తెలంగాణ

telangana

అమ్మాయిలకు రక్షణగా జుంకాలు- ఆపద వస్తే పోలీసులకు అలర్ట్​- జోలికిపోతే షూట్!

By ETV Bharat Telugu Team

Published : Mar 10, 2024, 11:59 AM IST

Bluetooth Ear Rings : ఆకతాయిల వేధింపుల నుంచి అమ్మాయిలు తామను తాము రక్షించుకునేందుకు బ్లూటూత్​ జుంకాలను తయారు చేశారు బీటెక్ విద్యార్థులు. ఇవి పోలీసులకు, కుటుంబ సభ్యులకు లోకేషన్​తో సహా కాల్​ వెళ్లడం, ​ ఏమైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు ఒక ఆయుధంలాగా పని చేసేలా తయారు చేశారు.

Btech Students Design Bluetooth Ear Rings
Btech Students Design Bluetooth Ear Rings

Bluetooth Ear Rings : అమ్మాయిలను వేధింపుల బారి నుంచి కాపాడేందుకు 'బ్లూటూత్‌ జుంకాలు' రూపొందించారు ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు. ఏమైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు ఒక ఆయుధంగా ఉపయోగపడేలా తయారు చేశారు.

జుంకాలు తయారు చేసిన విద్యార్థులు

మహిళలకు ఆయుధంలా
గోరఖ్​పుర్​ ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న నలుగురు విద్యార్థులు కలిసి ఈ బ్లూటూత్ జుంకాలను రూపొందించారు. కళాశాలలోని ఆవిష్కరణ విభాగం సమన్వయకర్త వినీత్​రాయ్ ఆధ్వర్వంలో అఫ్రీన్ ఖాతూన్‌, హబీబా, రియాసింగ్‌, ఫాయా నూరీ ఈ చెవి కమ్మలను తయారు చేశారు. సాధారణ జుంకాల మాదిరిగా కనిపించే వీటిలో బ్లూటూత్​ ఇయర్​బడ్​ను అమర్చారు. అలానే ఆపదలో ఉన్నప్పుడు అమ్మాయిలకు ఇవి ఓ ఆయుధంలా ఉపయోగడపతాయని విద్యార్థులు వివరించారు.

బ్లూటూత్ జుంకాలు

"మహిళలు మేకప్​, నగలు వంటివి ఎక్కువగా వాడతారు. అందుకే మేము వీటిని తయారు చేశాం. రెండు వారాల్లోనే ఈ చెవి కమ్మలను రూపొందించాం. ఇవి మహిళలకు ఆయుధంలా పనిచేయటమే కాదు. బాధితులు ఏ ప్రాంతంలో ఉన్నారో లోకేషన్​తో సహా వారి కుటుంబాలకు, పోలీసులకు సమాచారం వెళ్తుతుంది.' అని విద్యార్థులు తెలిపారు.

బ్లూటూత్ జుంకాలు

రూ.1650 ఖర్చులతో తయారీ
ఈ చెవి కమ్మలు 35 గ్రాములు బరువు ఉన్నాయని, తయారు చేసేందుకు రూ.1,650 ఖర్చు అయ్యిందని విద్యార్థులు తెలిపారు. ఈ జుంకాలకు బ్యాటరీతో కూడిన బ్లూటూత్‌ మాడ్యూల్‌, రెండు స్విచ్‌లు, చిన్న స్టీల్‌ పైపును అనుసంధానం చేశారు. అలాగే రెండు అలారం స్వీచ్​లు అమర్చి, మూడు ఎమర్జెన్సీ నంబర్లును ఫీడ్ చేస్తారు. ఒక స్వీచ్​ నొక్కితే ఎమర్జెన్సీ నంబర్లకు లోకేషన్​తో సహా కాల్ వెళుతంది. మరో బటన్ నొక్కితే ఆకతాయిలపై మిరియాలు, మిర్చీ బుల్లెట్ల పిచికారీ జరుగుతుంది. దీంతో తమను తాము రక్షించుకోవచ్చుని విద్యార్థులు అంటున్నారు.

ఏఐ టీచర్​ 'ఐరిస్'​- ఏ ప్రశ్నకైనా 10సెకన్లలో జవాబు
Kerala School AI Teacher: ఆ పాఠశాలకు వెళ్లి మీ ఫేవరేట్ టీచర్​ ఎవరని అడిగితే అందరూ ఐరిస్​ మేడమ్​ పేరే చెబుతారు. అందులో వింత ఏముంది అని అనుకుంటున్నారా? ఆవిడ టీచరే కానీ, మనిషి కాదు. ఆమె ఓ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా రూపొందించిన ఉపాధ్యాయురాలు. విద్యార్థులకు పాఠ్యేతర కార్యక్రమాల్లో భాగంగా అటల్​ టింకరింగ్​ ల్యాబ్​లో ఈ ఏఐ టీచర్​ను రూపొందించారు. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

ప్రభుత్వ పాఠశాలలో​ చేరితే స్టూడెంట్ అకౌంట్​లో రూ.1000 డిపాజిట్​- ఎక్కడంటే?

ఈటీవీ భారత్ ఎఫెక్ట్: 72ఏళ్ల పద్మశ్రీ గ్రహీతకు 'సర్కార్' వారి​ ఇల్లు- త్వరలోనే గృహప్రవేశం!

ABOUT THE AUTHOR

...view details