నేతల మాటల యుద్ధం - 'విద్యుత్​, ధరణి'లే ప్రచార అస్త్రాలు

By ETV Bharat Telugu Team

Published : Nov 8, 2023, 6:57 AM IST

thumbnail

CM KCR VS Revanth Reddy : రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో రాజకీయ పార్టీలన్ని ప్రచారంలో జోరు కొనసాగిస్తున్నాయి. ప్రధాన పార్టీ నేతలంతా విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయాన్ని మరింత రసవత్తరం చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్​, కాంగ్రెస్​ నాయకుల మధ్య పరస్పర విమర్శలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్(KCR)​, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మధ్య వర్డ్ వార్ రాష్ట్రంలో చర్చనీయాంశమవుతోంది.

Revanth Reddy Fires on CM KCR : విద్యుత్, ధరణి అంశాలు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార కేంద్రంగా మారాయి. ముఖ్యమంత్రి కేసీఆర్..​ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మూడు గంటలు కరెంట్​తో పాటు ధరణిని ఎత్తివేస్తారని విమర్శిస్తుండగా.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆ విమర్శలను తిప్పికొడుతున్నారు. 24 గంటల విద్యుత్​తో పాటు ధరణి(Dharani)ని సాంకేతికంగా మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని రేవంత్ హామీ ఇస్తున్నారు. వీటితో పాటు రుణమాఫీ, రైతు బంధు.. ఇతర రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన పథకాలపై విమర్శలు చేస్తూ రేవంత్​ రెడ్డి ముందుకు సాగుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.