Prathidwani Program on World Cup 2023 : క్రికెట్ పండుగకు వెళాయే.. మరి సిద్ధంగా ఉన్నారా..?

By ETV Bharat Telugu Team

Published : Oct 4, 2023, 10:12 PM IST

thumbnail

Prathidwani Program on World Cup 2023 : క్రికెట్‌ అభిమానులకు అతిపెద్ద పండుగ మెుదలు కానుంది. 12 ఏళ్ల తర్వాత తిరిగి భారత్‌ వేదికగా జరగనున్న ప్రపంచకప్‌ కోసం భారతీయులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అసలే, క్రికెట్‌ అంటే ఎగిరి గంతేసే ప్రేక్షకులు ఉన్న భారత్‌లో ఈ వేడుకలు జరగడం.. అందులోనూ భారత్‌ హాట్‌ ఫేవరేట్‌ టీంగా బరిలోకి దిగుతుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ ఎక్కువైంది. 

ODI Worldcup 2023 :  46రోజుల పాటు జరిగే సమరం కోసం అన్ని దేశాల క్రీడకారులు ఇప్పటికే భారత్‌ చేరుకుని ప్రాక్టీస్‌ మెుదలు పెట్టారు. ఈ మెగా టోర్నీలో మీ అంచనా ప్రకారం టాప్-4 టీమ్స్ ఏవి? ఈసారి ప్రపంచకప్‌ ఎగరేసుకుని పోయే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయని అనుకుంటున్నారు? నవంబర్ 19 వరకు సాగనున్న ప్రపంచకప్‌లో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్న మ్యాచ్‌లు ఏవి? స్కోరింగ్స్ ఎలా ఉండొచ్చని అనుకుంటున్నారు? మరి, కప్‌ గెలిచేదెవరూ..? అతిథ్యమిస్తున్న భారత్‌ ఆటతీరు ఎలా ఉండనుంది..? ఈసారి భారత్‌ వేదికగా కొత్త రికార్డులు నెలకొనున్నాయా..?...ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.