తెలంగాణ

telangana

బతికే ఉన్నానని 18ఏళ్లు న్యాయపోరాటం- ఇప్పుడు కాశీలో మోదీపై పోటీ- బరిలో ట్రాన్స్​జెండర్ కూడా! - Man And Transgender Fight On Modi

By ETV Bharat Telugu Team

Published : Apr 10, 2024, 11:13 AM IST

Common Man Contesting On PM Modi : తాను చనిపోయాడంటూ రికార్డుల్లో నమోదు చేసిన అధికారుల తీరుకు నిరసనగా 18 ఏళ్లపాటు న్యాయపోరాటం చేసి గెలిచిన ఓ వ్యక్తి లోక్​సభ ఎన్నికల్లో ఏకంగా ప్రధాని మోదీపై పోటీ చేసేందుకు సిద్ధం అయ్యారు. మరోవైపు వారణాసి నుంచి ఓ ప్రముఖ ట్రాన్స్​జెండర్​ సైతం మోదీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Common Man And Transgender Election Fight On PM Modi
Common Man And Transgender Election Fight On PM Modi

Common Man Contesting On PM Modi :బతికిఉన్న తనను చనిపోయావంటూ రికార్డుల్లోకి ఎక్కించిన అధికారుల తీరుకు విసుగు చెంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 ఏళ్లు న్యాయపోరాటం చేసి గెలిచారు ఆ వ్యక్తి. ఆయన ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల బరిలో ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీపైనే పోటీకి సిద్ధమయ్యారు (Lok Sabha Elections 2024). ఆయనే ఉత్తర్​ప్రదేశ్​లోని అజంగఢ్‌ జిల్లాకు చెందిన సామాన్య వ్యక్తి లాల్​ బిహారీ.

18ఏళ్ల న్యాయపోరాటం
Living Person Shown Dead In Govt Records Of UP :లాల్​ బిహారీ మరణించారంటూ కొన్నేళ్ల క్రితం సంబంధిత పరిపాలనా యంత్రాంగం ఆయన పేరును అధికారిక రికార్డుల్లో చేర్చింది. దీంతో ఆందోళన చెందిన ఆయన ఇంకా సజీవంగా ఉన్న తన పేరును అధికారిక లెక్కల్లో నుంచి తొలగించాలని చాలాసార్లు అధికారులను ప్రాధేయపడ్డాడు. అయినా ఫలితం లేకపోవడం వల్ల హైకోర్టు గడపతొక్కారు. ఇక్కడ ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అలా ఏకంగా 18 ఏళ్లపాటు న్యాయపోరాటం చేసి విజయం సాధించారు లాల్​.

లాల్​ బిహారీ పాలిటిక్స్​
1988 లోక్‌సభ ఎన్నికల్లో అలహాబాద్​ స్థానం నుంచి దివంగత మాజీ ప్రధాని వీపీ సింగ్‌పై పోటీ చేశారు లాల్​ బిహారీ. ఆ తర్వాత అమేఠీ నుంచి రాజీవ్​ గాంధీపై పోటీ చేశారు. ఇలా పలు ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ఈసారి దేశ ప్రధానిపైనే పోటీకి సై అంటున్నారు. నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. త్వరలోనే నామినేషన్​ పత్రాలను కూడా దాఖలు చేయనున్నట్లు తెలిపారు లాల్​ బిహారి.

ఎన్నికల్లో ఓటమి- కానీ అక్కడ విజయం
అజంగఢ్‌ జిల్లాకు చెందిన లాల్​ బిహారీ 1976లో చనిపోయినట్లు ప్రభుత్వ రికార్డుల్లో చూపించారు అధికారులు. దీనిని తొలగించేందుకు ఆయన కార్యాలయాల చుట్టూ ఎంత తిరిగినా ఫలితం దొరకలేదు. దీంతో అతను జీవించి ఉన్నానని నిరూపించుకునేందుకు పెద్ద పెద్ద నాయకులపై ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా 1980లో 'లాల్​ బిహారీ మృత సంఘ్' అనే దానిని స్థాపించారు.

అలా ఈ సంఘం తరఫున 1988లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అలహాబాద్​ స్థానం నుంచి వీపీ సింగ్‌పై పోటీ చేసి ఓడిపోయారు. కాగా, ఈ స్థానంలో అప్పటికే ఎంపీగా కొనసాగుతున్న బాలీవుడ్​ బిగ్​బీ అమితాబ్​ బచ్చన్ రాజీనామా చేయడం వల్ల ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. అనంతరం దివంగత మాజీ ప్రధాని రాజీవ్​ గాంధీపై అమేఠీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినాసరే ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రం మానలేదు లాల్​ బిహారీ.

2004లో అజంగఢ్‌లోని లాల్‌గంజ్​ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కూడా ఎన్నికల్లో పోటీ చేశారు. 1991, 2002, 2007 సంవత్సరాల్లోనూ ఇదే జిల్లాలోని ముబారక్‌పుర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సైతం ఎన్నికల బరిలో నిలిచారు. మొత్తంగా లోక్​సభ, అసెంబ్లీ ఎన్నికల్లో చెరో మూడుసార్లు పోటీ చేశానని తెలిపారు లాల్​ బిహారీ.

లాల్​ బిహారీ

లాల్​ బిహారీయే కాదు
ప్రభుత్వ రికార్డుల నుంచి లాల్​ బిహారీ పేరు తొలగింపు విషయంలో 1994లో హైకోర్టు లాల్​ బిహారీకి అనుకూలంగా తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాలతో అధికారులు ఆయన పేరును రికార్డుల్లో నుంచి తొలగించారు. అచ్చం ఇదే తరహా సంఘటనను జిల్లాలోని సుర్హాన్ నివాసి రాంబచన్ రాజ్‌భర్ కూడా ఎదుర్కొన్నారు. ఈయన కూడా మార్టిన్‌గంజ్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈయనకు 'లాల్​ బిహారీ మృత సంఘ్'తో సంబంధం ఉంది.

మోదీపై ట్రాన్స్​జెండర్​ పోటీ!
Transgender Contesting On PM Modi :ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీగా ఓ ట్రాన్స్‌జెండర్‌ బరిలోకి దిగనున్నారు. ప్రపంచంలోనే తొలి ట్రాన్స్‌జెండర్‌ భగవద్గీత బోధకురాలిగా గుర్తింపు పొందిన మహామండలేశ్వర్‌ హేమాంగి సఖి మా సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

యూపీలో 20 స్థానాల్లో పోటీ చేస్తున్న అఖిల భారత హిందూ మహాసభ వారణాసి నుంచి తమ అభ్యర్థిగా మాహామండలేశ్వర్‌ హేమాంగి సఖి మా పేరును ప్రకటించింది. శ్రీకృష్ణునిపై అపరిమిత భక్తి కలిగిన హేమాంగి వారణాసి బరిలో ఉండటం వల్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఏప్రిల్‌ 10న హేమాంగి వారణాసిలో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఆ రాష్ట్ర చీఫ్‌ అజయ్‌రాయ్‌ను బరిలో దింపింది. గతంలో కూడా అజయ్‌రాయ్‌ మోదీ చేతిలో ఓటమి చవిచూశారు. వారణాసిలో చివరి దశ ఎన్నికల్లో భాగంగా జూన్‌ 1వ తేదీన పోలింగ్‌ జరగనుంది.

అదిరిందమ్మా అదితి- రాజకీయాల్లోకి ములాయం మనమరాలు! - Aditi Yadav Election Campaign

అయోధ్య గుడికి కానుకగా 7 కిలోల 'బంగారు రామాయణం' - 7KGS GOLD RAMAYANA TO AYODHYA RAM

ABOUT THE AUTHOR

...view details