బియ్యం లారీ బ్రేకులు ఫెయిల్.. టోల్​ప్లాజాపైకి దూసుకెళ్లి బీభత్సం.. లైవ్ వీడియో

By

Published : Jul 31, 2023, 1:26 PM IST

thumbnail

Tamil Nadu truck hits toll plaza video : తమిళనాడు మధురైలో బ్రేకులు ఫెయిల్ అయిన ఓ లారీ బీభత్సం సృష్టించింది. మస్తాన్​పట్టి వద్ద టోల్ ప్లాజాపైకి లారీ దూసుకెళ్లింది. ఆపేందుకు ప్రయత్నించిన టోల్ ప్లాజా ఉద్యోగి సతీశ్ కుమార్​ను లారీ ఢీకొట్టింది. అతడిని కొద్దిమీటర్ల వరకు లారీ ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో సతీశ్ కుమార్ దుర్మరణం చెందాడు.

Madurai Masthanpatti toll plaza accident : పోలీసుల సమాచారం ప్రకారం.. బందికోయిల్ ప్రాంతంలోని ఓ వంతెన వద్దకు చేరుకోగానే బ్రేకులు ఫెయిల్ కావడం వల్ల లారీ అదుపుతప్పింది. వాహనాన్ని ఆపేందుకు డ్రైవర్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. రోడ్డు పక్కన ఉన్న ఓ చెట్టును ఢీకొట్టి లారీని ఆపేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. కానీ దగ్గర్లోనే పలు రెస్టారెంట్లు ఉండటం వల్ల అతడు వాహనాన్ని రోడ్డుపైనే పోనివ్వాల్సి వచ్చింది.

అనంతరం టోల్ ప్లాజా వద్దకు రాగానే.. అక్కడ లైన్​లో పలు వాహనాలు కనిపించాయి. వాటిని తప్పించి ఎదురుగా ఉన్న టోల్ బూత్​లవైపు లారీని పోనిచ్చాడు డ్రైవర్. ఈ క్రమంలోనే సతీశ్​ను ఢీకొట్టాడు. అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాతా లారీ వేగం తగ్గలేదు. ఎదురుగా వస్తున్న ఓ కారును ఢీకొట్టింది. ఆ వాహనంలోని ఇద్దరు ప్రయాణికులు, టోల్ ప్లాజాలో పనిచేసే ఓ మహిళా ఉద్యోగికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. లారీ ఆంధ్రప్రదేశ్​లోని కాకినాడ నుంచి కేరళకు 30 టన్నుల బియ్యం లోడుతో వెళ్తోందని చెప్పారు. డ్రైవర్ కె.బాలకృష్ణ.. గుంటూరుకు చెందిన వ్యక్తి అని వెల్లడించారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.