నానని రాసింది. తాను ఓడిపోయానని, తన తల్లిదండ్రులను క్షమించమని కోరింది. జనవరి 31న JEE పరీక్ష రాయాల్సి ఉండగా, మానసిక ఒత్తిడి వల్లే ఆమె ఆత్మహత్య చేసుకొని ఉంటుందని పోలీసులు వెల్లడించారు.

"అమ్మా, నాన్నా నేను జేఈఈ చదువు చదవలేను. అందుకే సూసైడ్​ చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నా. నేను ఓడిపోయాను. నన్ను క్షమించండి."
-సూసైడ్​ నోట్​

నెలలో రెండో సూసైడ్​
కోటాలో ఈనెలలో వెలుగుచూసిన రెండో ఘటన ఇది. జనవరి 23న ఓ ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్​లో 'నీట్‌' శిక్షణ తీసుకుంటున్న ఓ విద్యార్థి ఇదే తరహాలో ఆత్మహత్య చేసుకున్నాడు. గతేడాది కూడా కోటాలో వరుసగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు వెలుగుచూశాయి. 2023లో 20 మందికి పైగా విద్యార్థులు తమ ప్రాణాలు కోల్పోయారు.

స్ప్రింగ్​ ఫ్యాన్​లు అమర్చినా సరే
అయితే ఈ మరణాలపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతేగాక కోటాలోని కోచింగ్​ సెంటర్లకు పలు మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో విద్యార్థులపై ఒత్తిడి పెంచేలా శిక్షణ ఇవ్వకూడదని పేర్కొంది. మరోవైపు విద్యార్థుల ఆత్మహత్యలను కంట్రోల్​ చేసేందుకు సెంటర్​ల భవనాల చూట్టూ ఇనుప ఫెన్సింగ్​ను ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఉండే గదుల్లో స్ప్రింగ్​ ఫ్యాన్​లను బిగించారు. అయినాసరే వరుస ఆత్మహత్యలు జరుగుతుండడం బాధిత తల్లిదండ్రులను కలవరానికి గురిచేస్తోంది.

ల్యాబ్​లో చేప మాంసం తయారీ- డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్లేనట!

హనుమాన్​ జెండాపై వివాదం- కర్ణాటకలో కాంగ్రెస్​-బీజేపీ మధ్య మాటల యుద్ధం!

Last Updated :Jan 29, 2024, 8:53 PM IST

ABOUT THE AUTHOR

...view details