కంచె దూకి మరీ వ్యాన్‌పై దాడి చేసిన చిరుత

By

Published : Dec 27, 2022, 11:39 AM IST

Updated : Feb 3, 2023, 8:37 PM IST

thumbnail

అసోంలోని జోర్హాట్‌లో ఓ చిరుత హల్‌చల్‌ సృష్టించింది. స్థానికంగా వరుస దాడులకు పాల్పడుతూ దాదాపు 15 మందిని గాయపర్చింది. ఇందులో ఇద్దరు అటవీశాఖ సిబ్బందీ ఉన్నారు. గత 24 గంటల వ్యవధిలో ఇక్కడి రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్​ నివాసితులతోపాటు పరిసర ప్రాంతాల్లోని మహిళలు, చిన్నారులపై చిరుత తన పంజా విసిరింది. చిరుత దాడి చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆర్‌ఎఫ్‌ఆర్‌ఐ క్యాంపస్‌ కంచె దూకి ఓ వ్యాన్‌పై దాడి చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని, వారి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు ఈ నేపథ్యంలో ప్రజలను ఇళ్లలోనే ఉండాలని సూచించినట్లు చెప్పారు. చిరుతను పట్టుకునే క్రమంలో ఎక్కడికక్కడ ఉచ్చులు బిగించిన అటవీశాఖ అధికారులు మత్తుమందు ఇచ్చి దాన్ని బంధించినట్లు తెలుస్తోంది.

Last Updated : Feb 3, 2023, 8:37 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.