ములుగులో గారెలు, బజ్జీలు వేస్తూ సీతక్క వినూత్న ఎన్నికల ప్రచారం
Congress MLA Seethakka Election Campaign 2023 : ములుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దనసరి అనసూయ సీతక్క ఇంటింటా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ములుగు జిల్లాలో పలు గ్రామాల్లో సీతక్క ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు. గ్రామ గ్రామాన ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తూ కార్యకర్తలలో జోష్ నింపుతున్నారు. ప్రచారంలో భాగంగా రోడ్డుపై చిరు వ్యాపారుల దగ్గరికి వెళ్లి స్వయంగా బజ్జీల బండి వద్ద గారెలు, బజ్జీలు వేస్తూ వినూత్న ప్రచారం చేపడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కరపత్రాలు పంచుతూ, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని సీతక్క ములుగు నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని ఆమె హామీ ఇస్తున్నారు. మీ ఇంటి ఆడపడుచుగా మీ ముందుకు వస్తున్నాను. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ములుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తానని సీతక్క అన్నారు.