మహిళా కూలీలు ప్రయాణిస్తున్న ట్రాక్టర్​ బోల్తా - ఆరుగురికి త్రీవ గాయాలు

By ETV Bharat Telangana Team

Published : Dec 2, 2023, 6:40 PM IST

thumbnail

Tractor overturned at Komaram Bheem Asifabad : రోజువారి కూలీలతో ప్రయాణిస్తున్న ఓ ట్రాక్టర్​ అదుపు తప్పి బోల్తా పడిన ఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలో చోటు చేసుకుంది. గుండాల అటవీ ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటనలో ఆరుగురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తిర్యాణి మండలం గుండాల గ్రామానికి చెందిన సుమారు 20 మంది కూలీలు కూలీ పని చేసుకోవడానికి ట్రాక్టర్​లో బయల్దేరారు. ప్రయాణిస్తున్న సమయంలో ట్రాక్టర్​ అదుపుతప్పి బోల్తా పడింది.

Few women were injured due to an Accident : దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగురు మహిళా కూలీలకు గాయాలయ్యాయి. వాహనం బోల్తాపడిన విషయం తెలుసుకున్న సమీప గ్రామస్థులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని 108కి సమాచారం ఇచ్చారు. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయని స్థానికులు తెలిపారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను తిర్యాణి మండలంలోని ఆసుపత్రికి తరలించారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.