Kasani Gnaneshwar on Chandrabau Health : 'జైలులో బాబుకు ఏదైనా జరిగితే.. జగన్ సర్కారే బాధ్యత వహించాలి'

By ETV Bharat Telangana Team

Published : Oct 13, 2023, 7:26 PM IST

thumbnail

Kasani Gnaneshwar React on Chandrabau Health : టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడుకు జైలులో ఏదైనా జరిగితే వైఎస్ జగన్ సర్కారే బాధ్యత వహించాల్సి ఉంటుందని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ మండిపడ్డారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ​భవన్​లో మాట్లాడిన కాసాని.. చంద్రబాబుకు సరైన వైద్య సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. 

Kasani on CBN Health : రోజురోజూకూ బాబు ఆరోగ్యం క్షీణిస్తోందని కాసాని ఆవేదన వ్యక్తం చేశారు. జైలు అధికారులు చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. రాజమండ్రిలో నారా భువనేశ్వరిని కలిసి సంఘీభావం తెలిపామన్నారు. జైలులో బాబుకు సరైన వసతులు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల వృద్ధిలో కీలక పాత్ర పోషించిన నారా చంద్రబాబును కాపాడుకోవడం.. ప్రతి ఒక్కరి బాధ్యత అని కాసాని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు తగవని.. త్వరలో జగన్​ను ప్రజలు ఇంటికి సాగనంపుతారన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.