కాంగ్రెస్‌ ప్రభుత్వం పనితీరు సూపర్​ : నిర్మాత బండ్ల గణేశ్

By ETV Bharat Telangana Team

Published : Jan 7, 2024, 9:01 PM IST

thumbnail

Producer Bandla Ganseh About Congress Govt in Telangana : తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన నూతన కాంగ్రెస్‌ ప్రభుత్వం పనితీరు, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పరిపాలన బేషుగ్గా ఉందని సినీ నిర్మాత బండ్లగణేశ్​(Producer Bandla Ganesh) కొనియాడారు. రాష్ట్రంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా పని చేస్తోందని పేర్కొన్నారు. పరిపాలన అనుభవం లేకపోయినా మొదటిసారి సీఎం అయినప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే అధికారం చేపట్టి రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలు అమలు చేశారని గుర్తు చేశారు.

Producer Bandla Ganseh on Congress Government : ముఖ్యమంత్రి కేంద్రంతో తత్సంబంధాలు నెలకొనేలా ముందుకు వెళ్లడం శుభపరిణామమని, ఈ సంబంధాలు రాష్ట్రాభివృద్ధికి దోహదం చేస్తుందని బండ్ల గణేశ్​ అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రుల దగ్గర రాష్ట్ర సమస్యల గురించి వివరించడం చాలా గొప్ప విషయమని అన్నారు.  సీఎం రేవంత్‌కి ప్రజల్లో మంచి పేరు వస్తోందని, ఇది ఇలాగే కొనసాగాలని తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నారని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.